By: ABP Desam | Updated at : 23 Jan 2022 07:33 AM (IST)
బంగారం, వెండి ధరలు (Representational Image)
Gold Silver Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు దిగొచ్చాయి. బంగార ధర వరుసగా మూడు రోజులు పెరిగింది, నేడు మళ్లీ పతనమైంది. మరోవైపు వెండి ధర కూడా పసిడి బాటలో నడుస్తూ దిగొచ్చింది. తాజాగా హైదరాబాద్‌లో రూ.150 మేర పతనం కావడంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,500 అయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.49,640గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర రూ.300 మేర తగ్గడంతో హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.69,000 అయింది.
ఏపీ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,650 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.45,500 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. వెండి 1 కిలోగ్రాము ధర రూ.69,000కు పతనమైంది. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్‌లో బంగారం ధర నేడు క్షీణించింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,500.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,800 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ప్రధాన నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశ రాజధాని ఢిల్లీ సహా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,100 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,800 గా ఉంది. ముంబయిలో రూ.110 మేర తగ్గడంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,530 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,530 అయింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారంపై రూ.60 తగ్గడంతో తులం ధర రూ.45,880 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,050కు పతనమైంది.
తగ్గిన ప్లాటినం ధర
మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర వరుసగా నేడు తగ్గింది. హైదరాబాద్‌లో రూ.14 మేర తగ్గగా 10 గ్రాముల ధర రూ.24,600 కి క్షీణించింది. ఢిల్లీ, చెన్నైలో రూ.14 మేర తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.24,600 గా ఉంది. ఏపీలోని విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం హైదరాబాద్ ధర వద్దే మార్కెట్ అవుతోంది.
పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Highest Selling Hatchback Cars: నవంబర్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన హ్యాచ్‌బాక్‌లు ఇవే - కొనసాగుతున్న మారుతి సుజుకి హవా!
EV Range Tips: ఎలక్ట్రిక్ కారు రేంజ్ పెంచాలనుకుంటున్నారా? - ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
LIC Policy: ఆడపిల్ల పెళ్లి కోసం దిగులొద్దు, ఈ పాలసీ తీసుకుంటే ఎల్‌ఐసీ మీకు రూ.31 లక్షలు ఇస్తుంది!
Tax Notice: ఇల్లు కొన్నాక 20 శాతం TDS కట్టమంటూ నోటీస్ వచ్చిందా, తప్పు ఎక్కడ జరిగిందో అర్ధమైందా?
Coca Cola Liquor: కోకా కోలా నుంచి మొదటి లిక్కర్ బ్రాండ్ - రేటెంత, ఎక్కడ దొరుకుతుందో తెలుసా?
Uttam Kumar Reddy to visit Medigadda: మేడిగడ్డ సందర్శించాలని మంత్రి ఉత్తమ్ నిర్ణయం, వెంట వాళ్లు ఉండాలని అధికారులకు ఆదేశాలు
YSRCP Gajuwaka : వైసీపీకి గాజువాక ఇంచార్జ్ గుడ్ బై - వెంటనే గుడివాడ అమర్నాథ్‌కు బాధ్యతలు !
Hyderabad News: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎండీ సజ్జనార్ - 'మహాలక్ష్మి' పథకంపై పరిశీలన, ఇబ్బందులుంటే ఈ నెంబర్లకు కాల్ చేయాలని సూచన
Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!
/body>