అన్వేషించండి

Soap Rates: ఇది గమనించారా?, - మీరు ప్రతిరోజూ వాడే సబ్బులు, టీ పొడి రేట్లు పెరిగాయి

HUL, Wipro Products Costly: హెచ్‌యుఎల్, విప్రో కంపెనీలు సబ్బుల రేట్లను పెంచాయి. టాటా సంస్థ టీ పొడి ధరలు పెంచింది.

Soaps, Personal Care And Skincare Product Prices Increased: దేశంలో పచ్చిమిర్చి నుంచి పప్పుల వరకు ప్రతి నిత్యావసర వస్తువు రేటు పెరుగుతోంది. కూరగాయల నుంచి కిరాణా వరకు, సామాన్యులు ప్రతిరోజు ఉపయోగించే ప్రతి వస్తువు ధర ఆకాశాన్నంటుతోంది. ఈ జాబితాలోకి ఇప్పుడు సబ్బు (Soap) కూడా చేరింది. హిందుస్థాన్‌ యూనిలీవర్‌ లిమిటెడ్‌ (HUL), విప్రో (Wipro) వంటి ప్రధాన కంపెనీలు సబ్బుల ధరలను సుమారు 7 నుంచి 8 శాతం వరకు పెంచాయి. 

సబ్బును తయారు చేయడంలో కీలక ముడి పదార్థం పామాయిల్. మన దేశం పామాయిల్‌ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతోంది. వాతావరణ పరిస్థితులు సక్రమంగా లేకపోవడంతో, పామాయిల్‌ను అత్యధికంగా ఉత్పత్తి చేసే మలేషియా, ఇండోనేషియా దేశాల నుంచి ఎగుమతులు తగ్గాయి. దీంతో, ప్రపంచ మార్కెట్లలో పామాయిల్‌ రేట్లు పెరిగాయి. ఈ ప్రభావం సబ్బులను ఉత్పత్తి చేస్తున్న హెచ్‌యూఎల్, విప్రో, టాటా కన్స్యూమర్ వంటి కంపెనీలపైనా పడింది. పామాయిల్ ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి, ఆయా కంపెనీలు సబ్బుల రేట్లు పెంచాయి. పెరిగిన ఆర్థిక భారాన్ని సామాన్య జనంపైకి నెట్టాయి.

సెప్టెంబర్ త్రైమాసిక (జులై-సెప్టెంబర్‌) ఫలితాల ప్రకటన సమయంలో, తమ లాభాలను కాపాడుకోవడానికి ప్రస్తుత త్రైమాసికంలో (అక్టోబర్‌-డిసెంబర్‌) సబ్బు ధరలను పెంచామని అనేక లిస్టెడ్ కంపెనీలు వెల్లడించాయి. 

పామాయిల్ ధరలు ఎంత పెరిగాయి?
దిగుమతి సుంకం పెరుగుదల, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పెరుగుదల కారణంగా, ఈ ఏడాదిలో పామాయిల్ ధరలు దాదాపు 35-40 శాతం పెరిగాయి. మన దేశంలోకి పామాయిల్ ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా దేశాల నుంచి దిగుమతి అవుతుంది. ప్రస్తుతం, పామాయిల్ ధర 10 కిలోలు రూ. 1,370 పలుకుతోంది. 

"సబ్బు తయారీకి సంబంధించిన కీలక ముడి పదార్థాల ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది ప్రారంభం ముడి పదార్థాల రేట్లు 30 శాతానికి పైగా పెరిగింది. ఈ పెరుగుదల కారణంగా ప్రధాన వ్యాపార కంపెనీలన్నీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పెరుగుదల భారాన్ని కొంతవరకు తగ్గించుకోవడానికి, మా ఉత్పత్తుల ధరలను సుమారు 7-8 శాతం పెంచాం. మార్కెట్‌లోని ప్రైస్‌ ట్రెండ్‌కు అనుగుణంగా పని చేస్తున్నాం" - విప్రో కన్స్యూమర్ కేర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) నీరజ్ ఖత్రి

విప్రో అనేది అజీమ్ ప్రేమ్‌జీ నేతృత్వంలోని విప్రో ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన యూనిట్. ప్రజలు ప్రతిరోజూ వినియోగించే సంతూర్ సహా మరికొన్ని సోప్‌ బ్రాండ్లను ఇది అమ్ముతోంది.

లక్స్‌, లైఫ్‌బాయ్‌, డోవ్‌...
దిగ్గజ కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ కూడా సబ్బులు, స్కిన్‌ కేర్‌ (Skincare) ఉత్పత్తుల రేట్లు పెంచింది. లక్స్‌ 5 సబ్బుల ప్యాకెట్‌ రేటును రూ. 145 నుంచి రూ. 155కు పెంచింది. లైఫ్‌బాయ్‌ 5 సబ్బుల ప్యాకెట్‌ ధరను రూ. 155 నుంచి రూ. 165కు పెంచింది. పియర్స్‌ 4 సబ్బుల ప్యాకెట్‌ రేటును రూ. 149 నుంచి రూ. 162 చేసింది. ఇంకా.. లిరిల్, రెక్సోనా బ్రాండ్‌లను కూడా HUL ఉత్పత్తి చేస్తోంది. మార్కెట్‌ వర్గాల ప్రకారం, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల (Personal Care Products) ధరలు కూడా పెరిగాయి.

HUL, విప్రో తర్వాత మరికొన్ని కంపెనీలు కూడా సబ్బులు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల ధరలు పెంచేందుకు సిద్ధంగా ఉన్నాయని రీసెర్చ్‌ హౌస్‌ 'నువామా ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్' వెల్లడించింది.

పెరిగిన 'టీ పొడి' రేట్లు
ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తేయాకు ఉత్పత్తి కూడా తగ్గింది. దీంతో, టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్, హెచ్‌యూఎల్‌ తమ టీ పొడి రేట్లను పెంచాయి.

మరో ఆసక్తికర కథనం: పిల్లల కోసం పాన్ కార్డ్ ఎలా తీసుకోవాలి, ఏంటి లాభం? 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacharla Land Issue : లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
Pawan Kalyan: సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
KTR News Today: కొన్నిరోజులపాటు రాజకీయాలకు బ్రేక్‌- సంచలన ట్వీట్ చేసిన కేటీఆర్ 
కొన్నిరోజులపాటు రాజకీయాలకు బ్రేక్‌- సంచలన ట్వీట్ చేసిన కేటీఆర్ 
Pushpa 2: తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్... 'ఆర్ఆర్ఆర్' రికార్డు బ్రేక్ చేస్తేనే బన్నీ బొమ్మ హిట్టు
తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్... 'ఆర్ఆర్ఆర్' రికార్డు బ్రేక్ చేస్తేనే బన్నీ బొమ్మ హిట్టు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Lagacharla Land Acquisition Cancelled | లగచర్ల భూసేకరణ రద్దు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే..! | ABP DesamPanama Ship Stops Deputy CM Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్న వెస్ట్ ఆఫ్రికా ఓడ | ABP DesamAllu Arjun Speech Pushpa 2 Mumbai | పుష్ప 2 ముంబై ఈవెంట్లో అల్లు అర్జున్ మాస్ స్పీచ్ | ABP DesamRashmika Mandanna Pushpa 2 Mumbai | ముంబై పుష్ప ఈవెంట్ లో మెరిసిపోయిన శ్రీవల్లి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacharla Land Issue : లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
Pawan Kalyan: సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
KTR News Today: కొన్నిరోజులపాటు రాజకీయాలకు బ్రేక్‌- సంచలన ట్వీట్ చేసిన కేటీఆర్ 
కొన్నిరోజులపాటు రాజకీయాలకు బ్రేక్‌- సంచలన ట్వీట్ చేసిన కేటీఆర్ 
Pushpa 2: తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్... 'ఆర్ఆర్ఆర్' రికార్డు బ్రేక్ చేస్తేనే బన్నీ బొమ్మ హిట్టు
తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్... 'ఆర్ఆర్ఆర్' రికార్డు బ్రేక్ చేస్తేనే బన్నీ బొమ్మ హిట్టు
Andhra Pradesh Weather:మధ్యాహ్నం తీరం దాటనున్న ఫెంగల్‌- నెల్లూరు సహా ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్- ప్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే ప్రమాదం
మధ్యాహ్నం తీరం దాటనున్న ఫెంగల్‌- నెల్లూరు సహా ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్- ప్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే ప్రమాదం
TG 10th Exams Pattern: తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
Ananya Nagalla: సమంత కాదండోయ్... తెలుగు అమ్మాయి అనన్య
సమంత కాదండోయ్... తెలుగు అమ్మాయి అనన్య
Nandyala Boy Suicide: హెయిర్ కటింగ్ నచ్చలేదని బాలుడి ఆత్మహత్య- నంద్యాల జిల్లాలో విషాదం
హెయిర్ కటింగ్ నచ్చలేదని బాలుడి ఆత్మహత్య- నంద్యాల జిల్లాలో విషాదం
Embed widget