By: ABP Desam | Updated at : 20 Aug 2021 07:15 AM (IST)
బంగారం, వెండి ధరలు (ప్రతీకాత్మక చిత్రం)
భారత్‌లో వరుసగా మూడు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు శుక్రవారం నాడు (ఆగస్టు 20) తగ్గాయి. ఆగస్టు 20న బంగారం ధరలో భారత మార్కెట్‌లో గ్రాముకు రూ.37 తగ్గింది. దీంతో భారత మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ రూ.46,130 గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర తాజాగా రూ.47,130గా ఉంది. మొత్తానికి గత వారం రోజులతో పోలిస్తే బంగారం ధర నిలకడగా ఉంది.
భారత మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గగా వెండి ధర మాత్రం అతి స్వల్ప తగ్గుదల నమోదు చేసింది. వెండి గ్రాముకు రూ.1 తగ్గింది. తాజాగా భారత్‌లో కిలో వెండి ధర రూ.62,500 గా ఉంది. హైదరాబాద్ మార్కెట్‌లో వెండి ధర గ్రాముకు రూ.0.80 పైసలు తగ్గింది. ఇక్కడ కిలో వెండి ధర కాస్త ఎక్కువగా రూ.67,400గా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ముఖ్య నగరాల్లో ఆగస్టు 20న పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
ఏపీ, తెలంగాణలో బంగారం, వెండి తాజా ధరలివీ..
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర గ్రాముకు రూ.20 చొప్పున తగ్గింది. దీంతో 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.48,100 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం (91.6 స్వచ్ఛత) ధర రూ.44,100 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.67,400గా పలికింది.
ఇక విజయవాడలో 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ఆగస్టు 20న రూ.44,100 కు తగ్గింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,100గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.67,400గా ఉంది. ఇక విశాఖపట్నం పసిడి మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,100 గానే ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,100గా ఉంది. ఇక్కడ వెండి ధర కిలో రూ.67,400 కు తగ్గింది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఆగస్టు 20న ఇలా ఉన్నాయి. ముంబయిలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.46,130ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,130గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,490 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,540గా ఉంది.
ప్లాటినం ధరలో భారీ తగ్గుదల
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర మాత్రం ఆగస్టు 20న బాగా తగ్గింది. గ్రాముకు రూ.82 వరకూ తగ్గి ధర రూ.2,294గా ఉంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.22,940 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర అంతే ఉంది.
అనేక అంశాలపై పసిడి, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: Rahul Gandhi Tour: వరంగల్‌కు రాహుల్ గాంధీ.. అదే రోజు హుజూరాబాద్ అభ్యర్థిని ప్రకటిస్తారా ఏంటి?
Stock Market Closing: సెన్సెక్స్ 60k టచ్ చేసింది.. నిలబడింది! రేపు నిఫ్టీ 18K దాటేందుకు సిద్ధం!
Top Loser Today August 16, 2022 స్టాక్ మార్కెట్ సెన్సెక్స్, నిఫ్టీ టాప్ లాసర్స్ జాబితా
టాప్ గెయినర్స్ August 16, 2022 : స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్, నిఫ్టీ టాప్ గెయినర్స్
Salary Hike: గుడ్ న్యూస్! 2023లో ఉద్యోగుల వేతనాల్లో బంపర్ పెరుగుదల!
PM Kisan Yojana Update: రైతులకు గుడ్‌న్యూస్! కిసాన్ యోజన 12వ విడత నగదు వచ్చేది అప్పుడే!
కమ్యూనిస్టులపై సంజయ్ సంచలన కామెంట్స్- కేసీఆర్ చిల్లర పెంకులకు ఆశపడ్డారంటూ ఆరోపణ
Venkaiah On Sita Ramam: చాలా కాలం తర్వాత ఓ చక్కని సినిమా చూశా- సీతారామంపై వెంకయ్య రివ్యూ
KTR : ఆసియా లీడర్స్ మీట్‌కు కేటీఆర్ - ఆహ్వానం పంపిన ప్రతిష్టాత్మక సంస్థ !
Anantapur Crime News : బిల్లులు చెల్లించమన్నదుకు విద్యుత్ ఏఈపై చెప్పుతో దాడి - ఉరవకొండలో సర్పంచ్ అరాచకం !