అన్వేషించండి

Gold Price Today: రూ.13000 పెరిగిన వెండి, రూ.3000 ఎగబాకిన బంగారం.. ఇన్వెస్టర్లకు నిపుణుల జాగ్రత్తలు

Silver Price Today | బంగారం, వెండి ధరలు ఫిబ్రవరి 9న పెరిగాయి. MCX లో వెండి 4.93 శాతం పెరిగి కిలో 2,62,212 అయింది. బంగారం 1.50 శాతం పెరగడంతో 10 గ్రాముల ధర 1,57,786 అయింది.

Gold Silver Price Today : భారత బులియన్ మార్కెట్‌లో సోమవారం  (ఫిబ్రవరి 9న) బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. అమెరికన్ డాలర్ బలహీన పడటం, పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడివైపు మొగ్గు చూపుతున్న కారణంగా బంగారం, వెండి ధరలు నేడు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు మార్కెట్ ఫోకస్ అంతా త్వరలో రాబోయే అమెరికా ఆర్థిక డేటాపై ఉంది.

నేడు అంతర్జాతీయ బంగారం, వెండి సహా ఇతర లోహాల విలువ ప్రదర్శించే MCXలో వెండి ధర 4.93 శాతం అంటే కిలోకు ₹12,320 పెరిగి ₹2,62,212కి చేరుకుంది. బంగారం కూడా 1.50 శాతం లేదా ₹2,335 పెరిగి 25 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ₹1,57,786 వద్ద ట్రేడవుతోంది.

మళ్లీ పుంజుకున్న బంగారం, వెండి ధరలు..

ఇటీవల బంగారంతో పాటు వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. దాంతో వరుసగా గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్ పెట్టుబడిదారులతో పాటు ఫ్యూచర్స్ ఆప్షన్స్ లో ఇన్వెస్ట్ చేసిన వారు సైతం బంగారం, వెండి, రాగిపై తమ నగదు విత్ డ్రా చేసుకున్నారు. దాంతో ధరలు ఒక్కసారిగా మరింత పతనమయ్యాయి. బులియన్ మార్కెట్లో సోమవారం మళ్లీ ధరలలో జోష్ కనిపించింది. MCX సిల్వర్ ఫ్యూచర్స్ ప్రస్తుతం కిలోకు ₹2,50,000 నుండి ₹2,70,000 రేంజ్‌లో ఉంది. అయితే గత నెలాఖరులో వెండి కిలో ధర దాదాపు ₹4,20,000 గరిష్ట స్థాయికి తాకింది. త్వరలో వెండి మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. త్వరలో వెండి కేజీ ధర 3 లక్షల నుంచి ₹ 3,25,000 (3 లక్షల 25 వేలకు) వరకు పెరిగే అవకాశం ఉంది.

పెట్టుబడిదారులు ఏమి చేయాలి?

పెట్టుబడి పరంగా, ఈ సమయంలో ఆచితూచి వ్యవహరించడం అవసరమని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే బంగారంలో పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులకు, ప్రస్తుతానికి హోల్డ్ చేయడం మంచిదని భావించవచ్చు. ఎందుకంటే దీర్ఘకాలంలో బంగారం స్థిరమైన, సురక్షితమైన రాబడిని అందిస్తుంది. కొత్త పెట్టుబడిదారులు ఇంకా కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్న వారు ధరలలో పతనం కోసం వేచి ఉండాలి, కానీ మొత్తం డబ్బు ఒకేసారి ఇన్వెస్ట్ చేయకూడదని సూచించారు. 

బంగారం ధరలు ఇటీవల గరిష్ట స్థాయి నుండి దిగొచ్చాయి. వెండి రికార్డు స్థాయిలో 4 లక్షలు మార్క్ దాటినా మళ్లీ 2.8 లక్షలకు పతనమైంది. అనిశ్చితి కారణంగా వెండిలో పెట్టుబడులపై నిపుణులు సైతం క్లారిటీగా చెప్పడం లేదు. అమెరికన్ డాలర్ బలహీనపడటం, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, అమెరికా మార్కెట్‌కు సంబంధించిన డేటా కోసం వెయిట్ చేయడం కూడా పెట్టుబడిదారులను బంగారం వైపు ఆకర్షిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు బంగారాన్ని కొనుగోలు చేసి డాలర్ కు ప్రత్యామ్నాయంగా నగదు విలువను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

నోట్.. (ఇక్కడ అందించిన విషయాలు కేవలం అవగాహనా కోసం మాత్రమే ఇచ్చాం. మార్కెట్‌లో పెట్టుబడి మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇన్వెస్టర్లు డబ్బు పెట్టే ముందు ఆర్థిక నిపుణుడిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. పలానా చోట ఇన్వెస్ట్ చేయాలని ఏబీపీ ఎవరికీ ఎప్పుడూ సలహా ఇవ్వదు.)

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget