Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్ రీఛార్జ్, బిల్ పేమెంట్ కేటగిరీలో కొత్త ఆప్షన్స్ - ఈ బెనిఫిట్స్ మిస్ కావద్దు
Flipkart New Offers: ఫ్లిప్‌కార్ట్ యూపీఐ ద్వారా రీఛార్జ్ చేసినా, బిల్ పే చేసినా కొన్ని డిస్కౌంట్స్ పొందొచ్చు. కొత్త ఆఫర్స్ కోసం భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్‌ను ఫ్లిప్‌కార్ట్ యాక్టివేట్ చేసింది.
FlipKart Recharge And Bill Payment Offers: మీరు ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ అయితే మీకో గుడ్ న్యూస్. ఇ-కామర్స్ రంగ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, మరింత మంది కస్టమర్లను ఆకర్షించడానికి & డిజిటల్ పేమెంట్స్ విభాగంలో బలంగా పాతుకుపోవడానికి సరికొత్త ఆఫర్స్‌తో ముందుకు వచ్చింది. రీఛార్జ్, బిల్లుల చెల్లింపు కేటగిరీని విస్తరించి, కొత్తగా 5 అంశాలను చేర్చింది. దీనివల్ల, యాజర్లకు మరిన్ని ఆప్షన్లు, బెనిఫిట్స్ అందుబాటులోకి వస్తాయి. అంతేకాదు, ఫ్లిప్‌కార్ట్ సూపర్‌కాయిన్స్ (FlipKart SuperCoins) ద్వారా 10 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు.
కస్టమర్లకు మరిన్ని బెనిఫిట్స్, డిస్కౌంట్స్
రీఛార్జ్ & బిల్లుల చెల్లింపు విభాగంలో కొత్తగా 5 కేటగిరీలు - ఫాస్టాగ్ (Fastag), డీటీహెచ్ రీఛార్జ్ (DTH Recharge), ల్యాండ్ లైన్ (Landline), బ్రాడ్ బ్యాండ్ (Broadband), మొబైల్ పోస్ట్ పెయిడ్ (Mobile Postpaid Bill) - ప్రారంభించినట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ప్రస్తుతం, ఫ్లిప్‌కార్ట్‌లో విద్యుత్, మొబైల్ ప్రి-పెయిడ్ రీఛార్జ్ వంటి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ విభాగంలో రీఛార్జ్ & బిల్ పేమెంట్ చేసే కస్టమర్లకు డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్, స్క్రాచ్ కార్డ్‌ల వంటి కొన్ని బెనిఫిట్స్‌ను ఇ-కామర్స్ కంపెనీ అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యూపీఐ (Flipkart UPI) నుంచి అందుకున్న సూపర్ కాయిన్‌ల ద్వారా 10 శాతం వరకు డిస్కౌంట్స్ కూడా కస్టమర్లకు అందుబాటులోకి వచ్చాయి.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసిన 'భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్'తో (BBPS) తన కొత్త సేవలను అనుసంధానించడానికి బిల్ డెస్క్‌తో (BillDesk) ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
1.3 బిలియన్ల లావాదేవీలను ప్రాసెస్ చేసిన బీపీపీఎస్
2023-24 ఆర్థిక సంవత్సరంలో (FY 2023-24) సుమారు 1.3 బిలియన్ల లావాదేవీలను బీపీపీఎస్ ప్రాసెస్ చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ సంఖ్య 3 బిలియన్లను దాటుతుందని అంచనా. భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్‌లో 20 కంటే ఎక్కువ రకాల బిల్లులు & 21,000 పైగా బిల్లర్లు ఉన్నాయి. ఇప్పుడు 70 శాతానికి పైగా బిల్లుల చెల్లింపులు డిజిటల్ మార్గాల ద్వారానే జరుగుతున్నాయి. ఈ రంగంలో ఏటికేడు డిమాండ్ పెరుగుతూనే ఉంది. కొత్త కేటగిరీలను ప్రారంభించడం ద్వారా ఆ డిమాండ్‌ను క్యాష్ చేసుకోవడానికి ఫ్లిప్‌కార్ట్ ప్రయత్నిస్తోంది.
అమెజాన్ ప్రైమ్ డే సేల్స్
ఇ-కామర్స్ రంగంలో ఫ్లిప్‌కార్ట్‌కు గట్టి పోటీ ఇస్తున్న అమెజాన్, ఈ నెలలో ప్రైమ్ డే సేల్ (Amazon Prime Day Sale July 2024) నిర్వహిస్తోంది. ఈ నెల 20, 21 తేదీల్లో సేల్ ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఈ స్పెషల్ సేల్ ద్వారా ప్రైమ్ మెంబర్‌లకు అద్భుతమైన డీల్స్, భారీ సేవింగ్స్ ప్రకటించబోతోంది. నూతన ఉత్పత్తులను కూడా లాంచ్ చేస్తోంది. రెండు రోజుల మెగా ఈవెంట్‌లో గ్లోబల్ టాప్ బ్రాండ్స్, ఇండియన్ బ్రాండ్స్ మీద ప్రైమ్ మెంబర్లు ప్రత్యేక డిస్కౌంట్‌లు పొందొచ్చు. ఇంటెల్ (Intel), శామ్‌సంగ్ (Samsung), ఒన్‌ప్లస్ (OnePlus) సహా 450కి పైగా బ్రాండ్స్ నుంచి కొత్త లాంచ్‌లకు అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో యాక్సెస్ దొరుకుతుంది. ప్రైమ్ మెంబర్లు ICICI బ్యాంక్, SBI కార్డ్ ద్వారా చేసే కొనుగోళ్లపై ప్రత్యేక ఆఫర్‌లు, డిస్కౌంట్లు పొందొచ్చు.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి