అన్వేషించండి

T20 World Cup: ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా తెగ తిన్నారు, తాగారు - భారీగా లాభపడ్డ బార్లు, రెస్టారెంట్లు

T20 World Cup Final Mach Effect: T20 వరల్డ్‌ కప్‌లో భారత్‌ చారిత్రాత్మక విజయం సాధించడంతో ఆహారం & పానీయాల (F&B) కంపెనీలతో పాటు క్విక్‌ కామర్స్‌ సేల్స్‌ అమాంతం పెరిగాయి. 40-50% ఎక్కువ అమ్మకాలు జరిగాయి.

Business Sales On T20 World Cup Final Mach Day: జూన్ 29న, T20 వరల్డ్ కప్‌లో, దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ చారిత్రాత్మక విజయం సాధించింది. బార్బడోస్‌లోని కెన్సింగ్‌టన్‌ ఓవల్ వేదికగా శనివారం జరిగిన టైటిల్‌ పోరులో, భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. 2007లో, తొలిసారి T20 ప్రపంచకప్‌ నిర్వహించినప్పుడు టైటిల్‌ సాధించిన టీమ్‌ ఇండియా, మళ్లీ ఆ ట్రోఫీని ముద్దాడడానికి 17 సుదీర్ఘ సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ ఉద్వేగభరిత విజయం యావత్‌ జాతినే కాదు,, ఆహారం & పానీయాల (F&B) కంపెనీలను, క్విక్‌ కామర్స్‌ కంపెనీలను (Quick Commerce Companies) సైతం ఒక ఊపు ఊపింది.

తింటూ, తాగుతూ మ్యాచ్‌ను ఆస్వాదించిన అభిమానులు
ఇష్టమైన ఆహార పదార్థాలు తింటూ ఫైనల్ మ్యాచ్‌ను ఆస్వాదించేందుకు, భారత్‌ టీ20 కప్‌ గెలిచిన తర్వాత సంబరాలు చేసుకునేందుకు ప్రజలు ఆహారం & పానీయాల కోసం అమితంగా ఆర్డర్లు పెట్టారు. దీంతో రెస్టారెంట్లతో పాటు శీఘ్ర వాణిజ్య సంస్థల విక్రయాలు, ఆదాయాలు 40% నుంచి 50% వరకు పెరిగాయి.

ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్‌ ప్రకారం, ముంబైలోని విరాట్ కోహ్లీకి చెందిన వన్8 కమ్యూన్ రెస్టారెంట్ పూర్తిగా నిండిపోయింది, పూర్తి సామర్థ్యంతో అక్కడ బిజినెస్‌ జరిగింది. ది బీర్ కేఫ్‌ రెస్టారెంట్‌ ప్రారంభమై 12 సంవత్సరాలు గడిచాయి, గతంలో ఎన్నడూ లేనంత "సింగిల్ డే రెవెన్యూ"ను ఆ రెస్టారెంట్‌ చైన్‌ సాధించింది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. దేశంలోని అన్ని పెద్ద నగరాల్లో బార్‌లు కేఫ్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లు నిండిపోయాయి, బిజినెస్‌ మహా జోరుగా సాగింది. కొందరు వ్యాపారులు చెప్పిన ప్రకారం... వాళ్ల వ్యాపార ప్రాంగణాల్లో అంత పెద్ద జన సమూహాన్ని చూడడం అదే తొలిసారి.

రాత్రి 8-11 గంటల మధ్య ఆర్డర్ల వెల్లువ
ఫిన్‌టెక్ స్టార్టప్ 'సింపుల్' (Simpl) రిపోర్ట్‌ ప్రకారం, క్రికెట్ వరల్డ్ కప్ T20 ఫైనల్ మ్యాచ్‌ సమయంలో ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా వినియోగదార్లు చేసిన ఖర్చు 40 శాతం పెరిగింది. యూజర్లు రెండో ఆలోచన లేకుండా వాలెట్లను తెగ వాడేశారు. గత వన్‌ డే ప్రపంచ కప్ ఫైనల్‌తో పోలిస్తే, T20 ప్రపంచ కప్ ఫైనల్‌లో క్విక్ కామర్స్‌లో కొనుగోళ్లు 40 శాతం పెరిగాయి. మ్యాచ్ జరుగుతున్నప్పుడు, శనివారం రాత్రి 8 గంటల నుంచి 11 గంటల మధ్య, క్విక్ కామర్స్ ద్వారా ప్రజలు విరామం లేకుండా ఆర్డర్లు పెట్టారు. ఆ 3 గంటల పాటు ఆర్డర్లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.

శనివారం, Simpl ద్వారా ఒక వ్యక్తి గరిష్టంగా రూ. 16,410 ఖర్చు చేశాడు. మరో వినియోగదారుడు ఏకంగా 59 ఆర్డర్లు చేశాడు. జెప్టో (Zepto), బ్లింకిట్‌ (Blinkit), స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ (Swiggy Instamart), పోర్టర్‌ ‍‌(Porter) సహా వివిధ ప్లాట్‌ఫామ్స్‌లో Simpl ద్వారా రూ. 100 లోపు విలువైన ఆర్డర్‌లు తెరిపిలేకుండా వస్తూనే ఉన్నాయి. గత ఏడాది నవంబర్‌లో జరిగిన ఫైనల్‌తో పోలిస్తే ఈసారి ఆర్డర్లు 35% పెరిగాయి.

మరో ఆసక్తికర కథనం: వంట గ్యాస్‌ సిలిండర్‌ మరింత చౌక - మీ ప్రాంతంలో ఎంత తగ్గిందంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Government Banned OTT Apps: 18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Embed widget