Gautam Adani: రోజుకు వెయ్యి కోట్లు ఆర్జిస్తున్న అదానీ.. ఇండియా టాప్-10 కుబేరులు వీళ్లే
సంపద సృష్టిలో గౌతమ్ అదానీ కొత్త పాఠాలు నేర్పిస్తున్నారు. రోజుకు వెయ్యి కోట్లు ఆర్జిస్తూ ఆసియా రెండో అపర కుబేరుడిగా అవతరించారు. ఇక భారత్ టాప్-10 ముకేశ్, అదానీ, శివ నాడార్, ఎస్పీ హిందూజా నిలిచారు.
భారతదేశ అపర కుబేరుల్లో గౌతమ్ అదానీ తన స్థానాన్ని మరింత మెరుగు పర్చుకున్నారు. రోజుకు రూ.1002 కోట్లు ఆర్జిస్తూ ఆసియాలోనే రెండో సంపన్నుడిగా ఎదిగారు. ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2021ను విడుదలైంది. తొలిసారిగా అదానీ సోదరులిద్దరూ టాప్-10లో నిలవడం గమనార్హం. పెట్రో కెమికల్స్ నుంచి సాఫ్ట్‌వేర్ రంగాలకు చెందిన కోటీశ్వరులు ఈ జాబితాలో చోటు సంపాదించారు. ఇక భారత్‌లో టాప్-10 సంపన్నులెవరు? వారి సంపద ఎంత? రోజుకు ఎంత సంపాదిస్తున్నారో ఓ లుక్కేద్దాం!
Also Read: 'మీషో'లో పెట్టుబడుల వరద! 5 నెల్లోనే 500 కోట్ల డాలర్ల విలువకు చేరిక
* ఎప్పటిలాగే రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. ఆయన సంపద రూ.7,18,000 కోట్లు. గతేడాదితో పోలిస్తే ఆయన సంపద తొమ్మిది శాతం పెరిగింది. ముంబయిలో ఉండే ఆయన రోజుకు కనీసం రూ.163 కోట్లు ఆర్జిస్తారు.
* అదానీ గ్రూప్ యజమాని గౌతమ్ అదానీ, ఆయన కుటుంబ సభ్యులు జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఆయన సంపద రూ.5,05,900 కోట్లు. గతేడాదితో పోలిస్తే ఆయన సంపద ఏకంగా 261 శాతం పెరిగింది. అహ్మదాబాద్ కేంద్రంగా ఆయన వ్యాపార సామ్రాజ్యం నిర్మించారు. రోజుకు రూ.1000 కోట్లు ఆర్జిస్తున్నారు.
Also Read: అక్టోబర్ 1న బెస్ట్‌డీల్స్.. చాలా ఉత్పత్తులపై డిస్కౌంట్లు
* హెచ్‌సీఎల్ కంపెనీ యజమాని శివ నాడార్, కుటుంబం రూ.2,36,600 కోట్లతో మూడో స్థానంలో నిలిచారు. గతేడాదితో పోలిస్తే ఆయన సంపద 67 శాతం పెరిగింది. ఆయన రోజుకు రూ.260 కోట్లు సంపాదిస్తున్నారు.
* హిందూజా గ్రూప్‌కు చెందిన ఎస్పీ హిందూజా, కుటుంబ సభ్యులు నాలుగో స్థానంలో నిలిచారు. వారి సంపద రూ.2,20,000 కోట్లు. రోజుకు వీరు రూ.209 కోట్లు సంపాదిస్తున్నారు.
* ఆర్సెలార్ మిత్తల్ సంస్థ యజమాని లక్ష్మీనివాస్ మిత్తల్ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నారు. ఆయన సంపద రూ.1,74,400 కోట్లు. ఆయన రోజుకు రూ.312 కోట్లు ఆర్జిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే 187 శాతం సంపద వృద్ధి చెందింది.
Also Read: మొబైల్స్‌పై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ ఫోన్‌పై ఏకంగా రూ.38 వేలు తగ్గింపు!
* సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యజమాని సైరస్ పూనావాలా రూ.1,63,700 కోట్ల సంపదతో ఆరో స్థానంలో ఉన్నారు. ఆయన రోజుకు రూ.190 కోట్లు ఆర్జిస్తుండగా సంపద 74 శాతం వృద్ధి చెందింది.
* అవెన్యూ సూపర్ మార్కెట్స్ యజమాని రాధాకిషన్ దమాని రూ.153,300 కోట్లతో ఏడో స్థానంలో ఉన్నారు. ఆయన సంపద 77 శాతం వృద్ధి చెందగా రోజుకు రూ.184 కోట్లు ఆర్జిస్తున్నారు.
* గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ శాంతిలాల్ అదానీ రూ.1,31,600 కోట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచారు. 212 శాతం ఆయన సంపద వృద్ధి చెందింది. రోజుకు ఆయన రూ.245 కోట్లు సంపాదిస్తున్నారు.
* ఆదిత్యా బిర్లా గ్రూప్ యజమాని కుమార మంగళం బిర్లా రోజుకు రూ.242 కోట్లు ఆర్జిస్తున్నారు. ఆయన సంపద 230 శాతం వృద్ధి చెందగా రూ.1,22,200 కోట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచారు.
* స్కాలర్ గ్రూప్ అధినేత జే చౌదరి రూ.1,21,600 కోట్ల సంపదతో పదో స్థానంలో ఉన్నారు. ఆయన సంపద 85 శాతం వృద్ధి చెందింది. రోజుకు రూ.153 కోట్లు ఆర్జిస్తున్నారు.