Gold Silver Price Today 18th May 2022 : గోల్డ్ ప్రియులకు షాకింగ్ న్యూస్, నేడు భారీగా పెరిగిన బంగారం రేట్స్, స్వల్పంగా పెరిగిన వెండి
Gold Silver Price Today 18th May 2022 : భారత్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా స్పల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ఇలా ఉన్నాయి.
Gold Silver Price Today 18th May 2022 : భారత్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ(బుధవారం) గ్రాముకి రూ.30 పెరిగింది. వెండి ధరలు 100 గ్రాములకు రూ.110 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.46,550 ఉండగా, 24 క్యారెట్ల ధర 10 గ్రాములు రూ.50,780గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర ఇవాళ(బుధవారం) భారీగా పెరిగింది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వెండి ధర స్వల్పంగా పెరిగింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.46,550గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర గ్రాముకి రూ.33 పెరిగి ప్రస్తుతం రూ.50,780(10 గ్రాములు) ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర గ్రాముకి రూ.1.10 పెరిగి హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.65,600(ఒక కేజీ) అయింది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలివే
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780
- విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550, 24 క్యారెట్ల ధర రూ.50,780
- దిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,640, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,970
- ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780
- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780
వెండిధరలు :
భారత మార్కెట్ లో వెండి ధరలు సల్వంగా పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో కిలో వెండి రూ.61,550 ఉండగా, చెన్నైలో రూ.65,600గా ఉంది. ముంబయిలో కిలో వెండి రూ.61,550 ఉండగా, కోల్‌కతాలో రూ.61,550, బెంగళూరులో కిలో వెండి రూ.65,600 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,600 ఉండగా, విజయవాడ, విశాఖలో కూడా రూ. 65,600 వద్ద కొనసాగుతోంది.
రష్యా - ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. తాజాగా రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావమే ఈ బంగారం విపరీతంగా పెరగడానికి కారణమైంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.