Flying Cars : 2026 నాటికి ఎగిరే కార్లు సిద్ధం - వీటి ధరెంత? స్పెసిఫికేషన్స్ ఇవే..!
Flying Cars : ఫ్లయింగ్ కార్స్ ను 2026 వరకల్లా సిద్ధం చేస్తామని చైనీస్ కంపెనీ ఎక్స్ పెంగ్ మోటార్స్, అనుబంధ సంస్థ ఏరో హెచ్టీ తెలిపాయి.
Flying Cars : టెక్నాలజీ పెరుగుతన్నా కొద్దీ కొత్త కొత్త వస్తువులు అందుబాటులోకి వస్తున్నాయి. అందులో ఒకటి కార్లు. ఇప్పటి వరకు డీజిల్, పెట్రోల్‌తో నడిచే కార్లు చూశాం. రీసెంట్ డేస్ లో ఎలక్ట్రిక్ కార్లు కూడా రావడం అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు మరో ట్రెండ్ గురించి ప్రచారం సాగుతోంది. అదే ఎగిరే కార్లు. అమెరికా, చైనా వంటి పెద్ద దేశాల్లో ఇప్పటికే సేవలందిస్తోన్న ఈ ఎగిరే కార్లు ఇప్పడు భారత్ లోనూ కనిపించనున్నాయి. ట్రాఫిక్ సమస్య నుంచి తప్పించుకునేందుకు ఎగిరే కార్లను 2026లోగా అందుబాటులోకి తెస్తామని ల్యాండ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ను తయారు చేస్తోన్న చైనీస్ కంపెనీ ఎక్స్ పెంగ్ మోటార్స్, అనుబంధ సంస్థ ఏరో హెచ్టీ తెలిపాయి. నవంబర్ 2024లో చైనా ఇంటర్నేషనల్ ఏవియేషన్ అండ్ ఏరోస్పేస్ ఎగ్జిబిషన్ లో ప్రదర్శన తర్వాత ఈ ఎగిరే కార్ల గురించిన సమాచారం వెలుగులోకి వచ్చింది.
2026 నాటికి ఎగిరే కార్లు సిద్ధం
ఈ ఎగిరే కార్లను తయారీ ప్రక్రియను మరింత వేగవంతం చేసి 2026 నాటికి సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఎక్స్ పెంగ్ మోటార్స్ తెలిపింది. దీని ధర రూ.1.96కోట్లు (2లక్షల 20వేల యూరోలు)గా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ కారు సీఈఎస్ 2025 వంటి అంతర్జాతీయ ఈవెంట్లలో తన సామర్థ్యాలను ప్రదర్శించింది.
అడ్డంకులు, నిబంధనలు, ధర
ఇక ఈ ఎక్స్ పెంగ్ ఎయిరో హెచ్టీ ల్యాండ్ హెయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ను 2026లో మార్కెట్ లోకి తీసుకువచ్చినప్పటికీ.. దీన్ని విక్రయించడం చాలా కష్టం. కాబట్టి ప్రారంభంలో అనేక అడ్డంకులు ఎదుర్కోవాల్సి ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ఎగిరే కార్ల నిబంధనలు హెలికాప్టర్స్ కు వర్తించే నిబంధనలే ఉండవచ్చని తెలుస్తోంది. ఈ వాహనాన్ని ఆపరేట్ చేసేందుకు అవసరమైన లైసెన్స్ లు, పట్టణ ప్రాంతాల్లో ప్రయాణించే కార్ల వల్ల కలిగే అంతరాయాన్ని ఎదుర్కొనేందుకు అనేక అదనపు భద్రతా నిబంధనలు ఉండొచ్చని భావిస్తున్నారు.
ఫ్లయింగ్ కార్లకు సంబంధించిన మరిన్ని వివరాలు
ఫ్లయింగ్ మాడ్యూల్ ఫోల్డబుల్ రోటర్‌లను కలిగి ఉండే ఈ ఎగిరే కార్లు చక్రాలకు బదులుగా నాలుగు కాళ్లతో హెలికాఫ్టర్ మాదిరిగా అనిపిస్తుంది. దీనికి సంబంధించిన అనేక ఫొటోలు సైతం ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. VTOL ఎయిర్ మాడ్యూల్ ఫుల్ ఎలక్ట్రిక్, తక్కువ ఎత్తులో ఎగరటానికి అనుకూలంగా తయారుచేసిన ఈ కార్లను ఓ పెద్ద సైజు డ్రోన్స్ అని కూడా పిలవవచ్చు. అయితే మిగతా కార్లలా కాకుండా ఇందులో కేవలం ఇద్దరు మాత్రమే ప్రయాణించేందుకు అవకాశముంటుంది. దీనికి తగ్గట్టుగానే డిజైన్, స్పీడ్ లిమిట్ ను సెట్ చేశారు. ఇక 2024 జనవరిలో లాస్ వెగాస్‌లో జరిగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షోలో ఎక్స్ పెంగ్ ల్యాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ మాడ్యులర్ ఫ్లైయింగ్ కారుకు సంబంధించిన ఫ్రీ బుకింగ్ 2024 నాలుగో త్రైమాసికంలో అందుబాటులో ఉండనున్నట్లు పేర్కొంది. డెలివరీలు సైతం 2024 చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశముందని చెప్పింది.
ఎక్స్‌పెంగ్ ఏరోహెచ్‌టీ ప్రస్తుతానికైతే 3 ఫ్లయింగ్ కార్లను విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ జాబితాలో ల్యాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ కారు, ఎక్స్2 అని పిలువబడే VTOL (వర్టికల్ ల్యాండింగ్ అండ్ టేకాఫ్) ఎయిర్‌క్రాఫ్ట్ వంటివి ఉన్నాయి. అయితే ఇవి మార్కెట్లోకి ఎప్పుడు లాంచ్ అవుతాయనేదానికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం కంపెనీ వెల్లడించలేదు.
Also Read : Rupee At Life Time Low: రూపాయి విలువ ఎందుకు పడిపోతుంది - అది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా?