By: ABP Desam | Updated at : 29 Jul 2022 06:45 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) భారీగా పెరిగింది. నేడు 10 గ్రాములకు రూ.650 పెరిగింది. వెండి ధర కూడా నిన్నటితో పోలిస్తే నేడు రూ.1200 మేర పెరిగింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.47,100 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.51,380 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.61,200 గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
Gold Rates Today విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,100 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,380గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.61,200 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,100 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.51,380గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.61,200 గా ఉంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర (Todays Gold Rate) ఇలా..
అయితే, ఇతర నగరాల్లోనూ బంగారం ధర నేడు పెరిగింది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.47,670గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,000 గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,100 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,380 గా ఉంది.
ప్లాటినం ధర నేడు (Todays Platinum Rate) ఇలా..
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నేడు భారీగా గ్రాముకు రూ.31 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో రూ.22,400 గా ఉంది. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర యథాతథంగా ఉంది.
అంతర్జాతీయ పరిణామాల ఎఫెక్ట్
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. తాజాగా రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావమే ఈ బంగారం విపరీతంగా పెరగడానికి కారణమైంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Stock Market Opening: 60,000కు మరో 90 పాయింట్లే దూరం! దూకుడు మీదున్న సెన్సెక్స్, నిఫ్టీ
Petrol-Diesel Price, 16 August: ఆగస్టు 15 ఎఫెక్ట్! నేడు అన్ని చోట్లా నిలకడగా ఇంధన ధరలు - నగరాలవారీ రేట్లు ఇవీ
Gold-Silver Price: బంగారం, వెండి కొనాలా? నేటి ధరలు ఇక్కడ తెలుసుకోండి, ప్లాటినం కూడా
Kuppam Gold Mines : కుప్పంలో బంగారు గనులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్, రూ.450 కోట్లకు ఎన్ఎండీసీ టెండర్లు!
CM Jagan : ఏపీకి పెట్టుబడుల వెల్లువ, అచ్యుతాపురం సెజ్ లో పరిశ్రమలకు సీఎం జగన్ శంకుస్థాపన
Raghavendra Rao: మౌనమునికి కోపమొచ్చింది, సుధీర్ అభిమానులపై రాఘవేంద్రరావు అసహనం
Vemulawada: ధర్మగుండం తెరవండయ్యా! రాజన్న భక్తుల వేడుకోలు - కొవిడ్ తర్వాత పట్టించుకోకుండా
Araku Train: పర్యాటకులకు పంద్రాగస్టు కానుక, అరకు రైలుకు నాలుగో గాజు బోగి!
Puri Jagannadh: ఒక్కోసారి చార్మీ ఏడుస్తుంది, నా భార్య వల్లే కొత్త కథలు: పూరీ జగన్నాథ్