News
News
వీడియోలు ఆటలు
X

FPIs: భారీ పతనం ఆశిస్తున్న ఎఫ్‌పీఐలు, ఐదేళ్ల గరిష్టానికి షార్ట్‌ పొజిషన్లు

ప్రతి వంద ట్రేడింగ్‌ రోజుల్లో కేవలం 6 రోజుల్లో మాత్రమే కనిపించిన ఈ నంబర్‌ను మళ్లీ మనం ఇప్పుడు చూస్తున్నాం.

FOLLOW US: 
Share:

FPI Short Positions: ఇండియన్‌ ఈక్విటీలపై విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (FPIలు) బేరిష్‌ ట్రెండ్‌ కొనసాగుతోంది. విదేశీయుల నికర బేరిష్ బెట్టింగ్స్‌ ఐదేళ్ల గరిష్ట స్థాయికి చేరాయి. అమెరికాలో ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయడానికి అక్కడి సెంట్రల్ బ్యాంక్ (US FED) వడ్డీ రేట్ల పెంపును కొనసాగిస్తుండడంతో, మన దేశం నుంచి పెట్టుబడులు వెనక్కు వెళ్లిపోతున్నాయి.

రెండింతలు పెరిగిన షార్ట్‌ పొజిషన్లు
బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం... NSE ఇండెక్స్ ఫ్యూచర్స్‌లో ఎఫ్‌పీఐ షార్ట్ కాంట్రాక్ట్‌ల ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ ('open interest' of 'short contracts' of FPIs) 2,16,000 కు పెరిగింది. గత ఐదేళ్లలో FPI కాంట్రాక్టుల సగటు 1,00,000 గా ఉంటే, అది ఇప్పుడు రెండింతలు పెరిగింది. విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్‌ను ఎంత బేరిష్‌గా చూస్తున్నారో దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. 

ఈ ఐదు సంవత్సరాలలో, 6% ట్రేడింగ్ రోజులలో మాత్రమే షార్ట్‌ పొజిషన్ల సంఖ్య 2,00,000 దాటింది. అంటే, ప్రతి వంద ట్రేడింగ్‌ రోజుల్లో కేవలం 6 రోజుల్లో మాత్రమే కనిపించిన ఈ నంబర్‌ను మళ్లీ మనం ఇప్పుడు చూస్తున్నాం.

మూడో వంతుకు పడిపోయిన లాంగ్‌ పొజిషన్లు
షార్ట్ కాంట్రాక్టులకు వ్యతిరేకంగా, లాంగ్ పొజిషన్లపై బెట్టింగుల స్థాయి పడిపోతోంది. FPIల లాంగ్ కాంట్రాక్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్‌ మార్చి 24, 2023 నాటికి 33,280 కి పడిపోయింది. గత ఐదేళ్ల సగటు అయిన 93,770 లో దాదాపు మూడో వంతుకు లాంగ్‌ పొజిషన్లు దిగజారాయి.

అతి తక్కువ లాంగ్ పొజిషన్లు - భారీగా పెరిగిన షార్ట్‌ కాంట్రాక్టుల ఫలితంగా.. ఇండెక్స్ ఫ్యూచర్స్‌లో FPIల "లాంగ్-షార్ట్ రేషియో" కుచించుకుపోయింది. గత ఐదు సంవత్సరాల FPIల లాంగ్-షార్ట్ రేషియో 1.16 గా ఉంటే, ఇప్పుడు అతి దారుణంగా 0.17కి పడిపోయింది. విదేశీ పెట్టుబడిదార్లు మన మార్కెట్‌పై సమీప కాలంలో బేరిష్‌గా ఉన్నారని, ప్రస్తుత స్థాయి నుంచి మార్కెట్‌ పతనాన్ని ఆశిస్తున్నారని షార్ట్ పొజిషన్లలో పెరుగుతున్న ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ వెల్లడిస్తోంది. 

ఇండెక్స్ ఫ్యూచర్లను తక్కువ ధర వద్ద తిరిగి కొనుగోలు చేయాలనే ఉద్దేశ్యంతో అధిక స్థాయి వద్ద విక్రయించడం ఇక్కడ కనిపిస్తున్న విదేశీ వ్యూహం. అమ్మకం ధర - కొనుగోలు ధర మధ్య వ్యత్యాసం వారి లాభం.

డెరివేటివ్‌ ఇన్వెస్టర్లు రిస్కీ అసెట్స్‌ మీద, ముఖ్యంగా భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల మీద ఇంట్రెస్ట్‌ తగ్గించుకోవడానికి ప్రధాన కారణం US బాండ్‌ ఈల్డ్స్‌. అగ్రరాజ్య బాండ్‌ ఈల్డ్స్‌ 2008 తర్వాత అత్యధిక స్థాయి వైపు పరుగులు తీస్తున్నాయి. ఈక్విటీలు, డెరివేటివ్స్‌ వంటి ప్రమాదకర పందేలు కాయడానికి బదులు, ఎక్కువ వడ్డీ ఇస్తున్న అమెరికన్‌ బాండ్లలో డబ్బు కుమ్మరించడానికి పెట్టుబడి పెట్టడానికి ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. అందువల్లే మన మార్కెట్ల నుంచి డబ్బు వెనక్కు తీసుకోవడానికి విదేశీ పెట్టుబడిదార్లు ఉత్సాహం చూపుతున్నారు.

క్యాష్‌ మార్కెట్‌ విషయానికి వస్తే... గత రెండు నెలల్లో రూ. 30,858 కోట్ల విలువైన ఈక్విటీలను ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు విక్రయించారు. అయితే, ఈ నెలలో ఇప్పటి వరకు రూ. 7,233 కోట్ల విలువైన భారతీయ ఈక్విటీలను FPIలు కొనుగోలు చేశారు. గత ఆరు నెలల్లో మూడు నెలలు ఓవర్సీస్‌ ఇన్వెస్టర్లు నికర కొనుగోలుదార్లుగా ఉన్నారు.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 27 Mar 2023 11:09 AM (IST) Tags: FPIS short positions long positions f and o Futures and Options

సంబంధిత కథనాలు

Gold-Silver Price Today 10 June 2023: పసిడిపై ఫెడ్‌ ఎఫెక్ట్‌ - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Price Today 10 June 2023: పసిడిపై ఫెడ్‌ ఎఫెక్ట్‌ - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లో నెగెటివ్‌ సెంటిమెంట్‌ - బిట్‌కాయిన్‌ 5వేలు జంప్‌!

Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లో నెగెటివ్‌ సెంటిమెంట్‌ - బిట్‌కాయిన్‌ 5వేలు జంప్‌!

Shloka Necklace: అంబానీ కోడలి డైమండ్‌ నెక్లెస్‌కు రిపేర్‌, దాని రేటు తెలిస్తే షాకవుతారు

Shloka Necklace: అంబానీ కోడలి డైమండ్‌ నెక్లెస్‌కు రిపేర్‌, దాని రేటు తెలిస్తే షాకవుతారు

Stock Market News: 18,600 కిందకు నిఫ్టీ - సెన్సెక్స్‌ 223 పాయింట్లు ఫాల్‌, పెరిగిన రూపాయి

Stock Market News: 18,600 కిందకు నిఫ్టీ - సెన్సెక్స్‌ 223 పాయింట్లు ఫాల్‌, పెరిగిన రూపాయి

Paytm Shares: పేటీఎం 'కరో.. కరో.. కరో జల్సా'! వారంలో 22% గెయిన్‌ - 10 నెలల గరిష్ఠానికి షేర్లు!

Paytm Shares: పేటీఎం 'కరో.. కరో.. కరో జల్సా'! వారంలో 22% గెయిన్‌ - 10 నెలల గరిష్ఠానికి షేర్లు!

టాప్ స్టోరీస్

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !

Apsara Murder Case Update :  అప్సర హత్య  వెనుక ఇన్ని కోణాలున్నాయా ? -  మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన  సంచలన విషయాలు !

Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?

Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?