By: ABP Desam | Updated at : 31 Mar 2022 06:26 AM (IST)
Edited By: Satyaprasad Bandaru
బంగారం, వెండి ధరలు(ప్రతీకాత్మక చిత్రం)
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) నిన్నటితో పోలిస్తే భారీగా తగ్గింది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో భారీ ఎత్తున పెరిగిన సంగతి తెలిసిందే. వెండి ధర ఇవాళ స్థిరంగా కొనసాగుతోంది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో గ్రాముకు రూ.10 తగ్గి రూ.4,765గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర గ్రాముకు రూ.12 తగ్గి ప్రస్తుతం రూ.5,198 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో నేడు రూ.72,100 వద్ద ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,650 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,980గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.72,100 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం 10 గ్రాముల ధర నేడు రూ.47,650 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.51,980గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.72,100 గా ఉంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర (Todays Gold Rate) ఇలా..
అయితే, ఇతర నగరాల్లోనూ బంగారం ధర తగ్గింది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.47,920గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,280గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,980 గా ఉంది.
ప్లాటినం ధర నేడు (Todays Platinum Rate) ఇలా..
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం గ్రాము ధర నేడు రూ.31 పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాముల ప్లాటినం ధర హైదరాబాద్‌లో రూ.24,100 గా ఉంది. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర యథాతథంగా ఉంది.
రష్యా - ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. తాజాగా రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావమే ఈ బంగారం విపరీతమైన హెచ్చుతగ్గులకు కారణమైంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
New Brezza: కొత్త బ్రెజాలో అదే హైలెట్ - లాంచ్ త్వరలోనే - లుక్ ఎలా ఉందంటే?
Kotak Mutual Fund: రూ.10 వేల సిప్ - 3 ఏళ్లలో రూ.5 లక్షల రిటర్న్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్ ఇది
Stock Market News: సెన్సెక్స్ - 250 నుంచి + 500కు! ఐరోపా మార్కెట్లు ఓపెనవ్వగానే ఎగబడ్డ ఇన్వెస్టర్లు!
Cryptocurrency Prices Today: రోజురోజుకీ పతనమవుతున్న బిట్‌కాయిన్, ఎథీరియమ్!
Infosys CEO Salary: ఆ సీఈవో వేతనం రూ.42.50 కోట్ల నుంచి రూ.80 కోట్లకు పెంపు!
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్
Thalapathy 66: వంశీ పైడిపల్లి, విజయ్ తమిళ చిత్రం అప్డేట్, మరీ అంత త్వరగానా?
Haridwar court historic decision: తల్లిదండ్రులను వేధించే పిల్లలకు ఇదో హెచ్చరిక- చారిత్రాత్మక తీర్పు చెప్పిన హరిద్వార్ కోర్టు
Bengal Cabinet: మొన్న తమిళనాడు, నేడు బంగాల్- కేంద్రానికి షాక్‌లు, గవర్నర్ అధికారాల్లో కోతలు!