News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Multibaggers: 3 నెలల్లో డబ్బు రెట్టింపు చేసిన 41 స్టాక్స్‌, వీటిలో ఒక్కటైనా మీ దగ్గర ఉందా?

ఈ 3 నెలల ర్యాలీలో కనీసం 41 స్టాక్స్‌ మల్టీబ్యాగర్స్‌గా మారాయి.

FOLLOW US: 
Share:

Multibaggers Stocks: ఈ ఏడాది జూన్ త్రైమాసికం ‍‌(ఏప్రిల్‌-జూన్ కాలం) ఇండియన్‌ ఈక్విటీలకు స్వర్ణయుగం. ఆ మూడు నెలల్లో, ఫారిన్‌ పెట్టుబడిదార్లు దలాల్ స్ట్రీట్‌లో విపరీతంగా ఖర్చు పెట్టారు. దీంతో, బెంచ్‌మార్క్‌ సూచీలు కొత్త జీవిత కాల గరిష్టాలను నమోదు చేశాయి. 

జూన్ క్వార్టర్‌లో, బెంచ్‌మార్క్ నిఫ్టీ50 10% పైగా లాభపడింది. ఆ 3 నెలల్లో, ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIలు) నిఫ్టీ50 గ్రూప్‌లో నికరంగా $13 బిలియన్లను పెట్టుబడి పెట్టారు. బెంచ్‌మార్క్‌ చరిత్రలో, ఒక త్రైమాసికంలో ఇదే రికార్డ్‌ స్థాయి ఇన్‌ఫ్లో. ఈ 3 నెలల ర్యాలీలో కనీసం 41 స్టాక్స్‌ మల్టీబ్యాగర్స్‌గా మారాయి.

ఆటో & అనుబంధ కంపెనీల స్టాక్స్‌కు ఎక్కువ గిరాకీ
పాసెంజర్‌, కమర్షియల్‌ వెహికల్స్‌కు బలమైన డిమాండ్‌ వల్ల, FY24లో ఆటో & అనుబంధ కంపెనీల స్టాక్స్‌కు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. ఎక్కువగా లాభపడిన కౌంటర్లలో ఇవి ముందంజలో ఉన్నాయి. ఫోర్స్ మోటార్స్, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు, దాదాపు 122% రాబడిని అందించింది. స్మాల్‌ క్యాప్ స్పేస్‌లో బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ ఇస్తున్న ఆటో స్టాక్స్‌లో ఇది ఒకటి. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్, ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 120% పైగా రిటర్న్‌ అందించిన మరొక ప్రామినెంట్‌ గెయినర్‌. ఆటో యాన్సిలరీ మేకర్స్‌లో, JBM ఆటో స్టాక్ మూడు నెలల్లో రెండింతలు పెరిగింది. జై భారత్ మారుతి 127% పైగా జంప్‌ చేసింది. 

దలాల్ స్ట్రీట్ పెట్టుబడిదార్లకు అత్యంత ఇష్టమైన స్క్రిప్స్‌లో మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ ఒకటి. ఈ పబ్లిక్ సెక్టార్ మేజర్ కంపెనీ షేర్లు ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 159% లాభాలను అందించాయి. విండ్ టర్బైన్ తయారీ కంపెనీ సుజ్లాన్ ఎనర్జీ కూడా ఇన్వెస్టర్లను బాగా ఆకర్షించింది, మూడు నెలల్లో 122% రాబడి ఇచ్చింది.

జూన్‌ క్వార్టర్‌లో మల్టీబ్యాగర్స్‌గా మారిన స్టాక్స్‌లో కనీసం రూ.500 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న టాప్‌-15 కంపెనీలను షార్ట్‌ లిస్ట్‌ చేయడం జరిగింది.

గత 3 నెలల్లో మల్టీబ్యాగర్‌ రిటర్న్స్‌ ఇచ్చిన స్టాక్స్‌:

స్టాక్‌ పేరు  -------------------------   FY24లో ఇప్పటి వరకు లాభం
JITF ఇన్‌ఫ్రా లాజిస్టిక్స్   ------------------------   633%
రెమిడియం లైఫ్‌కేర్   ---------------------------   441%
ఆరియన్‌ప్రో సొల్యూషన్స్   --------------------   219%
శ్రీ గ్లోబల్ ట్రేడ్‌ఫిన్   ----------------------------   200%
రిఫెక్స్ ఇండస్ట్రీస్   -----------------------------   192%
పటేల్ ఇంజినీరింగ్   ----------------------------   190%
మాస్టర్ ట్రస్ట్   ----------------------------------   189%
డిదేవ్ ప్లాస్టిక్స్ ఇండస్ట్రీస్   ----------------------   168%
మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్   --------------------   159%
KP ఎనర్జీ --------------------------------------   147%
వరద్ వెంచర్స్   --------------------------------   140%
ది ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్ ------  138%
కేసాల్వ్‌ ఇండియా ------------------------------   135%
నిన్టెక్‌ సిస్టమ్స్   --------------------------------   133%
డి నోరా ఇండియా   ----------------------------   132%

మరో ఆసక్తికర కథనం: కోటి మందికి పైగా రిఫండ్‌ వచ్చింది, మీ డబ్బు ఎప్పుడు వస్తుందో ఇలా చెక్‌ చేయండి

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 17 Jul 2023 01:07 PM (IST) Tags: multibagger stocks Stock Market returns June quarter

ఇవి కూడా చూడండి

Adani Group Investment Plan: ఇన్‌ఫ్రాలో పట్టు కోసం అదానీ మెగా ప్లాన్, మౌలిక సదుపాయాల్లోకి రూ.7 లక్షల కోట్లు

Adani Group Investment Plan: ఇన్‌ఫ్రాలో పట్టు కోసం అదానీ మెగా ప్లాన్, మౌలిక సదుపాయాల్లోకి రూ.7 లక్షల కోట్లు

Train Ticket: కన్ఫర్మ్‌డ్‌ ట్రైన్‌ టిక్కెట్‌ సెకన్లలో వ్యవధిలో దొరుకుతుంది, ఈ ఆప్షన్‌ ప్రయత్నించండి

Train Ticket: కన్ఫర్మ్‌డ్‌ ట్రైన్‌ టిక్కెట్‌ సెకన్లలో వ్యవధిలో దొరుకుతుంది, ఈ ఆప్షన్‌ ప్రయత్నించండి

Forex Reserves: వరుసగా రెండో వారంలోనూ పెరిగిన ఫారెక్స్‌ ఛెస్ట్‌ - ఇండియా దగ్గర 597.39 బిలియన్ డాలర్ల నిల్వలు

Forex Reserves: వరుసగా రెండో వారంలోనూ పెరిగిన ఫారెక్స్‌ ఛెస్ట్‌ - ఇండియా దగ్గర 597.39 బిలియన్ డాలర్ల నిల్వలు

GST Data: GDPతో పోటీ పడిన GST, నవంబర్‌ నెలలో రూ.1.68 లక్షల కోట్ల వసూళ్లు

GST Data: GDPతో పోటీ పడిన GST, నవంబర్‌ నెలలో రూ.1.68 లక్షల కోట్ల వసూళ్లు

Bank Holidays: మీకు బ్యాంక్‌లో పనుందా?, అయితే జాగ్రత్త! - ఏ నెలలో లేనన్ని సెలవులు ఈ నెలలో ఉన్నాయ్‌

Bank Holidays: మీకు బ్యాంక్‌లో పనుందా?, అయితే జాగ్రత్త! - ఏ నెలలో లేనన్ని సెలవులు ఈ నెలలో ఉన్నాయ్‌

టాప్ స్టోరీస్

Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష

YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత

Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత
×