Gas Cylinder Price: వంట గ్యాస్ సిలిండర్ మరింత చౌక - మీ ప్రాంతంలో ఎంత తగ్గిందంటే?
LPG Cylinder Price Today: దేశ ప్రజలకు శుభవార్తతో జులై నెల ప్రారంభమైంది. గ్యాస్ సిలిండర్ రేటు తగ్గింది. కొత్త ధరలు మీ ప్రాంతంలో ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి.
![Gas Cylinder Price: వంట గ్యాస్ సిలిండర్ మరింత చౌక - మీ ప్రాంతంలో ఎంత తగ్గిందంటే? Lpg gas cylinder price reduced by 30 rupees new rates are applicable from 01 july 2024 Gas Cylinder Price: వంట గ్యాస్ సిలిండర్ మరింత చౌక - మీ ప్రాంతంలో ఎంత తగ్గిందంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/01/772523eab8ea136b1efc21a0b5abf5b31719806753068545_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
LPG Cylinder Price Reduced From 01 July 2024: ఎల్‌పీజీ సిలిండర్ ధరలు ఈ రోజు నుంచి మరింత చౌకగా మారాయి. ఒక్కో సిలిండర్ రేటు రూ. 30 నుంచి రూ. 31 వరకు తగ్గింది. కొత్త ధర ఈ రోజు (జులై 01, 2024) నుంచి అమల్లోకి వచ్చింది. అయితే... LPG రేట్లలో ఈ తగ్గింపు కేవలం 19 కిలోల వాణిజ్య సిలిండర్లకు మాత్రమే వర్తిస్తుంది, గృహ వినియోగదార్లకు కాదు.
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తీసుకున్న నిర్ణయం ప్రకారం... ఈ రోజు (01 జులై 2024) నుంచి, దేశంలోని వివిధ నగరాల్లో ఎల్‌పీజీ సిలిండర్ల ధర 31 రూపాయలకు వరకు తగ్గింది. 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్లను వినియోగించేవాళ్లకు ఈ ప్రయోజనం దక్కుతుంది. రోడ్ సైడ్ టిఫిన్ బండ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, దాబాలు వంటివి ప్రయోజనం పొందుతాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో కమర్షియల్ LPG సిలిండర్ ధర ఎంత తగ్గిందంటే...
దిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర రూ. 30 తగ్గి రూ. 1646కి (Commercial LPG Cylinder Price Today) చేరుకుంది. గత నెలలో (జూన్) ఈ రేటు రూ. 1676గా ఉంది.
కోల్‌కతాలో కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ప్రైస్ రూ. 31 తగ్గి రూ. 1756గా మారింది. జూన్‌లో సిలిండర్ ధర రూ. 1787గా ఉంది.
ముంబై బ్లూ సిలిండర్ రేటు రూ. 31 తగ్గింది. అక్కడి ప్రజలు ఇప్పుడు రూ. 1598 చెల్లించాల్సి ఉంటుంది. గత నెలలో సిలిండర్ ధర రూ. 1629గా ఉంది.
చెన్నైలో వాణిజ్య సిలిండర్ ధర రూ. 30 తగ్గి, రూ. 1809.50గా మారింది. జూన్‌లో సిలిండర్ ధర రూ. 1840.50గా ఉంది.
బిహార్ రాజధాని పాట్నాలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1,884.50 కు తగ్గింది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ. 1,635 గా మారింది.
కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను గత 3 నెలల్లోనూ తగ్గించారు. జూన్ 1న బ్లూ సిలిండర్ రేటు రూ. 70 తగ్గింది. దీనికిముందు, మే 01న రూ. 19 తగ్గింది. ఏప్రిల్ 01న రూ. 35 తగ్గింది. ఏప్రిల్‌కు ముందు వరుసగా మూడు నెలలపాటు వాణిజ్య సిలిండర్ల ధరలు పెరిగాయి.
గృహావసర LPG సిలిండర్ ధరలో మార్పు లేదు
ఇళ్లలో వంట కోసం ఉపయోగించే 14.2 కిలోల LPG సిలిండర్ల ధరల్లో (Domestic LPG Cylinder Price) ఎలాంటి మార్పు లేదు. నరేంద్ర మోదీ ప్రభుత్వం, ఈ ఏడాది మహిళా దినోత్సవం (08 మార్చి 2024) సందర్భంగా దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ ధరలను (Domestic LPG Cylinder Price) రూ. 100 తగ్గించింది. డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ రేటు తగ్గడం అదే చివరిసారి. అప్పటి నుంచి, 4 నెలలుగా రెడ్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
తెలుగు రాష్ట్రాల్లో వంట గ్యాస్ సిలిండర్ ధరలు
హైదరాబాద్‌లో 14.2 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ (14 KGs Gas Cylinder Price In Hyderabad) రూ. 855గా ఉంది. విజయవాడలో ఒక్కో సిలిండర్ కోసం (14 KGs Gas Cylinder Price In Vijayawada) రూ. 855 చెల్లించాలి. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో దాదాపుగా ఇదే ధర అమల్లో ఉంది.
డొమెస్టిక్ LPG సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 803, కోల్‌కతాలో రూ. 803, ముంబైలో రూ. 802.50, చెన్నైలో రూ. 818.50గా ఉంది.
దేశీయ, వాణిజ్య LPG సిలిండర్‌ల రేట్లను ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ iocl.com నుంచి తీసుకోవడం జరిగింది.
మరో ఆసక్తికర కథనం:
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)