అన్వేషించండి

Gold Loan: బంగారం రుణంపై బెటర్‌ ఆఫర్‌!, ఈ 5 బ్యాంకులు తక్కువ వడ్డీ వసూలు చేస్తున్నాయ్‌

ఈ తరహా రుణాన్ని పొందేందుకు ఎక్కువ సమయం పట్టదు, ప్రక్రియ కూడా సులభంగా ఉంటుంది.

Gold Loan Interest Rate: బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల నుంచి తీసుకునే అన్ని రుణాల కంటే, బంగారం మీద తీసుకునే రుణం చాలా మెరుగైన ఎంపిక. ఎందుకంటే, గోల్డ్ లోన్‌ మీద ఇతర రుణాల కంటే తక్కువ వడ్డీ రేటు ఉంటుంది, సులభంగా లోన్‌ దొరుకుతుంది. 

బంగారాన్ని తనఖా పెట్టుకుని ఇచ్చే రుణాలను సురక్షిత రుణంగా బ్యాంకులు పరిగణిస్తాయి. అయితే, బంగారం ప్రస్తుత విలువను లెక్కించిన తర్వాత మాత్రమే రుణ మొత్తాన్ని మంజూరు చేస్తాయి. తక్కువ వడ్డీ రేట్లకు బంగారం రుణాలు ఇస్తున్న ఐదు బ్యాంకుల సమాచారాన్ని మీకు అందిస్తున్నాం. మీ అనుకూలతను బట్టి వీటిలో ఒకదాన్ని మీరు ఎంపిక చేసుకోవచ్చు. 

ఏయే బ్యాంకులు చౌకగా బంగారు రుణాలు అందిస్తున్నాయి?

HDFC బ్యాంక్ బంగారం రుణం మీద 7.20 శాతం నుంచి 16.50 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తోంది. ప్రాసెసింగ్ ఫీజుగా రుణం మొత్తంలో 1 శాతం తీసుకుంటోంది.
కోటక్ మహీంద్ర బ్యాంక్ బంగారం రుణం మీద 8% నుంచి 17% వడ్డీని వసూలు చేస్తోంది. ప్రాసెసింగ్ ఛార్జీగా 2% మొత్తాన్ని, దీనిపై GSTని తీసుకుంటోంది.
సౌత్ ఇండియన్ బ్యాంక్ 8.25 శాతం నుంచి 19 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తోంది.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.45 శాతం నుంచి 8.55 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తోంది. మంజూరు చేసిన రుణంలో 0.5 శాతాన్ని ప్రాసెసింగ్ ఛార్జీగా తీసుకుంటోంది.
ఫెడరల్ బ్యాంక్ బంగారం రుణం మీద 9.49 శాతం వడ్డీని వసూలు చేస్తోంది.

ఒకవేళ మీరు రైతు అయితే, మీ పట్టాదారు పాస్‌ పుస్తకాన్ని బ్యాంక్‌లో చూపిస్తే, మీరు తీసుకునే బంగారం రుణంపై వడ్డీ ఇంకా తగ్గుతుంది.

గోల్డ్ లోన్ మొత్తం
ఏ బ్యాంకు అయినా, బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకునే వినియోగదార్లకు, మొత్తం బంగారం విలువలో 75 శాతం నుంచి 90 శాతాన్ని రుణంగా ఇస్తుంది. ఈ పరిధిలో, మీ అవసరాన్ని బట్టి మీకు ఎంత రుణం కావాలో తీసుకోవచ్చు.

గోల్డ్‌ లోన్‌ కాల వ్యవధి - తిరిగి తీర్చే పద్ధతులు
సాధారణంగా, బంగారం రుణాన్ని తిరిగి తీర్చడానికి ఒక ఏడాది కాల వ్యవధిని మాత్రమే బ్యాంకులు ఇస్తాయి. మీ దగ్గర డబ్బులు ఉంటే, ఈ కాల గడువు కంటే ముందే అప్పు తీర్చేయవచ్చు. తద్వారా వడ్డీ మొత్తం తగ్గుతుంది. మొత్తం రుణాన్ని ఒకేసారి చెల్లించలేకపోతే, మీకు వీలయినప్పుడల్లా కొంత మొత్తం మొత్తం చొప్పున రుణం ఖాతాలో జమ చేసుకుంటూ వెళ్లి ఏడాదిలోగా మొత్తం తీర్చేసే వెసులుబాటు కూడా ఉంటుంది. ఒకవేళ ఏడాది లోపు మీరు గోల్డ్‌ లోన్‌ తీర్చలేకపోతే, దానిని రెన్యువల్‌ చేయించాల్సి ఉంటుంది. అంటే, ఆ ఏడాది మీరు రుణం తీర్చి, మళ్లీ కొత్త రుణం తీసుకున్నట్లుగా బ్యాంకులు అదే రుణాన్ని రెన్యువల్‌ చేస్తాయి. మొదటి ఏడాదికి వడ్డీతో పాటు మళ్లీ అన్ని రకాల ఛార్జీలను వసూలు చేస్తాయి. 

గోల్డ్‌ లోన్‌ తీర్చడానికి ఇంకో మార్గం కూడా ఉంది. తొలి ఏడాదిలో మీరు తీసుకున్న మొత్తంలో కొంతమేర చెల్లించి, మిగిలిన మొత్తాన్ని కొత్త లోన్ తీసుకున్నట్లుగా రెండో ఏడాది కోసం రెన్యువల్‌ చేయించుకోవచ్చు. ఉదాహరణకు మీరు రూ. లక్ష రుణం తీసుకుంటే, ఏడాది ముగిసేనాటికి మీరు 50 వేలు చెల్లించాలని భావిస్తే అంత మొత్తమే చెల్లించవచ్చు. మిగిలిన రూ. 50 వేలను కొత్త లోన్‌ రూపంలో బ్యాంక్‌లు రెన్యువల్‌ చేస్తాయి. అంటే, రెండో ఏడాదిలో, ఆ రూ. 50 వేలు, దాని మీద వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. 

అదనపు రేట్లపై ఆరా తీయండి
మీరు గోల్డ్ లోన్ తీసుకోబోతున్నట్లయితే, ఆ బ్యాంక్ ఇస్తున్న వడ్డీ ఆఫర్ ఏమిటో ముందుగా తెలుసుకోండి. దీంతో పాటు, రుణంపై వసూలు చేసే ప్రాసెసింగ్ ఫీజు, పేపర్‌ వర్క్, ఆలస్య చెల్లింపుపై జరిమానా వంటి ఇతర ఛార్జీలు గురించి కూడా తెలుసుకోవడం ముఖ్యం.

టాప్ హెడ్ లైన్స్

Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
Loan Trap: చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. అప్పుల ఊబితో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. Loan Trapతో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget