(Source: ECI/ABP News/ABP Majha)
ICICI Bank: హాట్ కేక్‌గా మారిన బ్యాంక్ స్టాక్, టార్గెట్ ప్రైస్‌లు పెంచిన ఎనలిస్ట్‌లు
స్టాక్ ప్రైస్‌లో మరో 30% ర్యాలీని సూచించేలా ప్రైస్ టార్గెట్‌ను అప్‌గ్రేడ్ చేసింది.
ICICI Bank Shares: భారతదేశంలో రెండో అతి పెద్ద ప్రైవేట్ రంగ రుణదాత అయిన ICICI బ్యాంక్, నాలుగో త్రైమాసికంలో బలమైన ఆర్థిక సంఖ్యలను ప్రకటించడంతో మార్కెట్ ఎక్స్‌పర్ట్‌లు బ్యాంక్ స్టాక్ మీద "బుల్లిష్ ఔట్‌లుక్" కొనసాగించారు. కొన్ని బ్రోకరేజీలు బ్యాంక్ ఆదాయ అంచనాలను, ప్రైస్ టార్గెట్లను పెంచాయి.
బ్రోకరేజ్ జెఫరీస్, FY24 అంచనాలను 5-9% పెంచింది, స్టాక్ ప్రైస్‌లో మరో 30% ర్యాలీని సూచించేలా ప్రైస్ టార్గెట్‌ను అప్‌గ్రేడ్ చేసింది.
నిన్న (సోమవారం, 24 ఏప్రిల్ 2023), NSEలో, ICICI బ్యాంక్ షేర్లు 2.2% పెరిగి ₹ 905.30 వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో ఈ షేరు నాలుగు నెలల గరిష్ట స్థాయి ₹906.50 కి చేరుకుంది. గత నెల రోజుల్లో ఈ కౌంటర్ దాదాపు 7% లాభపడింది.
BSE & NSEలో కలిపి రోజువారీ సగటు పరిమాణం 20 మిలియన్ షేర్లతో పోలిస్తే, నిన్న ఒక్కరోజే ఈ రెండు ఎక్స్ఛేంజీలలో కలిపి 30 మిలియన్లకు పైగా షేర్లు చేతులు మారాయి.
ఫలితాలకు ముందు- తర్వాత రేటింగ్స్
నాలుగో త్రైమాసిక ఆదాయాల తర్వాత, ఈ స్టాక్‌ను ట్రాక్ చేస్తున్న 32 మంది విశ్లేషకుల్లో 30 మంది "బయ్" లేదా "ఔట్‌పెర్ఫార్మ్" రేటింగ్ కార్డ్‌ను చూపించారు. ఇద్దరు "న్యూట్రల్"గా ఉన్నారు. బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం... స్టాక్‌పై ఏకాభిప్రాయ ధర లక్ష్యం 1% పెరిగి ₹1,128.17 కి చేరుకుంది,
బ్రోకరేజ్: CLSA
రేటింగ్: బయ్
ఫలితాలకు ముందు ప్రైస్ టార్గెట్: రూ. 1,180
ఫలితాల తర్వాత ప్రైస్ టార్గెట్: రూ. 1175
బ్రోకరేజ్: జెఫరీస్
రేటింగ్: బయ్
ఫలితాలకు ముందు ప్రైస్ టార్గెట్: రూ. 1200
ఫలితాల తర్వాత ప్రైస్ టార్గెట్: రూ. 1150
బ్రోకరేజ్: నువామా
రేటింగ్: బయ్
ఫలితాలకు ముందు ప్రైస్ టార్గెట్: రూ. 1,180
ఫలితాల తర్వాత ప్రైస్ టార్గెట్: రూ. 1,115
బ్రోకరేజ్: JP మోర్గాన్
రేటింగ్: ఓవర్‌వెయిట్
ఫలితాలకు ముందు ప్రైస్ టార్గెట్: రూ. 1,150
ఫలితాల తర్వాత ప్రైస్ టార్గెట్: రూ. 1,150
బ్రోకరేజ్: మోతీలాల్ ఓస్వాల్
రేటింగ్: బయ్
ఫలితాలకు ముందు ప్రైస్ టార్గెట్: రూ. 1,150
ఫలితాల తర్వాత ప్రైస్ టార్గెట్: రూ. 1,150
బ్రోకరేజ్: BNP పారిబాస్
రేటింగ్: బయ్
ఫలితాలకు ముందు ప్రైస్ టార్గెట్: రూ. 1,130
ఫలితాల తర్వాత ప్రైస్ టార్గెట్: రూ. 1,130
బ్రోకరేజ్: JM ఫైనాన్షియల్
రేటింగ్: బయ్
ఫలితాలకు ముందు ప్రైస్ టార్గెట్: రూ. 1,115
ఫలితాల తర్వాత ప్రైస్ టార్గెట్: రూ. 1,115
బ్రోకరేజ్: గోల్డ్‌మన్ సాక్స్
రేటింగ్: బయ్
ఫలితాలకు ముందు ప్రైస్ టార్గెట్: రూ. 1,100
ఫలితాల తర్వాత ప్రైస్ టార్గెట్: రూ. 1,076
బ్రోకరేజ్: సిటీ
రేటింగ్: బయ్
ఫలితాలకు ముందు ప్రైస్ టార్గెట్: రూ. 1,100
ఫలితాల తర్వాత ప్రైస్ టార్గెట్: రూ. 1,100
బ్రోకరేజ్: నోమురా
రేటింగ్: బయ్
ఫలితాలకు ముందు ప్రైస్ టార్గెట్: రూ. 1,100
ఫలితాల తర్వాత ప్రైస్ టార్గెట్: రూ. 1,100
జనవరి-మార్చి త్రైమాసికంలో NIM గరిష్ట స్థాయికి చేరుకున్నప్పటికీ, భవిష్యత్ వృద్ధి ఇంకా స్కోప్ ఉందని JP మోర్గాన్ అభిప్రాయపడింది.
భవిష్యత్ వృద్ధి, డిపాజిట్ల విషయంలో బ్యాంక్ మేనేజ్‌మెంట్ ఎటువంటి ఆందోళనలను వ్యక్తం చేయకపోవడంతో, ఈ స్టాక్‌పై CLSA అత్యంత బుల్లిష్‌గా ఉంది, ప్రైస్ టార్గెట్‌ను పెంచింది. ఇది, ప్రస్తుత స్థాయిల నుంచి దాదాపు 33% జంప్‌ను సూచిస్తోంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.