By: Arun Kumar Veera | Updated at : 03 Jun 2024 03:45 PM (IST)
పీఎఫ్ ఖాతాలో ఈ తప్పులను ఆన్‌లైన్‌లోనే మార్చొచ్చు
How To Update Name KYC Details In PF Account: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌కు దేశవ్యాప్తంగా 7.5 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. తన ఖాతాదార్ల సౌలభ్యం కోసం EPFO చాలా సేవలను ఆన్‌లైన్ చేసింది. దీనివల్ల, ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పని లేకుండా ఆన్‌లైన్‌లోనే చాలా పనులు పూర్తి చేయవచ్చు.
కొన్నిసార్లు, ఈపీఎఫ్ ఖాతా తెరిచేటప్పుడు పేరు, వయస్సు వంటి వివరాలు తప్పుగా నమోదు చేస్తుంటారు. ఈ వివరాలను ఆఫ్‌లైన్ ద్వారానే కాదు, ఇప్పుడు ఆన్‌లైన్‌లోనూ అప్‌డేట్ చేయవచ్చు. గతంలో, దీనికోసం ఉద్యోగి జాయింట్ డిక్లరేషన్ ఫారాన్ని కంపెనీ యజమాని పూరించాలి. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ వివరాలను ఆన్‌లైన్‌లోనే మార్చవచ్చు.
ఆన్‌లైన్ ద్వారా EPF ఖాతాల్లో 11 మార్పులు చేయవచ్చు:
EPF చందాదార్లు ఆన్‌లైన్ ద్వారా మొత్తం 11 విషయాలను అప్‌డేట్ చేయవచ్చు. సభ్యుని పేరు, జెండర్, పుట్టిన తేదీ, తల్లి/తండ్రి పేరు, సంబంధం, వైవాహిక స్థితి, ఉద్యోగంలో చేరిన తేదీ, ఉద్యోగం మానేయడానికి కారణం, ఉద్యోగం మానేసిన తేదీ, పౌరసత్వం, ఆధార్ వివరాలు వంటివాటిలో తప్పులను సరిచేయవచ్చు. అప్లికేషన్‌తో పాటు, ఆ అభ్యర్థనకు సంబంధించిన అవసరమైన రుజువు పత్రాలను (Proof documents) కూడా అప్‌లోడ్ చేయాలి.
ఈపీఎఫ్‌లో వివరాలను ఎలా అప్‌డేట్ చేయాలి? (How to update EPF profile online?)
1. EPFOలో ఏవైనా వివరాలను అప్‌డేట్ చేయడానికి, ముందుగా EPFO అధికారిక వెబ్‌సైట్, epfindia.gov.in పోర్టల్‌లోకి వెళ్లండి.
2. తర్వాత, ‘For Employees’ విభాగంలోకి వెళ్లి, Services’ ఆప్షన్ ఎంచుకోండి.
3. తర్వాత ‘Member UAN/ Online Service’ ఆప్షన్ ఎంచుకోండి.
4. ఇప్పుడు మరో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో UAN, పాస్‌వర్డ్ నమోదు చేయాలి.
5. తర్వాత, మీ EPF ఖాతా ఓపెన్ అవుతుంది. ఇక్కడ, 'Manage' ట్యాబ్‌పై క్లిక్ చేసి, ఆపై ‘Joint Declaration’ బటన్ మీద క్లిక్ చేయండి.
6. మార్పులు చేయాలనుకుంటున్న మెంబర్ IDని ఎంచుకోండి.
7. వివరాలలో మార్పులు చేసేందుకు కొన్ని పత్రాల జాబితా కనిపిస్తుంది. మీ అవసరాన్ని బట్టి వాటి నుంచి ఎంచుకోవాలి.
8. వివరాల్లో మార్పులు చేసిన తర్వాత అవసరమైన రుజువు పత్రాలను అప్‌లోడ్ చేయండి.
9. ఈ అభ్యర్థన మీ సంస్థ యాజమాన్యానికి వెళ్తుంది.
అభ్యర్థనను స్వీకరించిన కంపెనీ యాజమాన్యం, ఆ ఉద్యోగి రికార్డులను తనిఖీ చేస్తుంది. ఉద్యోగి అభ్యర్థన సరైనదే అని గుర్తిస్తేనే ఆ అప్లికేషన్‌ను ఆమోదిస్తుంది. దరఖాస్తు పట్ల సంస్థ సంతృప్తి చెందకపోతే తిరస్కరిస్తుంది. యాజమాన్యం ఆమోదం పొందిన అప్లికేషన్ సంబంధిత PF ప్రాంతీయ కార్యాలయానికి వెళ్తుంది. ఈ కొత్త సదుపాయాన్ని ఉపయోగించి సభ్యులు తమ అభ్యర్థనలను సమర్పిస్తున్నారు. EPFO లెక్క ప్రకారం, ఇప్పటి వరకు 2.75 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో దాదాపు 40,000 అప్లికేషన్లను ప్రాంతీయ కార్యాలయాలు ఇప్పటికే పరిష్కరించాయి.
మరో ఆసక్తికర కథనం: ప్రధాన బ్యాంక్‌ల్లో పెరిగిన FD రేట్లు - RBI మీటింగ్‌కు ముందే కస్టమర్లకు బహుమానం
పర్సనల్ లోన్ కొరకు అర్హత: బజాజ్ ఫైనాన్స్ తో త్వరిత నిధులకు సులభమైన మార్గదర్శకం
EPFO Update: ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి
Investment Tips: వెండి లేదా గోల్డ్ ఎందులో ఇన్వెస్ట్ చేయాలి ? ఏది లాభదాయకం, బెనిఫిట్స్ ఎక్కువ
Year Ender 2025 : ఉద్యోగస్తులకు కలిసి వచ్చిన 2025- పెద్ద ఊరటనిచ్చిన అంశాలు ఇవే!
Investment Tips: పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
Australia terror attack: ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి పాల్పడిన తండ్రీ కొడుకులు హైదరాబాద్ వాళ్లే - పాకిస్తాన్ వాళ్లు కాదు !
BRS Party Key Meeting: ఈ 19న జరగాల్సిన బీఆర్ఎస్ కీలక సమావేశం వాయిదా వేసిన కేసీఆర్
YSRCP Kukatpalli: కూకట్‌పల్లిలో ధర్నాలు, రాజకీయ ప్రదర్శనలు - వైఎస్ఆర్సీపీ నేతలు హద్దులు చెరిపేస్తున్నారా?
Jai Akhanda: 'జై అఖండ'కు కొత్త నిర్మాతలు... 14 రీల్స్ ప్లస్ నుంచి మరొకరికి!