By: ABP Desam | Updated at : 06 Nov 2021 06:42 AM (IST)
బంగారం, వెండి ధరలు (ప్రతీకాత్మక చిత్రం)
Gold-Silver Price Today: తెలుగు రాష్ట్రాల్లో ధనత్రయోదశి సందర్భంగా నిలకడగా ఉన్న బంగారం ధరలు దీపావళి నుంచి పెరుగుతున్నాయి. బంగారం దారిలోనే వెండి పయనిస్తోంది. తాజాగా రూ.160 మేర పుంజుకోవడంతో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.48,760 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో రూ.44,700 గా ఉంది. ఇక వెండి ధర రూ.900 మేర పెరగడంతో హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.68,600 అయింది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ దాదాపుగా ఇవే ధరలతో ట్రేడింగ్ జరుగుతోంది.
ఇక ఏపీలోనూ బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. విజయవాడ నగరంలో ధర పెరగడంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,760గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.44,500 అయింది. ఇక్కడ కిలో వెండి ధర రూ.68,600గా ఉంది. ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,700 వద్ద ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,760కు చేరింది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.68,600 గా మార్కెట్ అవుతోంది.
Also Read: మీరు పన్ను చెల్లింపుదారులా? కొత్త స్టేట్‌మెంట్ తెచ్చిన ఐటీ శాఖ
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని పలు ముఖ్య నగరాలలో బంగారం ధరలు నేడు ఇలా ఉన్నాయి. రాజధాని ఢిల్లీలో రూ.210 మేర పెరగడంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,100 ఉండగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.46,850 అయింది. చెన్నైలో బంగారం ధర రూ.640 మేర భారీగా పుంజుకుంది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.45,060 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,140 అయింది. ముంబయిలో మాత్రం బంగారం ధర స్వల్పంగా దిగొచ్చింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47220 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,220 వద్ద ఉంది.
తగ్గిన ప్లాటినం ధర
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర తాజాగా తగ్గింది. రూ.35 మేర తగ్గగా ముంబైలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.24,610 కి దిగొచ్చింది. ఢిల్లీ, హైదరాబాద్ విశాఖపట్నం, విజయవాడలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.24,500 అయింది.
Also Read: డబ్బు సంపాదించాలంటే ఈ 6 అలవాట్లు చేసుకోండి..! ఆ తర్వాత...!
అనేక అంశాలపై పసిడి, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
కొత్త ఎంజీ హెక్టార్ ఫస్ట్ లుక్ వచ్చేసింది - ఎలా ఉందో చూశారా?
Cryptocurrency Prices: 24 గంటల్లో ఇంత పెరిగిందా! బిట్‌కాయిన్‌ను అస్సలు ఊహించలేదు!
Stock Market Closing: ఎగిసిన సెన్సెక్స్, నిఫ్టీ! ఒక్క రోజులో రూ.2.5 లక్షల కోట్లు లాభపడ్డ ఇన్వెస్టర్లు!
Elon Musk Teases X.com: ట్విటర్‌కు పోటీగా X.com తెస్తానన్న ఎలన్ మస్క్! ఓపెన్ చేస్తే ఏమొస్తుందో తెలుసా?
Raksha Bandan 2022: రాఖీ కడితే డబ్బు, బంగారం ఇవ్వకండి! ఇలా ప్రేమను చాటుకోండి!
Malik Review: మాలిక్ రివ్యూ: ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్ ఆకట్టుకుంటుందా?
Telangana Cabinet : ఆగస్టు 15 నుంచి పది లక్షల మంది కొత్తగా సామాజిక పెన్షన్లు - తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు !
కొణిదెల వారింట పెళ్లి సందడి - ఆ యాంకర్‌తో మెగా హీరో నిశ్చితార్థం!
టార్గెట్ లోకేష్ వ్యూహంలో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందా?