అన్వేషించండి

Gold: బంగారు కొండలు ఈ 10 దేశాలు - మన దేశ ఖజానాలో ఎంత గోల్డ్‌ ఉందో తెలుసా?

RBI Gold Reserves: పెద్ద దేశాల్లో ఎంత గోల్డ్ రిజర్వ్‌ ఉందనే ఉత్సుకత ప్రజల్లో పెరిగింది. ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం ప్రజలు గూగుల్‌లో వెదుకుతున్నారు.

Top-10 Countries That Own Most Gold: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల బ్రిటన్ నుంచి భారత్‌కు 100 టన్నుల బంగారాన్ని తీసుకొచ్చింది. అది భారతదేశానికి చెందిన బంగారమే. 1991లో, ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి భారత్‌ ఈ బంగారాన్ని తాకట్టు పెట్టింది. అప్పటి నుంచి ఆ బంగారమంతా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌ సేఫ్‌ల్లోనే ఉంది. ఇప్పుడు.. తాకట్టు బంగారాన్ని ఇంగ్లండ్‌ నుంచి తిరిగి తీసుకొచ్చిన కేంద్ర బ్యాంక్‌.. ముంబై, నాగ్‌పూర్‌ కార్యాలయాల్లో భద్రపరిచింది.

ఆర్‌బీఐ భారీ మొత్తంలో పసిడిని తీసుకువచ్చేసరికి, ఆ వార్త దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. దీంతో.. భారతదేశంలో ఎంత బంగారం ఉంది, ప్రపంచంలో ఏ దేశం ఎంత పసిడిని నిల్వ చేసిందన్న ప్రశ్నలు తలెత్తాయి. పెద్ద దేశాల్లో ఎంత గోల్డ్ రిజర్వ్‌ ఉందనే ఉత్సుకత ప్రజల్లో పెరిగింది. ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం ప్రజలు గూగుల్‌లో వెదుకుతున్నారు. 

విదేశాల్లో 500 టన్నుల బంగారం
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (World Gold Council) నివేదిక ప్రకారం, 2024 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం నాటికి భారతదేశంలో దాదాపు 800 టన్నుల బంగారం ఉంది. ఇందులో దాదాపు 500 టన్నులు విదేశాల్లో, 300 టన్నులు భారత్‌లో ఉంచారు. ఇప్పుడు, RBI 100 టన్నుల బంగారాన్ని భారత్‌కు తిరిగి తీసుకువచ్చిన తర్వాత ఈ నంబర్‌ శాతం పెరిగింది. ప్రస్తుతం, రిజర్వ్‌ బ్యాంక్‌ దగ్గర 822 టన్నుల బంగారం ఉంది. గత ఏడాది ఇదే కాలంలో 794.63 టన్నులు ఉంది. గత కొన్నేళ్లుగా, ఆర్‌బీఐ నిరంతరం బంగారం కొనుగోలు చేస్తోంది. ఇదే ట్రెండ్‌ కొనసాగితే, మనం త్వరలోనే జపాన్‌ను అధిగమించొచ్చు. ప్రస్తుతం జపాన్ దగ్గర దాదాపు 845 టన్నుల బంగారం ఉంది.

మిడిల్ ఈస్ట్‌లో వివాదాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. దీంతోపాటు, రష్యాపై అమెరికా నిరంతర ఆంక్షలు ఉండనే ఉన్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని, ఇటీవలి కాలంలో అన్ని దేశాల కేంద్ర బ్యాంక్‌లు బంగారం కొనుగోళ్లను పెంచాయి. యుద్ధం ప్రభావంతో తమ దేశ ఆర్థిక పరిస్థితి దిగజారకుండా భద్రత కల్పించడానికి విరివిగా పసిడి కొనుగోళ్లు చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే, RBI కూడా 100 టన్నుల గోల్డ్‌ను స్వదేశానికి తీసుకువచ్చినట్లు నిపుణులు తెలిపారు. 

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం, ప్రపంచంలోనే అత్యధిక బంగారం ఉన్న 10 దేశాలు ఇవి ‍‌(top 10 countries that own the most gold):

అమెరికా  – – –   8,133.46 టన్నులు ($579,050.15 మిలియన్లు)
జర్మనీ   – – –   3,352.65 టన్నులు ($238,662.64 మిలియన్లు)
ఇటలీ   – – –   2,451.84 టన్నులు ($174,555.00 మిలియన్లు)
ఫ్రాన్స్   – – –   2,436.88 టన్నులు ($173,492.11 మిలియన్లు)
రష్యా   – – –   2,332.74 టన్నులు ($166,076.25 మిలియన్లు)
చైనా   – – –   2,262.45 టన్నులు ($161,071.82 మిలియన్లు)
స్విట్జర్లాండ్   – – –  1,040.00 టన్నులు ($69,495.46 మిలియన్లు)
జపాన్   – – –   845.97 టన్నులు ($60,227.84 మిలియన్లు)
భారత్‌   – – –   822.09 టన్నులు ($58,527.34 మిలియన్లు)
నెదర్లాండ్స్   – – –   612.45 టన్నులు ($43,602.77 మిలియన్లు)

ప్రపంచంలోని చాలా సెంట్రల్ బ్యాంక్‌లు పోటాపోటీగా కొనుగోళ్లు చేస్తుండడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ఎల్లో మెటల్‌ రేటు నిరంతరం పెరుగుతోంది. 

మరో ఆసక్తికర కథనం: 7.5 కోట్ల మందికి గుడ్‌న్యూస్‌ - పీఎఫ్‌ ఖాతాలో ఈ తప్పులను ఆన్‌లైన్‌లోనే మార్చొచ్చు

టాప్ హెడ్ లైన్స్

15 ఏళ్ల హోమ్ లోన్ 6 ఏళ్లలో క్లోజ్ చేసే షార్ట్ కట్ ఇదే! డబ్బు ఆదా చేసే సులభమైన మార్గం!
15 ఏళ్ల హోమ్ లోన్ 6 ఏళ్లలో క్లోజ్ చేసే షార్ట్ కట్ ఇదే! డబ్బు ఆదా చేసే సులభమైన మార్గం!
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Embed widget