By: ABP Desam | Updated at : 08 Jun 2023 03:52 PM (IST)
మళ్లీ పాత పొజిషన్‌లోకి వచ్చిన అదానీ
Gautam Adani Net Worth: అదానీ గ్రూప్ ఓనర్ గౌతమ్ అదానీ మళ్లీ హైజంప్ చేసి, ఆసియాలోనే రెండో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. గౌతమ్ అదానీ ఒక్కరోజులోనే రికార్డు సాధించారు. గత 24 గంటల్లో ఆయన సంపద 52.5 మిలియన్ డాలర్లు పెరిగింది.
ప్రపంచ సంపన్నుల జాబితాలో గౌతమ్ అదానీ ప్రస్తుతం 18వ ర్యాంక్‌లో ఉన్నారు. తాజా జంప్ తర్వాత, చైనా బిలియనీర్ జాంగ్ షాన్‌షాన్ (Zhong Shanshan) కంటే ఒక మెట్టు పైకి చేరారు. ధనవంతుల జాబితాలో, చైనా కంట్రీ బిలియనీర్ ఇప్పుడు 19వ స్థానంలో ఉన్నారు, ఆయన మొత్తం ఆస్తుల విలువ 61.9 బిలియన్ డాలర్లు. ఝాంగ్ షాన్‌షాన్ చాలా కాలం పాటు ఆసియాలో రెండో అత్యంత సంపన్న వ్యక్తిగా కొనసాగారు. గౌతమ్ అదానీ ఫామ్‌లోకి వచ్చాక ఆయన వెనక్కు తగ్గారు. అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ బ్లాస్లింగ్ రిపోర్ట్ ధాటికి అదానీ సంపద మేడ కుప్పకూలడంతో, ఝాంగ్ షన్షాన్ మళ్లీ సెకండ్ ప్లేస్‌లోకి అడుగు పెట్టారు. ఇప్పుడు, అదానీ గ్రూప్ కంపెనీలు పుంజుకుని, అదానీ ఆస్తులు పెరగడంతో మళ్లీ చైనీస్ బిలియనీర్ ఎదురుదెబ్బ తిన్నారు, వెనక్కు వెళ్లిపోయారు.
గౌతమ్ అదానీ ఆస్తుల విలువ
భారతదేశం, ఆసియాలో రెండో అత్యంత సంపన్న వ్యక్తి అయిన గౌతమ్ అదానీ తన కంపెనీల షేర్లు భారీగా పెరగడంతో బుధవారం (07 జూన్ 2023) ఒక్క రోజే 52.5 మిలియన్ డాలర్లు సంపాదించారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ (Bloomberg Billionaires Index) ప్రకారం, ఇప్పుడు గౌతమ్ అదానీ ఆస్తుల విలువ (Gautam Adani Net Worth) 62.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అయితే, ఈ ఏడాది గౌతమ్ అదానీ ఆస్తిలో 58.2 బిలియన్ డాలర్లు కరిగిపోయింది.
ఆసియాలోనే అత్యంత సంపన్నుడు అంబానీ
రిలయన్స్ గ్రూప్ అధిపతి ముకేష్ అంబానీ, ఇప్పటికీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడి సింహాసనంపై ఉన్నారు. చాలా కాలంగా ఆయన అదే పొజిషన్‌లో కొనసాగుతున్నారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం, ముకేష్ అంబానీ నికర విలువ (Mukesh Ambani Net Worth) 85.9 బిలియన్ డాలర్లు. ముఖేష్ అంబానీకి బుధవారం నాడు 71.1 మిలియన్ డాలర్ల లాభం వచ్చింది. ఈ ఏడాది స్టాక్ మార్కెట్ ఒడిదొడుకుల వల్ల ముఖేష్ అంబానీకి 1.23 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది.
ఈ ఏడాది జనవరి 24న, గౌతమ్ అదానీ కంపెనీపై అమెరికన్ షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఒక నివేదిక విడుదల చేసింది. అందులో అదానీ గ్రూప్‌పై చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది. అప్పటి నుంచి గౌతమ్ అదానీ కంపెనీ షేర్లు భారీగా పతనమై, మార్కెట్ విలువ క్షీణించింది. దీంతో పాటు, గౌతమ్ అదానీ నికర విలువ కూడా కుప్పకూలింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ రావడానికి ముందు ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్న అదానీ, అక్కడి నుంచి ఒక్క నెల రోజుల్లోనే 36 వ స్థానానికి పడిపోయారు. ఆ తర్వాత అదానీ గ్రూప్ చాలా వరకు కోలుకుంది.
మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ: రెపో రేట్ మారలేదు, ఇప్పుడు బ్యాంక్ EMIల పరిస్థితేంటి?
Aston Martin DB12: ఆస్టన్ మార్టిన్ డీబీ12 లాంచ్ చేసిన కంపెనీ - మనదేశంలో ఎంత ధర?
Rs 2,000 Exchange Deadline: రూ. 2000 నోట్లు మార్చుకోలేదా, అయితే మీకు RBI శుభవార్త - చివరి తేదీ ఇదే
Bank Locker Rule: లాకర్లో దాచిన ఆస్తి మొత్తానికి బ్యాంక్ బాధ్యత ఉండదు, కొత్త రూల్స్ గురించి తెలుసుకోండి
Latest Gold-Silver Price 30 September 2023: పసిడి పతనం కంటిన్యూస్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Rs 2000 Notes: రూ.2 వేల నోట్లను మార్చుకోవడానికి ఈ రోజే లాస్ట్ డేట్, ఈ గడువు పొడిగిస్తారా?
TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప
Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!
HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే
Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ
/body>