News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Cryptocurrency Prices : బిట్‌కాయిన్‌ @ రూ.22.96 లక్షలు! ఎరుపెక్కిన క్రిప్టో మార్కెట్‌

Cryptocurrency Prices Today: క్రిప్టో మార్కెట్లు మంగళవారం నష్టపోయాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు.

FOLLOW US: 
Share:

Cryptocurrency Prices Today:

క్రిప్టో మార్కెట్లు మంగళవారం నష్టపోయాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 2.31 శాతం తగ్గి రూ.22.96 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.44.78 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథీరియమ్‌ (Ethereum) గత 24 గంటల్లో 4.15 శాతం తగ్గి రూ.1,37,769 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ విలువ రూ.16.58 లక్షల కోట్లుగా ఉంది.

టెథెర్‌ 0.01 శాతం తగ్గి రూ.83.19, బైనాన్స్‌ కాయిన్‌ 2.13 శాతం తగ్గి రూ.17,831, రిపుల్‌ 2.21 శాతం తగ్గి రూ.42.41, యూఎస్‌డీ కాయిన్‌ 0.02 శాతం తగ్గి రూ.83.18, లిడో స్టేక్డ్‌ ఈథర్‌ 4.18 శాతం తగ్గి రూ.1,37,885, డోజీ కాయిన్ 0.03 శాతం తగ్గి రూ.5.14 వద్ద కొనసాగుతున్నాయి. బిట్‌కాయిన్‌ ఎస్వీ, రాల్‌బిట్‌ కాయిన్‌, గాలా, మెరిట్‌ సర్కిల్‌, స్విస్‌బార్గ్‌, టామినెట్‌, ఈకామి లాభపడ్డాయి. హ్యారీపాటర్‌ ఒబామా, చియా, సెంట్రీఫ్యూజ్‌, వ్రాప్డ్‌ సెంట్రీఫ్యూజ్‌, పెపె, ఐఓటెక్స్‌, ఫ్లోకీ నష్టపోయాయి. 

హెచ్చుతగ్గులు ఉంటాయి

క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్‌, ఎథిరెమ్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్‌ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్‌ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్‌, ఎథెర్‌, డోజీకాయిన్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.

క్రిప్టో కరెన్సీ అంటే?

క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్‌ అసెట్‌. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్‌ డేటాబేస్‌ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.

భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి

భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, యాప్స్‌ చాలా అందుబాటులోకి వచ్చాయి.

త్వరలో నియంత్రణ!

క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్‌ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్‌, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు నవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 03 Oct 2023 05:10 PM (IST) Tags: Bitcoin Cryptocurrency Prices Ethereum Litecoin Ripple Dogecoin cryptocurrency

ఇవి కూడా చూడండి

LIC Policy: ఆడపిల్ల పెళ్లి కోసం దిగులొద్దు, ఈ పాలసీ తీసుకుంటే ఎల్‌ఐసీ మీకు రూ.31 లక్షలు ఇస్తుంది!

LIC Policy: ఆడపిల్ల పెళ్లి కోసం దిగులొద్దు, ఈ పాలసీ తీసుకుంటే ఎల్‌ఐసీ మీకు రూ.31 లక్షలు ఇస్తుంది!

Tax Notice: ఇల్లు కొన్నాక 20 శాతం TDS కట్టమంటూ నోటీస్‌ వచ్చిందా, తప్పు ఎక్కడ జరిగిందో అర్ధమైందా?

Tax Notice: ఇల్లు కొన్నాక 20 శాతం TDS కట్టమంటూ నోటీస్‌ వచ్చిందా, తప్పు ఎక్కడ జరిగిందో అర్ధమైందా?

Coca Cola Liquor: కోకా కోలా నుంచి మొదటి లిక్కర్‌ బ్రాండ్‌ - రేటెంత, ఎక్కడ దొరుకుతుందో తెలుసా?

Coca Cola Liquor: కోకా కోలా నుంచి మొదటి లిక్కర్‌ బ్రాండ్‌ - రేటెంత, ఎక్కడ దొరుకుతుందో తెలుసా?

Adani Group Stocks: జాక్‌పాట్‌ కొట్టిన అదానీ ఇన్వెస్టర్లు, ఐదు రోజుల్లోనే రూ.20,000 కోట్ల లాభం

Adani Group Stocks: జాక్‌పాట్‌ కొట్టిన అదానీ ఇన్వెస్టర్లు, ఐదు రోజుల్లోనే రూ.20,000 కోట్ల లాభం

Latest Gold-Silver Prices Today: జర్రున జారుతున్న గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Latest Gold-Silver Prices Today: జర్రున జారుతున్న గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

టాప్ స్టోరీస్

YSRCP Gajuwaka : వైసీపీకి గాజువాక ఇంచార్జ్ గుడ్ బై - వెంటనే గుడివాడ అమర్నాథ్‌కు బాధ్యతలు !

YSRCP Gajuwaka :  వైసీపీకి  గాజువాక ఇంచార్జ్ గుడ్ బై - వెంటనే గుడివాడ అమర్నాథ్‌కు బాధ్యతలు !

Hyderabad News: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎండీ సజ్జనార్ - 'మహాలక్ష్మి' పథకంపై పరిశీలన, ఇబ్బందులుంటే ఈ నెంబర్లకు కాల్ చేయాలని సూచన

Hyderabad News: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎండీ సజ్జనార్ - 'మహాలక్ష్మి' పథకంపై పరిశీలన, ఇబ్బందులుంటే ఈ నెంబర్లకు కాల్ చేయాలని సూచన

Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!

Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!

Happy Birthday Nabha Natesh: నభా నటేష్ బర్త్ డే: అందాల నటికి అవకాశాలు నిల్ - పాపం, ఆ యాక్సిడెంట్‌తో!

Happy Birthday Nabha Natesh: నభా నటేష్ బర్త్ డే: అందాల నటికి అవకాశాలు నిల్ - పాపం, ఆ యాక్సిడెంట్‌తో!