అన్వేషించండి

Cryptocurrency Prices: టుడే క్రిప్టో కరెన్సీ - రూ.24.38 లక్షల వద్ద బిట్‌కాయిన్‌

Cryptocurrency Prices Today: క్రిప్టో మార్కెట్లు ఆదివారం నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు.

Cryptocurrency Prices Today: 

క్రిప్టో మార్కెట్లు ఆదివారం నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 0.03 శాతం తగ్గి రూ.24.38 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.47.43 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథీరియమ్‌ (Ethereum) గత 24 గంటల్లో 0.03 శాతం తగ్గి రూ.1,53,314 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ విలువ రూ.18.42 లక్షల కోట్లుగా ఉంది.

టెథెర్‌ 0.03 శాతం పెరిగి రూ.82.91, బైనాన్స్‌ కాయిన్‌ 0.01 శాతం పెరిగి రూ.19,936, రిపుల్‌ 0.39 శాతం తగ్గి రూ.52.06, యూఎస్‌డీ కాయిన్‌ 0.02 శాతం తగ్గి రూ.82.97, లిడో స్టేక్డ్‌ ఈథర్‌ 0.11 శాతం తగ్గి రూ.1,53,182, డోజీ కాయిన్ 0.03 శాతం తగ్గి రూ.6.34 వద్ద కొనసాగుతున్నాయి. లైవ్‌పీర్‌, మెరిట్‌ సర్కిల్‌, థార్‌చైన్‌, మురాసకి, ఏపీఐ3, రాడిక్స్‌, అరాగన్‌ లాభపడ్డాయి. ఓపెన్‌ ఎక్స్‌ఛేంజ్‌ టోకెన్‌, ఫ్లెక్స్‌ కాయిన్‌, హ్యారీ పాటర్‌ ఒబామా, సెంట్రీఫ్యూజ్‌, ఈకామి, రాల్‌బిట్‌ కాయిన్‌, బోన్‌షిబా స్వాప్‌ తగ్గాయి.

హెచ్చుతగ్గులు ఉంటాయి

క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్‌, ఎథిరెమ్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్‌ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్‌ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్‌, ఎథెర్‌, డోజీకాయిన్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.

క్రిప్టో కరెన్సీ అంటే?

క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్‌ అసెట్‌. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్‌ డేటాబేస్‌ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.

భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి

భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, యాప్స్‌ చాలా అందుబాటులోకి వచ్చాయి.

త్వరలో నియంత్రణ!

క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్‌ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్‌, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు నవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
Miss Universe 2024: విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ - ఆ దేశ తొలి మహిళగా రికార్డు
విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ - ఆ దేశ తొలి మహిళగా రికార్డు
Delhi Minister Kailash Gehlot Resigns : ఢిల్లీలో గేమ్ స్టార్ట్ చేసిన బీజేపీ- ఆప్‌లో మొదటి వికెట్‌ డౌన్ - రాజీనామా చేసిన మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ తీవ్ర ఆరోపణలు
ఢిల్లీలో గేమ్ స్టార్ట్ చేసిన బీజేపీ- ఆప్‌లో మొదటి వికెట్‌ డౌన్ - రాజీనామా చేసిన మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ తీవ్ర ఆరోపణలు
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
Embed widget