News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Cryptocurrency Prices: మిక్స్‌డ్‌ జోన్లో క్రిప్టో మార్కెట్లు - రూ.11వేలు తగ్గిన BTC

Cryptocurrency Prices Today, 29 June 2023: క్రిప్టో మార్కెట్లు గురువారం స్తబ్దుగా ఉన్నాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు కొనుగోళ్లు చేపట్టేందుకు ఆసక్తి ప్రదర్శించడం లేదు.

FOLLOW US: 
Share:

Cryptocurrency Prices Today, 29 June 2023:

క్రిప్టో మార్కెట్లు గురువారం స్తబ్దుగా ఉన్నాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు కొనుగోళ్లు చేపట్టేందుకు ఆసక్తి ప్రదర్శించడం లేదు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 0.39 శాతం పెరిగి రూ.24.96 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.48.44 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథీరియమ్‌ (Ethereum) గత 24 గంటల్లో 0.30 శాతం తగ్గి రూ.1,52,171 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ విలువ రూ.18.28 లక్షల కోట్లుగా ఉంది.

టెథెర్‌ 0.11 శాతం తగ్గి రూ.81.96, బైనాన్స్‌ కాయిన్‌ 0.12 శాతం పెరిగి రూ.19,167, రిపుల్‌ 1.64 శాతం తగ్గి రూ.38.39, యూఎస్‌డీ కాయిన్‌ 0.02 శాతం తగ్గి రూ.82.02, లిడో స్టేక్డ్‌ ఈథర్‌ 0.37 శాతం తగ్గి రూ.1,51,928, డోజీ కాయిన్ 0.06 శాతం పెరిగి రూ.5.18 వద్ద కొనసాగుతున్నాయి. సీయూఎస్‌డీటీ, బీటీఎస్‌ఈ టోకెన్‌, హీలియం, సింథెటిక్స్‌ నెట్‌వర్క్‌, కాంపౌండ్‌, సొలానా, మేరినేడ్‌ స్టేక్డ్‌ లాభపడ్డాయి. ఈ-రాడిక్స్‌, రాడిక్స్‌, టోమో చైన్‌, కాన్‌స్టెల్లేషన్‌, ఆకాశ్ నెట్‌వర్క్‌, ఓపెన్‌ క్యాంపస్‌, మావెరిక్‌ ప్రొటోకాల్‌ నష్టపోయాయి.

హెచ్చుతగ్గులు ఉంటాయి

క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్‌, ఎథిరెమ్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్‌ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్‌ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్‌, ఎథెర్‌, డోజీకాయిన్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.

క్రిప్టో కరెన్సీ అంటే?

క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్‌ అసెట్‌. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్‌ డేటాబేస్‌ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.

భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి

భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, యాప్స్‌ చాలా అందుబాటులోకి వచ్చాయి.

త్వరలో నియంత్రణ!

క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్‌ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్‌, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు నవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 29 Jun 2023 03:30 PM (IST) Tags: Bitcoin Cryptocurrency Prices Ethereum Litecoin Ripple Dogecoin cryptocurrency

ఇవి కూడా చూడండి

Upcoming Cars on January 2024: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!

Upcoming Cars on January 2024: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!

Top Mutual Funds: ఇలాంటి ఫండ్స్‌ చేతిలో ఉంటే చాలు, టాప్‌ క్లాస్‌ రిటర్న్స్‌తో మీ కోసం డబ్బు సంపాదిస్తాయి

Top Mutual Funds: ఇలాంటి ఫండ్స్‌ చేతిలో ఉంటే చాలు, టాప్‌ క్లాస్‌ రిటర్న్స్‌తో మీ కోసం డబ్బు సంపాదిస్తాయి

Forex Reserves: పెరుగుతున్న ఆర్థిక బలం, 600 బిలియన్‌ మార్క్‌ దాటిన ఫారెక్స్‌ నిల్వలు

Forex Reserves: పెరుగుతున్న ఆర్థిక బలం, 600 బిలియన్‌ మార్క్‌ దాటిన ఫారెక్స్‌ నిల్వలు

Latest Gold-Silver Prices Today: ఒక్కసారిగా పడిపోయిన పసిడి రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Latest Gold-Silver Prices Today: ఒక్కసారిగా పడిపోయిన పసిడి రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

SGB Scheme: పసిడిలో పెట్టుబడికి గోల్డెన్‌ ఛాన్స్‌ - త్వరలోనే మరో 2 విడతల్లో సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌

SGB Scheme: పసిడిలో పెట్టుబడికి గోల్డెన్‌ ఛాన్స్‌ -  త్వరలోనే మరో 2 విడతల్లో సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌

టాప్ స్టోరీస్

Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క

Look Back 2023: భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!

Look Back 2023: భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!

2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?

2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?

Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం

Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం