search
×

Small Cap Funds: సంపాదనలో స్టాక్ మార్కెట్‌ను ఓడించే బెస్ట్‌ స్మాల్ క్యాప్ ఫండ్‌ను ఎలా ఎంచుకోవాలి?

ఈ ఆరు నెలల్లో రూ.18 వేల కోట్లను ఇన్వెస్టర్లు ఈ ఫండ్స్‌లోకి పంప్‌ చేశారు.

FOLLOW US: 
Share:

Best Small Cap Funds: దేశీయ స్టాక్ మార్కెట్ రోజుకో కొత్త శిఖరం ఎక్కి, ఒకదాని తర్వాత ఒకటిగా కొత్త రికార్డులు సృష్టించే పనిలో బిజీగా ఉంది. ఇవాళ (సోమవారం, 17 జులై 2023) కూడా బీఎస్‌ఈ సెన్సెక్స్ & ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ రెండూ సరికొత్త ఆల్ టైమ్ హై జర్నీ చేశాయి. ప్రస్తుత మార్కెట్ ర్యాలీలో స్మాల్ క్యాప్ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఫుల్‌ స్పీడ్‌గా పరిగెడుతున్నాయి. మ్యూచువల్ ఫండ్స్‌ మీద ఇన్వెస్టర్ల ఆకర్షణ పెరిగేలా చేస్తున్నాయి.

మార్కెట్ లెక్కలను పరిశీలిస్తే... రిటర్న్స్‌లో మాత్రమే కాదు, ఫండ్ కలెక్షన్ పరంగా కూడా స్మాల్ క్యాప్ మ్యూచువల్‌ ఫండ్స్ టాప్‌ ర్యాంక్‌లో ఉన్నాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో (జనవరి-జూన్‌ కాలం), మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వచ్చిన మొత్తం కొత్త పెట్టుబడుల్లో 25 శాతం స్మాల్ క్యాప్ ఫండ్స్‌లోకే వచ్చింది. ఈ ఆరు నెలల్లో రూ.18 వేల కోట్లను ఇన్వెస్టర్లు ఈ ఫండ్స్‌లోకి పంప్‌ చేశారు.

లాభాల రికార్డ్‌
రిటర్న్స్‌ విషయానికొస్తే, గత ఏడాది కాలంలో/గత 12 నెలల్లో బీఎస్‌ఈ సెన్సెక్స్ & ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇండెక్స్‌లు 21-22 శాతం వరకు లాభాలను అందించాయి. అదే కాలంలో, లార్జ్ క్యాప్ & మిడ్ క్యాప్ మ్యూచువల్‌ ఫండ్స్‌ వరుసగా 23 శాతం & 30 శాతం రాబడి ఇచ్చాయి. స్మాల్ క్యాప్ ఫండ్స్‌ 34% లాభాలతో వీటన్నింటినీ ఓవర్‌టేక్‌ చేసి, రేస్‌లో చాలా ముందున్నాయి. వీటిలోనూ బెస్ట్‌ మ్యూచువల్‌ ఫండ్స్ 45% పైగా రిటర్న్‌ చేశాయి.

10 ఉత్తమ స్మాల్ క్యాప్ మ్యూచువల్‌ ఫండ్స్‌:

మ్యూచువల్‌ ఫండ్‌ స్కీమ్‌ పేరు  -----  గత 1 సంవత్సరం రిటర్న్స్

HDFC స్మాల్ క్యాప్ ఫండ్ ------------------------ 45.56%
క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ ---------------------- 41.06%
ఫ్రాంక్లిన్ ఇండియా చిన్న కంపెనీల ఫండ్ ----- 40.75%
నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ ---------- 39.47%
టాటా స్మాల్ క్యాప్ ఫండ్ ------------------------ 39.41%
ITI స్మాల్ క్యాప్ ఫండ్ --------------------------- 35.60%
HSBC స్మాల్ క్యాప్ ఫండ్ ----------------------- 34.29%
ఇన్వెస్కో ఇండియా స్మాల్‌ క్యాప్ ఫండ్ -------- 33.92%
ఎడెల్‌వీస్ స్మాల్ క్యాప్ ఫండ్ ------------------ 33.40%
సుందరం స్మాల్ క్యాప్ ఫండ్ ------------------ 33.21%

‍‌(పైవన్నీ డైరెక్ట్ + గ్రోత్ ప్లాన్స్‌ )

బెస్ట్‌ స్మాల్ క్యాప్ ఫండ్‌ను ఎలా ఎంచుకోవాలి?
స్మాల్ క్యాప్ మ్యూచువల్‌ ఫండ్‌.. స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌లో పెట్టుబడి పెడుతుంది. ఏ స్మాల్ క్యాప్ ఫండ్‌లోనైనా పెట్టుబడి పెట్టే ముందు, గత సంవత్సర కాలంలో ఆ ఫండ్ ఎంత రాబడి ఇచ్చిందో చూడాలి. దీంతోపాటు, ఫండ్‌ పోర్ట్‌ఫోలియో ఎలా ఉందో గమనించాలి. అంటే, ఆ ఫండ్‌ ఏయే స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసిందో చూడాలి. ఫండ్‌ మేనేజర్‌ ఎవరు, అతను గతంలో హ్యాండిల్‌ చేసిన ఫండ్స్‌ ఎలా పెర్ఫార్మ్‌ చేశాయో పరిశీలించాలి. ఫండ్ పనితీరు ఎలా ఉంటుంది అనేది ఫండ్ మేనేజర్ వ్యూహంపై ఆధారపడి ఉంటుంది. స్మాల్ క్యాప్ ఫండ్స్ ఎక్కువ రాబడిని ఇస్తాయి, అదే సమయంలో ఎక్కువ రిస్క్‌ కూడా వీటికే అని గుర్తుంచుకోండి. దీని కోసమే ఫండ్‌ పోర్ట్‌ఫోలియోలో ఉన్న కంపెనీల విశ్లేషణ అవసరం అవుతుంది. మరో ముఖ్యమైన విషయం... గతంలో ఇచ్చిన రాబడులు, లేదా ఇప్పటికే ఉన్న రిటర్న్‌ ప్యాటర్న్‌ ఆధారంగా ఆ ఫండ్‌ భవిష్యత్ పనితీరును అంచనా వేయకూడదు. డైరెక్ట్‌ ప్లాన్‌, గ్రోత్ ఆప్షన్ కలిసిన ఫండ్‌నే ఎంచుకోవాలి. దీనివల్ల మీ పెట్టుబడి వ్యయం చాలా తగ్గుతుంది.

మరో ఆసక్తికర కథనం: 3 నెలల్లో డబ్బు రెట్టింపు చేసిన 41 స్టాక్స్‌, వీటిలో ఒక్కటైనా మీ దగ్గర ఉందా?

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 17 Jul 2023 02:46 PM (IST) Tags: Mutual Funds small cap funds best funds stock market market

ఇవి కూడా చూడండి

SIP , PPFలో లాంగ్‌ టెర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఏది ఉత్తమం? ఎక్కడ ఎక్కువ సంపాదించవచ్చు?

SIP , PPFలో లాంగ్‌ టెర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఏది ఉత్తమం? ఎక్కడ ఎక్కువ సంపాదించవచ్చు?

Investments for Child : పిల్లల ఫ్యూచర్​ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా ? ఈ ఈక్విటీ ఫండ్స్​తో అధిక రాబడి మీ సొంతం

Investments for Child : పిల్లల ఫ్యూచర్​ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా ? ఈ ఈక్విటీ ఫండ్స్​తో అధిక రాబడి మీ సొంతం

Children Day: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Children Day: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Money Earning Tips: ఇలా SIP చేస్తే కోటీశ్వరులు అవుతారు.. రూ.2000తో మొదలుపెట్టి ఇలా ఇన్వెస్ట్ చేయాలి

Money Earning Tips: ఇలా SIP చేస్తే కోటీశ్వరులు అవుతారు.. రూ.2000తో మొదలుపెట్టి ఇలా ఇన్వెస్ట్ చేయాలి

Passive Income: SIPs నుంచి REITs దాకా పాసివ్‌ ఆదాయం ఎలా సంపాదించాలో తెలుసుకోండి

Passive Income: SIPs నుంచి REITs దాకా పాసివ్‌ ఆదాయం ఎలా సంపాదించాలో తెలుసుకోండి

టాప్ స్టోరీస్

Etala Rajender Fire: నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు

Etala Rajender Fire: నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు

H3N2 Super Flu: బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు

H3N2 Super Flu: బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు

Dekhlenge Saala Song: దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి

Dekhlenge Saala Song: దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి

Hyderabad Messi Mania: ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా

Hyderabad Messi Mania: ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్  - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా