By: Arun Kumar Veera | Updated at : 03 Jun 2024 02:47 PM (IST)
ప్రధాన బ్యాంక్‌ల్లో పెరిగిన FD రేట్లు
Fixed Deposit Interest Rates 2024: మరో రెండు రోజుల్లో, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం ప్రారంభమవుతుంది. బుధవారం నాడు భేటీ మొదలై, శుక్రవారం నాడు ముగుస్తుంది. ప్రస్తుతం 6.50%గా ఉన్న రెపో రేట్‌ను కేంద్ర బ్యాంక్ ఇంకా పెంచుతుందా, తగ్గిస్తుందా లేదా యథాతథంగా ఉంచుతుందా అన్నది ఆ మీటింగ్‌లో తేలిపోతుంది. అయితే, RBI MPC సమావేశానికి ముందుగానే కొన్ని ప్రధాన బ్యాంక్‌లు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను (Fixed Deposit Interest Rates) పెంచాయి.
వడ్డీ రేట్లు పెంచిన SBI
దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank), 2024 మే 15న, తన ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను (SBI Fixed Deposit Interest Rates) 75 బేసిస్ పాయింట్లు (0.75%) వరకు పెంచింది. రూ.2 కోట్ల కంటే తక్కువ మొత్తం డిపాజిట్లకు ఈ పెంపు వర్తిస్తుంది.
- 46-179 రోజుల కాలపరిమితి FD మీద సాధారణ కస్టమర్లు (60 ఏళ్ల వయస్సు లోపు ఉన్న కస్టమర్లు) 75 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ అందుకుంటారు. అంటే, 4.75 శాతానికి బదులుగా 5.50 శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లు (60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న కస్టమర్లు) అదే కాలానికి 5.25 శాతానికి బదులుగా 6 శాతం వడ్డీ ఆదాయం పొందుతారు.
- 180-210 రోజుల టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను బ్యాంక్ 25 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ ఎఫ్‌డీలపై సాధారణ కస్టమర్లకు 5.75 శాతానికి బదులుగా 6 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం వడ్డీ లభిస్తుంది.
- 211-1 సంవత్సరం టెన్యూర్ ఉన్న FDలపైనా బ్యాంక్ 25 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ టెన్యూర్‌లో కస్టమర్లు 6.00 శాతానికి బదులుగా 6.25 శాతం; సీనియర్ సిటిజన్‌లు 6.50 శాతానికి బదులు 6.75 శాతం వడ్డీ ఆదాయం పొందుతారు.
SBI బల్క్ ఎఫ్‌డీ రేట్లలోనూ మార్పులు
- రెండు కోట్ల రూపాయలు దాటిన (బల్క్) ఎఫ్‌డీ రేట్లను కూడా స్టేట్ బ్యాంక్ సవరించింది. 7-45 రోజుల ఎఫ్‌డీ స్కీమ్‌పై వడ్డీ రేటును 25 bps లేదా 0.25% పెంచింది. ఈ కాల గడువులో, సాధారణ కస్టమర్లు 5.25 శాతం, సీనియర్ సిటిజన్లు 5.75 శాతం వడ్డీ పొందుతారు.
- 46-179 రోజుల బల్క్ ఎఫ్‌డీపై 50 bps లేదా 0.50% పెంచింది. ఈ కాలపరిమితిలో కొత్త రేట్లు సాధారణ కస్టమర్లకు 6.25 శాతం & సీనియర్ సిటిజన్లకు 6.75 శాతంగా మారాయి.
- 180-210 రోజుల బల్క్ ఎఫ్‌డీ వడ్డీ రేట్లను 10 bps లేదా 0.10% పెంచింది. ఈ కేస్‌లో, సాధారణ కస్టమర్లకు 6.60 శాతం & సీనియర్ సిటిజన్లకు 7.10 శాతం వడ్డీ ఆదాయం అందుతుంది.
- 1-2 సంవత్సరాల బల్క్ ఎఫ్‌డీ పథకంపై వడ్డీ రేటు 20 bps లేదా 0.20% పెరిగింది. ఈ టెన్యూర్‌లో సాధారణ కస్టమర్లకు 7 శాతం & సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ లభిస్తుంది.
- 2-3 సంవత్సరాల ఎఫ్‌డీ వడ్డీపై వడ్డీ 50 bps లేదా 0.50% పెరిగింది. ఈ టైమ్ పిరియడ్‌లో సాధారణ కస్టమర్లకు 7 శాతం & సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ రేటును స్టేట్ బ్యాంక్ ఆఫర్ చేస్తోంది.
SBI తర్వాత యెస్ బ్యాంక్ (YES Bank Fixed Deposit Interest Rates) కూడా రూ. 2 కోట్లలోపు డిపాజిట్లపై వడ్డీ రేట్లను 25 bps వరకు పెంచింది. కొత్త వడ్డీ రేట్ల ప్రకారం, వివిధ కాల పరిమితుల్లో సాధారణ పౌరులు 3.25% నుంచి 8% వరకు; సీనియర్ సిటిజన్‌లు 3.75% నుంచి 8.50% వరకు వడ్డీ ఆర్జించవచ్చు. 8%-8.50% రేట్లు 18 నెలల కాల వ్యవధికి అందుబాటులో ఉంటాయి. యెస్ బ్యాంక్ కొత్త వడ్డీ రేట్లు 2024 మే 30వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి.
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (Utkarsh SFB), సిటీ యూనియన్ బ్యాంక్ (City Union Bank), ఆర్‌బీఎల్ బ్యాంక్ (RBL Bank) కూడా గత నెలలో వడ్డీ రేట్ల సవరణలు ప్రకటించాయి.
ప్రస్తుతం, మన దేశంలో వడ్డీ రేట్లు గరిష్ట స్థాయుల్లో ఉన్నాయి. చాలామంది వ్యక్తులు తమ పెట్టుబడుల కోసం FDలను ఎంచుకుంటున్నారు. భవిష్యత్‌లో వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. అప్పుడు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఇంత వడ్డీ ఆదాయం లభించకపోవచ్చు. మన దేశంలో వడ్డీ రేట్లు పెరగాలా, తగ్గాలా అన్నది RBI MPC సమావేశంపై ఆధారపడి ఉంటుంది.
మరో ఆసక్తికర కథనం: రైతులు కూడా పన్ను చెల్లించాలి, వ్యవసాయ ఆదాయంపై టాక్స్ లేదనుకోవడం అపోహ
Bank Loan: ఫ్లెక్సీ లోన్ Vs ఓవర్‌డ్రాఫ్ట్ Vs పర్సనల్ లోన్ - ఏ అవసరానికి ఏది ఉత్తమం?
Investment Idea: తక్కువ పెట్టుబడితో అద్దె ఆదాయం పొందే కొత్త పద్ధతి - మూలధనం లాభాలూ వస్తాయి!
Gold-Silver Prices Today 03 Nov: గోల్డ్ కొనేవాళ్లకు 'గోల్డెన్ ఛాన్స్' - ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఇవీ
Retirement Fund: మీకు 30 ఏళ్లా?, ఇప్పుడు పెట్టుబడి ప్రారంభించినా రూ.5 కోట్లతో 50 ఏళ్లకే రిటైర్ కావచ్చు!
Saving Ideas: రూల్ 50:30:20 గురించి తెలుసా?, మీ జీవితాన్ని కలర్‌ఫుల్‌గా మార్చే 'గేమ్ ఛేంజర్' ఇది
AP Investments: ఏపీలో రూ.1.40 లక్షల కోట్ల పెట్టుబడులు - మంత్రి లోకేశ్ ఒక్క జూమ్ కాల్‌తో..
Narne Nithin Engagement: ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ నిశ్చితార్థం - సైలెంట్‌గా చేసుకున్న ‘ఆయ్’ హీరో!
Google Pixel Phones Banned: యాపిల్ తర్వాత గూగుల్‌పై పడ్డ ఇండోనేషియా - పిక్సెల్ ఫోన్లు బ్యాన్ - ఎందుకంటే?
AP Assembly: ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు - పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారా?