By: ABP Desam | Updated at : 20 Mar 2023 04:21 PM (IST)
Edited By: Ramakrishna Paladi
క్రిప్టో కరెన్సీ ( Image Source : Wance Paleri/Unsplash )
Cryptocurrency Prices Today, 20 March 2023:
క్రిప్టో మార్కెటు సోమవారం లాభాల్లోనే ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు పెద్ద కాయిన్లు కొనుగోళ్లు చేస్తున్నారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 3.86 శాతం పెరిగి రూ.23.32 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.45.01 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథీరియమ్ (Ethereum) గత 24 గంటల్లో 0.07 శాతం తగ్గి రూ.1,47,510 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ విలువ రూ.17.72 లక్షల కోట్లుగా ఉంది.
టెథెర్ 0.60 శాతం తగ్గి రూ.82.87, బైనాన్స్ కాయిన్ 0.60 శాతం పెరిగి రూ.28,084, రిపుల్ 0.83 శాతం తగ్గి రూ.31.64, యూఎస్‌డీ కాయిన్ 0.02 శాతం తగ్గి రూ.82.86, కర్డానో 0.35 శాతం తగ్గి రూ.28.51, డోజీ కాయిన్ 0.07 శాతం తగ్గి 6.10 వద్ద కొనసాగుతున్నాయి. రెన్, ఓఎంజీ నెట్‌వర్క్, కస్పా, కాన్‌ఫ్లక్స్, ఈకాయిన్, నెర్వస్ నెట్‌వర్క్, బొలిడో లాభపడ్డాయి. బ్లాక్స్, షిడో ఫైనాన్స్, హీలియం, లిక్విటీ, జోయి, ఏపీఐ౩, కాంటో నష్టపోయాయి.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
త్వరలో నియంత్రణ!
క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు నవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Forex: పుంజుకున్న విదేశీ వాణిజ్యం, రెండు వారాల తర్వాత ఫారెక్స్ కళ
Top 10 Headlines Today: మంత్రులపై బాబు పంచ్‌లు, జగన్‌పై పేర్ని నాని ప్రశంసలు- సింగరేణిపై కేసీఆర్ కీలక ప్రకటన
Gold-Silver Price Today 10 June 2023: పసిడిపై ఫెడ్ ఎఫెక్ట్ - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి
Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లో నెగెటివ్ సెంటిమెంట్ - బిట్‌కాయిన్ 5వేలు జంప్!
Shloka Necklace: అంబానీ కోడలి డైమండ్ నెక్లెస్‌కు రిపేర్, దాని రేటు తెలిస్తే షాకవుతారు
KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు
Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు
Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !
Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?