By: ABP Desam | Updated at : 26 Aug 2021 06:31 AM (IST)
నేటి బంగారం, వెండి ధరలు (ప్రతీకాత్మక చిత్రం)
భారత్‌లో బంగారం ధర ఈ రోజు (ఆగస్టు 26) స్వల్పంగా తగ్గింది. గ్రాముకు కేవలం రూ.16 తగ్గుదల కనిపించింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ (ఆగస్టు 26)న రూ.46,490 గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర తాజాగా రూ.47,490 గా ఉంది. మొత్తానికి గత 10 రోజుల ధరలతో పోలిస్తే పసిడి ధర కాస్త పెరిగింది.
భారత మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా.. వెండి ధరలు మాత్రం అతి స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో గత 10 రోజులుగా హెచ్చుతగ్గులు కనిపిస్తుండగా తాజాగా రూ.0.60 పైసలు పెరుగుదల కనిపించింది. తాజాగా భారత్‌లో కిలో వెండి ధర రూ.63,400గానే కొనసాగుతోంది. హైదరాబాద్ మార్కెట్‌లో కూడా కిలో వెండి ధర కాస్త ఎక్కువగా రూ.68,200 ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ముఖ్య నగరాల్లో ఆగస్టు 26న బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి తాజా ధరలివీ..
హైదరాబాద్‌లో కూడా 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99) ధర గ్రాముకు రూ.10 మాత్రమే తగ్గింది. ఈ మేరకు ప్రస్తుతం రూ.48,380 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం (91.6) ధర రూ.44,350 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.68,200 పలికింది. ముందు రోజుతో పోలిస్తే వెండి ధర హైదరాబాద్‌లో స్వల్పంగానే తగ్గింది.
ఇక విజయవాడలో 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ఆగస్టు 26న రూ.44,350 కాగా.. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,380గా ఉంది. విజయవాడలో ఆగస్టు 25తో పోలిస్తే ధర గ్రాముకు రూ.10 మాత్రమే తగ్గింది. ఇక్కడ కిలో వెండి ధర రూ.68,200గా ఉంది. విజయవాడ మార్కెట్‌లో వెండి ధరలో మార్పు కనిపించలేదు. ఇక విశాఖపట్నం పసిడి మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,350 గానే ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,380గా ఉంది. ఇక్కడ కూడా వెండి ధర కిలో రూ.68,200 పలుకుతోంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఆగస్టు 26న ఇలా ఉన్నాయి. ముంబయిలో ఈరోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.46,490ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,490గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,740 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,790గా ఉంది.
ప్లాటినం ధరలో స్వల్ప తగ్గుదల
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర హైదరాబాద్‌లో గ్రాము రూ.2,372గా ఉంది. ముందు రోజుతో పోలిస్తే ఈ ధర నిలకడగానే ఉంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.23,720 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర అదే కొనసాగుతోంది.
అనేక అంశాలపై పసిడి ధర
బంగారం ధరల్లో ప్రతిరోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి.
Cryptocurrency Prices: రివ్వున ఎగిసిన క్రిప్టోలు! భారీగా పెరిగిన బిట్‌కాయిన్
Stock Market News: రిలాక్స్ గాయ్స్! దూసుకెళ్లిన సెన్సెక్స్, నిఫ్టీ! రూపాయి మాత్రం...!
Modi Govt Scheme: పెళ్లైన వారికి బొనాంజా! రూ.200తో ఏటా రూ.72వేలు పొందే స్కీమ్ ఇది!
Banking Sector News: రూ.6.41 లక్షల కోట్ల మొండి బాకాయిలు! మోదీ ప్రభుత్వం ఏం చేసిందంటే?
Petrol Price Today 08 August 2022: వాహనదారులకు ఊరట! పలుచోట్ల తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు - లేటెస్ట్ రేట్లు ఇలా
India Medal Tally: 22 స్వర్ణాలతో నాలుగో స్థానంలో భారత్ - కామన్వెల్త్ గేమ్స్‌లో మన ప్రస్థానం ఇదే!
కేవలం 12 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - రియల్మీ కొత్త ఫోన్ లాంచ్‌కు రెడీ!
రాఖీకి మీ సోదరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా - అయితే ఈ ఆప్షన్లపై ఓ లుక్కేయండి!
Monkeypox: మంకీపాక్స్ వైరస్ రెండు కొత్త లక్షణాలు ఇవే, కనుగొన్న కొత్త అధ్యయనం