అన్వేషించండి

Cryptocurrency Market Spike: డిజిటల్‌ అసెట్‌పై పన్ను! మరి క్రిప్టో మార్కెట్లో ఊపుందా! ఊడ్చుకుపోతోందా!

బడ్జెట్‌లో డిజిటల్‌ అసెట్స్‌పై పన్ను వేయడం సెంటిమెంట్‌ పెంచినట్టు కనిపిస్తోంది. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కాస్త కొనుగోళ్లు చేస్తున్నారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ 3.78 శాతం పెరిగి రూ.30.89 లక్షల వద్ద కొనసాగుతోంది.

Cryptocurrency Prices Today, 1 february 2022: క్రిప్టో మార్కెట్లు మంగళవారం లాభాల్లోనే ఉన్నాయి. బహుశా బడ్జెట్‌లో డిజిటల్‌ అసెట్స్‌పై పన్ను వేయడం సానుకూల సెంటిమెంట్‌ పెంచినట్టు కనిపిస్తోంది.  ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కాస్త కొనుగోళ్లు చేస్తున్నారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ 3.78 శాతం పెరిగి రూ.30.89 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.52.45 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథిరియమ్‌ గత 24 గంటల్లో 8.50 పెరిగి రూ.2,20,246 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ విలువ రూ.22.60 లక్షల కోట్లుగా ఉంది. 

బైనాన్స్‌ కాయిన్‌ 2.74 శాతం పెరిగి రూ.30,740, టెథెర్‌ 0.04 శాతం పెరిగి రూ.80.32, కర్డానో 3.44 శాతం పెరిగి రూ.85.01, యూఎస్‌డీ కాయిన్‌ 0.05 శాతం తగ్గి  80.29, సొలానా 17.47 శాతం పెరిగి రూ.8,575 వద్ద కొనసాగుతున్నాయి. క్వాంట్‌స్టాంప్‌, సివిక్‌, టెర్రా, ఆవె, గాలా, కాస్మోస్‌, 11 నుంచి 43 శాతం వరకు లాభాల్లో ఉన్నాయి. ఒమిస్‌గో, ఎన్‌కేఎన్‌, యూఎస్‌డీ కాయిన్‌ స్వల్ప నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.

హెచ్చుతగ్గులు ఉంటాయి

క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్‌, ఎథిరెమ్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్‌ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్‌ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్‌, ఎథెర్‌, డోజీకాయిన్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.

క్రిప్టో కరెన్సీ అంటే?

క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్‌ అసెట్‌. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్‌ డేటాబేస్‌ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.

భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి

భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, యాప్స్‌ చాలా అందుబాటులోకి వచ్చాయి.

త్వరలో నియంత్రణ!

క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్‌ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్‌, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget