Raymond Demerger: రెండుగా విడిపోతున్న రేమండ్ - సింగిల్ మీటింగ్‌లో అడ్డగీత
Demerger Of Raymond's Real Estate Business: రేమండ్ వాటాదార్లు ఈ కంపెనీలో హోల్డ్ చేస్తున్న ప్రతి ఒక్క షేర్‌కు బదులు రియల్ ఎస్టేట్ కంపెనీలో ఒక్కో షేర్ పొందుతారు.
Raymond Realty Limited: టెక్స్‌టైల్ & రియల్ ఎస్టేట్ రంగ దిగ్గజ సంస్థ రేమండ్ లిమిటెడ్, తన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని విడదీయాలని నిర్ణయించింది. నిన్న (గురువారం, జులై 4, 2024) జరిగిన రేమండ్ లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో... రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న అనుబంధ సంస్థ అయిన "రేమండ్ రియాల్టీ లిమిటెడ్"ను విడదీసేందుకు ఆమోదం లభించింది. విభజన ప్రక్రియ పూర్తయి, నియంత్రణ పరమైన అన్ని ఆమోదాలు పొందిన తర్వాత రేమండ్ రియాల్టీ లిమిటెడ్‌ను స్వతంత్ర్య కంపెనీగా లిస్ట్ చేస్తారు. ఆనాటి నుంచి రేమండ్ ఇండియా లిమిటెడ్, రేమండ్ రియాల్టీ లిమిటెడ్ కంపెనీలు వేర్వేరుగా లిస్టెడ్ ఎంటిటీలుగా పని చేస్తాయి.
వాటాదార్లకు రియల్ ఎస్టేట్ కంపెనీ షేర్లు
రెగ్యులేటరీ ఫైలింగ్‌లోరేమండ్ లిమిటెడ్ వెల్లడించిన ప్రకారం... స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ఆటోమేటిక్ లిస్టింగ్ కోసం కొత్త సంస్థ ఆమోదం కోరుతుందని వెల్లడించింది. రేమండ్ ఇండియాలో షేర్లు ఉన్న ప్రతి వాటాదారుకు రేమండ్ రియాల్టీ లిమిటెడ్ షేర్లు జారీ అవుతాయి. రేమండ్ ఇండియా లిమిటెడ్‌లో హోల్ట్ చేస్తున్న ఒక్కో షేర్‌కు రేమండ్ రియాల్టీ లిమిటెడ్‌కు సంబంధించిన ఒక షేర్ లభిస్తుంది. అంటే, 1:1 రేషియోలో రేమండ్ రియాల్టీ లిమిటెడ్ షేర్లు దక్కుతాయి.
2023-24 ఆర్థిక సంవత్సరంలో రేమండ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం రూ. 1593 కోట్ల ఆదాయం సాధించిందని, అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 43 శాతం ఎక్కువ అని, ఆ కంపెనీ ఎబిటా రూ. 370 కోట్లుగా నమోదైందని స్టాక్ ఎక్సేంజ్ ఫైలింగ్‌లో రేమండ్ లిమిటెడ్ తెలిపింది. ఈ అద్భుతమైన పనితీరు ద్వారా, ఆ కంపెనీ విడిగా లిస్ట్ కావడానికి, వేగంగా అభివృద్ధి చెందడానికి సిద్ధంగా ఉందని తెలిపింది.
థానేలో పెద్ద ల్యాండ్ పార్శిల్
రేమండ్ రియాల్టీ లిమిటెడ్‌కు థానేలో 11.4 మిలియన్ చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో 100 ఎకరాల భూమి ఉంది. దీనికి రెరా ఆమోదం ఉంది. ఈ ల్యాండ్ పార్శిల్‌లో 40 శాతం విస్తీర్ణాన్ని ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్నారు. థానేలో ఉన్న భూమిలో రూ. 9,000 కోట్ల విలువైన 5 ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి. ఈ ల్యాండ్ బ్యాంక్ మరో రూ. 16,000 కోట్లను ఉత్పత్తి చేసే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. మొత్తంగా చూస్తే, థానేలోని భూమి ద్వారా రూ. 25,000 కోట్ల ఆదాయ అవకాశం ఉంది.
వాటాదార్ల పెట్టుబడి విలువకు రెక్కలు
ఇప్పుడు, రేమండ్ గ్రూప్‌లో లైఫ్‌స్టైల్, రియల్ ఎస్టేట్, ఇంజినీరింగ్ వంటి మూడు అభివృద్ధి విభాగాలు ఉన్నాయి. వాటాదార్ల కోసం విలువను అన్‌లాక్ చేసే ఉద్దేశంతో డీమెర్జర్ నిర్ణయం తీసుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని డీమెర్జ్ చేసే వ్యూహం ప్రకారం, లిస్టింగ్ ప్రక్రియ మొత్తం ఆటోమేటిక్ రూట్ ద్వారా జరుగుతుంది. ఇది, వాటాదార్ల పెట్టుబడి విలువను పెంచుతుంది. - రేమండ్ చైర్మన్ & MD గౌతం హరి సంఘానియా
ఇటీవల, ముంబైలోని బాంద్రాలో మొదటి JDA ప్రాజెక్ట్‌ను రేమండ్ రియాల్టీ లిమిటెడ్ ప్రారంభించింది. మహిమ్, సియోన్, బాంద్రా ఈస్ట్ ముంబైల్ో కొత్త JDA కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లోని నాలుగు JDA ప్రాజెక్టుల్లో రూ. 7,000 కోట్ల రాబడి రాగల ప్రాజెక్టులపై పని చేస్తోంది. థానే ల్యాండ్ బ్యాంక్ అభివృద్ధిపై అంచనా వేస్తున్న రూ. 25,000 కోట్లను కూడా దీనికి జోడిస్తేం, మొత్తం ఆదాయ సంభావ్యత రూ. 32,000 కోట్లు అవుతుంది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి