By: ABP Desam | Updated at : 25 Sep 2023 05:47 PM (IST)
క్రిప్టో కరెన్సీ ( Image Source : Pexels )
Cryptocurrency Prices Today:
క్రిప్టో మార్కెట్లు సోమవారం నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 1.94 శాతం తగ్గి రూ.21.47 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.42.21 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథీరియమ్ (Ethereum) గత 24 గంటల్లో 1.53 శాతం తగ్గి రూ.1,30,419 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ విలువ రూ.15.66 లక్షల కోట్లుగా ఉంది.
టెథెర్ 0.02 శాతం పెరిగి రూ.83.11, బైనాన్స్ కాయిన్ 1.18 శాతం తగ్గి రూ.17,304, రిపుల్ 2.98 శాతం తగ్గి రూ.41.20, యూఎస్‌డీ కాయిన్ 0.08 శాతం పెరిగి రూ.83.15, లిడో స్టేక్డ్ ఈథర్ 1.51 శాతం తగ్గి రూ.1,30,475, డోజీ కాయిన్ 0.01 శాతం తగ్గి రూ.5.04 వద్ద కొనసాగుతున్నాయి. మెయిన్ ఫ్రేమ్, మూన్‌బీమ్, లూమ్ నెట్‌వర్క్, అప్టోస్, వరల్డ్ కాయిన్, ఇన్‌స్యూర్ డెఫీ, కర్వ్ డావో లాభపడ్డాయి. ఈ రాడిక్స్, రాడిక్స్, వీమిక్స్, కైబర్ నెట్‌వర్క్, మెరిట్ సర్కిల్, అలెఫ్ జీరో, ఆకాశ్ నెట్‌వర్క్ నష్టపోయాయి.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
త్వరలో నియంత్రణ!
క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు నవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Gold-Silver Prices Today 02 December 2023: పసిడి ప్రియులకు ఝలక్ - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Deadlines in December: ఈ నెలలో ముగిసే బ్యాంక్ స్పెషల్ ఆఫర్లు, పూర్తి చేయాల్సిన పనులు - వీటిని మిస్ కావద్దు
Self-Made Entrepreneurs: అంబానీ, అదానీ కాదు.. మన దేశంలో సిసలైన సంపన్నులు వీళ్లే
Rs 2000 Notes: రూ.2,000 నోట్లు ఇప్పటికీ చెల్లుతాయి, కీలక అప్డేట్ ఇచ్చిన ఆర్బీఐ
Latest Gold-Silver Prices Today 01 December 2023: మళ్లీ పెరిగిన పసిడి వెలుగు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
KCR On Results: హైరానా వద్దు, 3న సంబరాలు చేసుకుందాం- పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ భరోసా
Chandra Babu Meeting : చంద్రబాబు రాజకీయ సమావేశాలు షురూ- తొలి భేటీలో ఏం చర్చించారంటే!
Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్
Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం
/body>