Q1 Result: ఎస్టిమేషన్స్ బీట్ చేసిన HDFC బ్యాంక్ - లాభం 30%, ఎన్‌ఐఐ 21% జంప్
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ. 11,000 కోట్లు లాభం సంపాదిస్తుందని మార్కెట్ అంచనా వేసింది.
HDFC Q1 Result: 2023-24 తొలి త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నికర లాభంలో 30% (YoY) వృద్ధితో రూ. 11,952 కోట్లకు చేరుకుంది, మార్కెట్ ఎస్టిమేషన్స్‌ను బీట్ చేసింది. Q1 FY24లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ. 11,000 కోట్లు లాభం సంపాదిస్తుందని మార్కెట్ అంచనా వేసింది.
జూన్ త్రైమాసికంలో బ్యాంక్ ఆదాయం 39% పెరిగి రూ. 57,817 కోట్లకు చేరుకుంది.
పేరెంట్ కంపెనీ అయిన 'హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్'ను (హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్) విలీనం చేసుకున్న తర్వాత బ్యాంక్ ప్రకటించిన ఫస్ట్ ఎర్నింగ్స్ ఇవి. దీంతో, బ్యాంక్ రిపోర్ట్ కార్డ్, మేనేజ్‌మెంట్ కామెంటరీ మీద ఈసారి ఎక్కువ ఫోకస్ ఉంది.
HDFC బ్యాంక్ Q1 FY24 రిజల్ట్స్:
- బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (NII) 21% పైగా పెరిగి రూ. 23,599 కోట్లకు చేరుకుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ సంవత్సరానికి (YoY) 22% పెరిగి రూ. 18,772 కోట్లుగా నమోదైంది.
- జూన్ క్వార్టర్‌లో మొండి బకాయిల కోసం రూ. 2,860 కోట్లను కేటాయింపుల (provisions) పద్దులో బ్యాంక్ చూపింది. క్రితం ఏడాది ఇది రూ. 3,188 కోట్లుగా ఉంది.
- జూన్ చివరి నాటికి, మొత్తం రుణాల్లో స్థూల నిరర్థక ఆస్తులు (GNPA) 1.17%గా ఉన్నాయి. త్రైమాసికం క్రితం రికార్డయిన 1.12% నుంచి ఈసారి కొద్దిగా పెరిగాయి. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలోని 1.28% నుంచి బాగా మెరుగుపడ్డాయి.
- నిరర్థక ఆస్తుల (NNPA) నిష్పత్తి 0.30%గా ఉంది. ఇది ఒక త్రైమాసికం క్రితం 0.27% కంటే ఎక్కువ. సంవత్సరం క్రితం ఇదే కాలంలోని 0.35% కంటే తక్కువగా లెక్క తేలింది.
- బ్యాంక్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో (CAR) 18.93%గా ఉంది, ఇది త్రైమాసికం క్రితం 19.26%గా ఉంది.
- ఖర్చు-ఆదాయం నిష్పత్తి 42.8%గా ఉంది. మొత్తం క్రెడిట్ కాస్ట్ రేషియో 0.70%, ఏడాది క్రితం 0.91%తో పోలిస్తే తగ్గింది.
- జూన్ చివరి నాటికి HDFC బ్యాంక్ డిపాజిట్లు సంవత్సరానికి 19% వృద్ధితో రూ. 19.13 లక్షల కోట్లకు చేరుకున్నాయి. కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ (CASA) డిపాజిట్లు దాదాపు 11% పెరిగాయి, త్రైమాసికంలోని మొత్తం డిపాజిట్లలో 42.5% కాంట్రిబ్యూట్ చేశాయి.
- అడ్వాన్సులు గత సంవత్సరం కంటే దాదాపు 16% పెరిగి రూ. 16.16 లక్షల కోట్లుగా లెక్క తేలాయి. దేశీయ రిటైల్ లోన్లు 20%తో బలమైన వృద్ధిని ప్రదర్శించాయి. వాణిజ్య & గ్రామీణ బ్యాంకింగ్ లోన్లు 29% వృద్ధి చెందగా, కార్పొరేట్ & ఇతర హోల్‌సేల్ లోన్స్ 11.2% పెరిగాయి.
మెట్రిక్స్ బాగుండడంతో, ఫలితాల ప్రకటన తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యాయి. దాదాపు 2 శాతం వరకు పెరిగాయి.
మరో ఆసక్తికర కథనం: సంపాదనలో స్టాక్ మార్కెట్‌ను ఓడించే బెస్ట్ స్మాల్ క్యాప్ ఫండ్‌ను ఎలా ఎంచుకోవాలి?
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.