అన్వేషించండి

GST Data: GDPతో పోటీ పడిన GST, నవంబర్‌ నెలలో రూ.1.68 లక్షల కోట్ల వసూళ్లు

మన దేశ ఆర్థిక పరిస్థితి చాలా పటిష్టంగా ఉందని నిరూపించే రెండు గణాంకాలు వరుసగా ఒకదాని వెంట మరొకటి బయటకు రావడంతో పెట్టుబడిదార్లలో ఉత్సాహం నెలకొంది.

GST Collection Data For November 2023: మన దేశంలో వస్తు, సేవల పన్నుల (Goods and Services Tax) వసూళ్లు మరోమారు భారీ అంకెను సృష్టించాయి. దీపావళి (Diwali 2023), ధంతేరస్, ఛత్ వంటి పండుగల సీజన్ కారణంగా, నవంబర్‌ నెలలో దేశంలో కొనుగోళ్లు పీక్‌ స్టేజ్‌కు చేరాయి. ఫలితంగా ఆ నెలలో GST వసూళ్లు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. 

2023 నవంబర్‌ నెలలో జీఎస్‌టీ వసూళ్లు (GST collection in November-2023) రూ.1.68 లక్షల కోట్లకు చేరాయి, గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 15 శాతం పెరిగింది. అయితే, 2023 అక్టోబర్‌ నెలతో పోలిస్తే నవంబర్‌లో కలెక్షన్స్‌ తగ్గుముఖం పట్టాయి. అక్టోబర్ నెలలో జీఎస్టీ అమౌంట్‌ రూ.1.72 లక్షల కోట్లుగా ఉంది. నెలవారీగా తగ్గింది కదాని ఆ నంబర్‌ను తక్కువగా చూడాల్సిన అవసరం లేదు, ఇది ఒక పెద్ద సంఖ్య. 

ప్రజల్లో పెరిగిన కొనుగోళ్ల స్థోమత సూచించే గణాంకాల్లో జీఎస్‌టీ వసూళ్లు కూడా ఒకటి. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ త్రైమాసికంలో భారతదేశ స్థూల జాతీయ ఉత్పత్తి ‍‌(India's Gross Domestic Production - GDP) అంచనాలకు మించి పెరిగింది. జులై - సెప్టెంబర్ కాలంలో GDP గ్రోత్‌ రేట్‌ 6.5 శాతంగా ఉంటుందని రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) గతంలో అంచనా వేసింది. ఆ అంచనాలను మించి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ 7.6 శాతం చొప్పున వృద్ధి ‍‌‍‌(GDP growth rate in September quarter) చెందింది. 

రెండు పాజిటివ్‌ డేటాలు
మన దేశ ఆర్థిక పరిస్థితి చాలా పటిష్టంగా ఉందని నిరూపించే రెండు గణాంకాలు వరుసగా ఒకదాని వెంట మరొకటి బయటకు రావడంతో పెట్టుబడిదార్లలో ఉత్సాహం నెలకొంది. మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి కూడా ఇది సానుకూల పరిణామం.

ఆర్థిక మంత్రిత్వ శాఖ GST వసూళ్ల డేటాను విడుదల చేసింది. ఆ డేటా ప్రకారం... నవంబర్‌ నెలలో మొత్తం GST వసూళ్లు రూ.1,67,929 కోట్లుగా ఉన్నాయి. ఇందులో... CGST రూ.30,420 కోట్లు, SGST రూ.38,226 కోట్లు, IGST రూ.87,009 కోట్లుగా ఉంది. అంతకుముందు నెలలో ఐజీఎస్టీ వసూళ్లు రూ.91,315 కోట్లు. సెస్ వసూలు రూ.12,274 కోట్లు కాగా, అందులో రూ.1036 కోట్లను దిగుమతి చేసుకున్న వస్తువులపై వసూలు చేశారు.

2023-24 ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌టీ వసూళ్లు  రూ. 1.60 లక్షల కోట్లకు పైగా నమోదు కావడం ఇది ఆరోసారి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో, ఏప్రిల్ నుంచి నవంబర్ నెలల్లో మొత్తం GST వసూళ్లు 11.9 శాతం పెరిగి రూ. 13,32,440 కోట్లకు చేరుకోగా, గత ఏడాది ఇదే కాలంలో మొత్తం GST వసూళ్లు రూ. 11,90,920 కోట్లుగా ఉన్నాయి. ఈ ఎనిమిది నెలల్లో, సగటున ప్రతి నెలా రూ.1.66 లక్షల కోట్లు వసూలయ్యాయి. 2022-23 ఇదే కాలంలో సగటున రూ. 1.49 లక్షల కోట్లు.

ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1,87,035 కోట్లకు చేరాయి, ఇదే రికార్డ్‌ (highest ever GST collection). ఆ తర్వాత మే-సెప్టెంబర్ మధ్య స్వల్ప తగ్గుదల కనిపించింది.

మరో ఆసక్తికర కథనం: అంబానీ, అదానీ కాదు.. మన దేశంలో సిసలైన సంపన్నులు వీళ్లే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
Suzuki Access 125: భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులుమాజీ ప్రధానికేనా.. నా తండ్రికి ఇవ్వరా? కాంగ్రెస్ తీరుపై ప్రణబ్ కుమార్తె ఆగ్రహంNasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP DesamPushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
Suzuki Access 125: భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Embed widget