News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Forex: పుంజుకున్న విదేశీ వాణిజ్యం, రెండు వారాల తర్వాత ఫారెక్స్‌ కళ

గత వారం రోజుల్లో విదేశీ మారక నిల్వలు 5.92 బిలియన్ డాలర్ల మేర వృద్ధి చెందాయి.

FOLLOW US: 
Share:

India's Forex Reserves: వరుసగా రెండు వారాల క్షీణత తర్వాత, భారతదేశ వాణిజ్యం ఊపందుకుంది. భారతదేశ విదేశీ మారక నిల్వలు మరోసారి పెరిగాయి. బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2023 జూన్ 2తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు 5.92 బిలియన్ డాలర్లు పెరిగాయి. మే నెల 26వ తేదీతో ముగిసిన అంతకుముందు వారంలో 589.13 బిలియన్ డాలర్లుగా ఉన్న విదేశీ మారకద్రవ్య నిల్వలు, ఆ తర్వాత 595.06 బిలియన్ డాలర్లకు చేరాయి.

పెరుగుతున్న భారతదేశ విదేశీ వాణిజ్యం
ఆర్‌బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, గత వారం రోజుల్లో విదేశీ మారక నిల్వలు 5.92 బిలియన్ డాలర్ల మేర వృద్ధి చెందాయి. జూన్ 2తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు పెరిగినప్పటికీ, ఇప్పటికీ వాటి చారిత్రక గరిష్ఠ స్థాయి కంటే దాదాపు 50 బిలియన్ డాలర్లు తక్కువలో ఉన్నాయి. అయితే, ఈ అంతరం క్రమంగా పూడుతూ వస్తోంది. అంటే, భారత విదేశీ వాణిజ్యం ‍‌(India's Foreign Trade) పెరుగుతోంది.

పెరిగిన బంగారం నిల్వల విలువ
సమీక్ష కాల వారంలో, విదేశీ కరెన్సీ ఆస్తులు (Foreign Currency Assets) 5.27 బిలియన్‌ డాలర్ల వృద్ధితో 526.20 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. విదేశీ కరెన్సీ ఆస్తులు అంటే.. విదేశీ మారక నిల్వలలో ఉన్న యూరో, పౌండ్, యెన్ వంటి అమెరికాయేతర కరెన్సీ యూనిట్ల విలువలో పెరుగుదల లేదా తరుగుదల ప్రభావాన్ని కలిగి ఉంటాయి. డాలర్ రూపంలో ఈ విలువను చెబుతారు.

భారతదేశ బంగారం నిల్వలు (Gold reserves) కూడా పెరిగాయి. బంగారం నిల్వల విలువ 6.55 బిలియన్ డాలర్లు పెరిగి మొత్తం విలువ 41.70 బిలియన్ డాలర్లకు చేరుకుంది. IMF వద్ద ఇండియా గోల్డ్‌ రిజర్వ్స్‌ 10 మిలియన్‌ డాలర్ల పెరుగుదలతో 5.12 బిలియన్లకు చేరాయి. 

ఆల్ టైమ్ హై లెవెల్ ఇది
భారతదేశ విదేశీ మారక నిల్వలు 2021 అక్టోబర్‌ నెలలో అత్యధిక స్థాయికి, 645 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది, ఆల్‌ టైమ్‌ హై రికార్డ్‌. అప్పటి నుంచి RBI వద్ద విదేశీ మారకద్రవ్య నిల్వలు తగ్గుముఖం పట్టాయి. 2022 సంవత్సరం ప్రారంభంలోనూ, మన దేశ విదేశీ మారక నిల్వలు 633 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వివిధ ప్రతికూల కారణాల వల్ల విదేశీ పెట్టుబడిదార్లు భారత్‌లోని తమ పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకుని డాలర్ల రూపంలో ఆ డబ్బును వెనక్కు తీసుకెళ్లారు. ఈ కారణంగా, విదేశీ మారక నిల్వలు తగ్గుతూ వచ్చాయి, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం నుంచి ఉత్పన్నమయిన ప్రపంచ ఉద్రిక్తతలు కూడా మన దేశ ఫారెక్స్‌ రిజర్వ్స్‌పై ప్రభావం చూపాయి. క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. ముడి చమురు కొనుగోళ్ల కోసం డాలర్ల రూపంలో ఎక్కువగా వ్యయం చేయాల్సి వచ్చింది. 2022లో US ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు ప్రారంభించడంతో విదేశీ పెట్టుబడిదార్లు తమ పెట్టుబడులను వెనక్కు తీసుకోవడం ప్రారంభించారు. దీంతో, రూపాయి విలువలో బలహీనత కనిపించింది. ఆ సమయంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 10 శాతం పడిపోయి రూ.83 కనిష్ట స్థాయికి చేరుకుంది. రూపాయికి మద్దతు ఇవ్వడానికి, ఆర్‌బీఐ డాలర్లను విక్రయించాల్సి వచ్చింది. ఈ కారణంగానూ విదేశీ మారక నిల్వలు క్షీణించాయి.

ఏ దేశంలోనైనా, సౌకర్యవంతమైన స్థాయిలో ఉండే విదేశీ మారక నిల్వలు ఆ దేశ ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతాయి. విదేశీ మారక నిల్వల్లో క్షీణతను ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ఒత్తిడిగా చూడాలి. నిల్వలు పెరుగుతుంటే, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు బలపడుతున్నాయని భావించాలి.

మరో ఆసక్తికర కథనం: అంబానీ కోడలి డైమండ్‌ నెక్లెస్‌కు రిపేర్‌, దాని రేటు తెలిస్తే షాకవుతారు 

Published at : 10 Jun 2023 07:20 AM (IST) Tags: India RBI Economy Forex reserves Forex dollars

ఇవి కూడా చూడండి

Aston Martin DB12: ఆస్టన్ మార్టిన్ డీబీ12 లాంచ్ చేసిన కంపెనీ - మనదేశంలో ఎంత ధర?

Aston Martin DB12: ఆస్టన్ మార్టిన్ డీబీ12 లాంచ్ చేసిన కంపెనీ - మనదేశంలో ఎంత ధర?

Rs 2,000 Exchange Deadline: రూ. 2000 నోట్లు మార్చుకోలేదా, అయితే మీకు RBI శుభవార్త - చివరి తేదీ ఇదే

Rs 2,000 Exchange Deadline: రూ. 2000 నోట్లు మార్చుకోలేదా, అయితే మీకు RBI శుభవార్త - చివరి తేదీ ఇదే

Bank Locker Rule: లాకర్‌లో దాచిన ఆస్తి మొత్తానికి బ్యాంక్‌ బాధ్యత ఉండదు, కొత్త రూల్స్‌ గురించి తెలుసుకోండి

Bank Locker Rule: లాకర్‌లో దాచిన ఆస్తి మొత్తానికి బ్యాంక్‌ బాధ్యత ఉండదు, కొత్త రూల్స్‌ గురించి తెలుసుకోండి

Latest Gold-Silver Price 30 September 2023: పసిడి పతనం కంటిన్యూస్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Latest Gold-Silver Price 30 September 2023: పసిడి పతనం కంటిన్యూస్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Rs 2000 Notes: రూ.2 వేల నోట్లను మార్చుకోవడానికి ఈ రోజే లాస్ట్‌ డేట్‌, ఈ గడువు పొడిగిస్తారా?

Rs 2000 Notes: రూ.2 వేల నోట్లను మార్చుకోవడానికి ఈ రోజే లాస్ట్‌ డేట్‌, ఈ గడువు పొడిగిస్తారా?

టాప్ స్టోరీస్

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప

Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!

Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!

HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ