Gold-Silver Price: బంగారం కొనాలా? నేడు ఎగబాకిన ధర! స్థిరంగానే వెండి

ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.46,250 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.50,460 గా ఉంది.

FOLLOW US: 

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు బాగా పెరిగింది. గ్రాముకు రూ.35 చొప్పున ఎగబాకింది. కానీ, వెండి ధర నేడు నిలకడగా ఉంది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.46,250 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.50,460 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు స్థిరంగా రూ.70,000 వద్ద ఉంది. రెండ్రోజులుగా వెండి ధర ఇలాగే ఉండగా.. నేడు కూడా అదే ధర ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.

ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,460గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.70,000 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.46,250 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.50,460గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.70 వేలుగా ఉంది.

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
అయితే, ఇతర నగరాల్లో బంగారం ధరల్లో కూడా నేడు పెరుగుదల కనిపించింది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.47,620గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,000గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,460 గా ఉంది.

ప్లాటినం ధర నేడు ఇలా..
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నేడు భారీగా తగ్గింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర నేడు రూ.15 పెరిగి.. రూ.25,750 గా అయింది. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర యథాతథంగా ఉంది.

అనేక అంశాలపై పసిడి, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.

Published at : 23 Feb 2022 06:45 AM (IST) Tags: Gold Price Silver Price Todays gold cost Todays silver price platinum price hyderabad gold silver price vijayawada gold rate

సంబంధిత కథనాలు

Cryptocurrency Prices Today: కొద్దిగా లాభపడ్డ బిట్‌కాయిన్‌! ఎథీరియమ్‌కు సపోర్ట్‌!

Cryptocurrency Prices Today: కొద్దిగా లాభపడ్డ బిట్‌కాయిన్‌! ఎథీరియమ్‌కు సపోర్ట్‌!

Petrol-Diesel Price, 29 May: నేడు చాలాచోట్ల పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం - ఈ నగరాల్లో స్థిరంగా

Petrol-Diesel Price, 29 May: నేడు చాలాచోట్ల పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం - ఈ నగరాల్లో స్థిరంగా

Gold-Silver Price: నేడు నిలకడగా బంగారం ధరలు, వెండి మాత్రం పైపైకి - మీ ప్రాంతంలో ధరలు ఇవీ

Gold-Silver Price: నేడు నిలకడగా బంగారం ధరలు, వెండి మాత్రం పైపైకి - మీ ప్రాంతంలో ధరలు ఇవీ

Stock Market Weekly Review: హ్యాపీ.. హ్యాపీ! 2000 లాభపడ్డ సెన్సెక్స్‌ - ఇన్వెస్టర్లకు రూ.10 లక్షల కోట్ల లాభం

Stock Market Weekly Review: హ్యాపీ.. హ్యాపీ! 2000 లాభపడ్డ సెన్సెక్స్‌ - ఇన్వెస్టర్లకు రూ.10 లక్షల కోట్ల లాభం

Hyundai Venue: హ్యుండాయ్ వెన్యూ కొత్త రికార్డు - ఎన్ని కార్లు అమ్ముడుపోయాయంటే?

Hyundai Venue: హ్యుండాయ్ వెన్యూ కొత్త రికార్డు - ఎన్ని కార్లు అమ్ముడుపోయాయంటే?

టాప్ స్టోరీస్

F3 Movie OTT Release: 'ఎఫ్3' ఓటీటీ రిలీజ్ అప్డేట్ - స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?

F3 Movie OTT Release: 'ఎఫ్3' ఓటీటీ రిలీజ్ అప్డేట్ - స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?

IPL Final, RR vs GT Fantasy 11: ఐపీఎల్‌ ఫైనల్‌ ఫాంటసీ XIలో బెస్ట్‌ టీమ్‌ ఇదే!

IPL Final, RR vs GT Fantasy 11: ఐపీఎల్‌ ఫైనల్‌ ఫాంటసీ XIలో బెస్ట్‌ టీమ్‌ ఇదే!

Drone Shot Down: అమర్‌నాథ్ యాత్రపై ఉగ్ర కుట్ర, బాంబులతో వచ్చిన డ్రోన్‌ను కూల్చేసిన సైన్యం

Drone Shot Down: అమర్‌నాథ్ యాత్రపై ఉగ్ర కుట్ర, బాంబులతో వచ్చిన డ్రోన్‌ను కూల్చేసిన సైన్యం

Nepal Plane Missing: నేపాల్‌లో విమానం మిస్సింగ్, ATCతో సిగ్నల్స్ కట్ - లోపల ఉన్న 22 మందిలో భారతీయులు కూడా

Nepal Plane Missing: నేపాల్‌లో విమానం మిస్సింగ్, ATCతో సిగ్నల్స్ కట్ - లోపల ఉన్న 22 మందిలో భారతీయులు కూడా