By: Arun Kumar Veera | Updated at : 29 Nov 2024 10:55 AM (IST)
మైనర్ పాన్ కార్డ్ ప్రయోజనాలు ( Image Source : Other )
How To Apply For Children PAN Card: మన దేశంలో చాలా ఆర్థిక & చట్టపరమైన పనులకు PAN (Permanent Account Number) కార్డ్ అనేది ఒక కీలక గుర్తింపు పత్రం. బ్యాంక్ ఖాతా తెరవడం లేదా పెట్టుబడులు ప్రారంభించడం నుంచి ఆదాయ పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడం వరకు పాన్ కార్డ్ లేనిదే పని కాదు. అయితే, పాన్ కార్డును పెద్ద వాళ్లు లేదా సంపాదన ఉన్న వ్యక్తులు మాత్రమే తీసుకోవాలనే అపోహ ప్రజల్లో ఉంది. అది నిజం కాదు. ఆదాయ పన్ను చట్టం (Income Tax Act)లోని సెక్షన్ 160 ప్రకారం, చిన్న పిల్లలు/మైనర్లు కూడా పాన్ కార్డు తీసుకోవచ్చు. దానిని మైనర్ పాన్ కార్డ్ (Minor PAN Card) అని పిలుస్తారు. ఈ కార్డ్ మైనర్ పేరు మీద జారీ అవుతుంది. వాళ్లకు యుక్తవయస్సు (18 సంవత్సాలు) వచ్చే వరకు వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు (guardians) మాత్రమే ఆ కార్డును ఉపయోగించగలరు.
మైనర్ పాన్ కార్డ్ ఉద్దేశాలు
మైనర్ పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడం అంటే, మీ పిల్లలు వివిధ ఆర్థిక అవకాశాలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడం. పెట్టుబడులు లేదా బ్యాంకింగ్ అవసరాల కోసం మైనర్ పాన్ కార్డ్ తీసుకుంటే, పిల్లల పేరు మీద ఆర్థిక లావాదేవీలన్నీ సాఫీగా సాగిపోతాయి.
ఆదాయ పన్ను చట్టం ప్రకారం, మైనర్‌లు ఎలాంటి ఆంక్షలు, షరతులు లేకుండా పాన్ కార్డ్ తీసుకోవచ్చు. అయితే, మైనర్‌కు 18 ఏళ్లు నిండినప్పుడు సంతకం, ఫోటోను యాడ్ చేయడం వంటి అప్‌డేట్‌లు తప్పనిసరిగా చేయాలి.
మైనర్ పాన్ కార్డ్ ప్రయోజనాలు
పెట్టుబడులు: మైనర్ పేరు మీద పెట్టుబడులు పెట్టడానికి లేదా ఆర్థిక వ్యవహారాల్లో వారిని నామినీగా నియమించడానికి పాన్ కార్డ్ అవసరం.
బ్యాంక్ ఖాతా: మీరు మీ పిల్లల పేరిట బ్యాంక్ ఖాతాను తెరవాలనుకుంటే పాన్ కార్డ్ తప్పనిసరి.
మైనర్ పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు
ఆధార్ కార్డు
రేషన్ కార్డు
పోస్టాఫీసు పాస్ బుక్
నివాస ధృవీకరణ పత్రం
మైనర్ పాన్ కార్డ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
ముందుగా, NSDL వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. అక్కడ "Online PAN Application" ఆప్షన్ ఎంచుకోండి
ఇప్పుడు అప్లికేషన్ రకాన్ని ఎంచుకోవాలి. ఇందుకోసం, "New PAN - Indian Citizen (Form 49A)"పై క్లిక్ చేసి, కేటగిరీ కింద "Individual"ను ఎంచుకోండి.
వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి. మైనర్ పూర్తి పేరు, పుట్టిన తేదీ (DOB), ఫోన్ నంబర్, ఇ-మెయిల్ అడ్రస్ వంటి వివరాలను అందించండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఈ వివరాలు మరోమారు చెక్ చేయండి.
ఇప్పుడు క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి మీరు పూర్తి చేసిన ఫామ్‌ను Submit చేయండి.
మీ ఫారాన్ని సబ్మిట్ చేసిన తర్వాత, మీ స్క్రీన్‌పై టోకెన్ నంబర్ కనిపిస్తుంది. దానిని నోట్ చేసుకోండి.
ఇప్పుడు "Continue with PAN Application Form" మీద క్లిక్ చేసి ప్రాసెస్ కొనసాగండి.
అవసరమైన డాక్యుమెంట్లను భౌతికంగా సమర్పించడానికి "Forward application documents physically" ఎంచుకోండి.
ఇక్కడ, మీ ఆధార్ వివరాలను పూరించాలి. మీ ఆధార్ కార్డ్‌లోని చివరి నాలుగు అంకెలను నమోదు చేయండి. అందులో నమోదు చేసిన వివరాలను ధృవీకరించండి.
మైనర్ తల్లిదండ్రులు లేదా సంరక్షకుడి వివరాలు, ఆదాయ సమాచారం, ఇతర అవసరమైన పత్రాలను యాడ్ చేయండి.
చివరిగా, రూ. 107 రుసుము చెల్లించండి. ఇక్కడితో ఫారం నింపే పని పూర్తవుతుంది.
మైనర్ పాన్ కార్డ్ ఎన్ని రోజులకు వస్తుంది?
మీరు ఫారం సమర్పించిన తర్వాత, సంబంధిత అధికారులు ఆ వివరాలు వెరిఫై చేస్తారు. వెరిఫికేషన్ తర్వాత పాన్ కార్డును ఆన్‌లైన్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫిజికల్ కార్డ్ మీ ఇంటి అడ్రస్‌కు వస్తుంది. ఫిజికల్ కార్డ్ అందుకోవడానికి సాధారణంగా 15 రోజులు పడుతుంది.
మరో ఆసక్తికర కథనం: నగలు కొనేవాళ్లకు రోజుకో షాక్ ఇస్తున్న గోల్డ్ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
RBI Key Decisions: జీరో బ్యాలెన్స్ బ్యాంకు ఖాతాదారులకు గుడ్‌న్యూస్, పలు ఛార్జీలు ఎత్తివేస్తూ నిర్ణయం
IndiGo Flight Crisis : ఈ తేదీ వరకు ఇండిగో టికెట్ రద్దు చేస్తే పూర్తి రీఫండ్! పూర్తి వివరాలు తెలుసుకోండి!
Airtel Recharge Plan: ఎయిర్టెల్ వినియోగదారులకు బిగ్ షాక్ ! రెండు చౌకైన రీఛార్జ్ ప్లాన్‌లను సైలెంట్‌గా క్లోజ్!
Gold Price: బంగారం ధర 15నుంచి 30 శాతం వరకు పెరిగే ఛాన్స్! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం వెల్లడి!
RBI Repo Rate:రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
FIFA World Cup 2026 : FIFA ప్రపంచ కప్ 2026 సమయంలో గ్రహాంతరవాసులు వస్తారా! బాబా వాంగ ఏం చెప్పారు?
Goa Fire Accident: గోవా నైట్ క్లబ్‌లో విషాదం.. సిలిండర్ పేలుడుతో 25 మంది మృతి- విచారణకు ఆదేశించిన సీఎం
OTT Spy Movies: 'ధురంధర్' సినిమా కన్నా ముందుగా ఈ స్పై థ్రిల్లర్స్ చూడండి, ఈ OTT ల్లో అందుబాటులో ఉన్నాయ్!
Tirupati Crime News: విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక దాడి, గర్భం దాల్చిన బాధితురాలు.. తిరుపతిలో దారుణం