Commercial LPG Price Hike: మళ్లీ గ్యాస్ బండ మోత..! రూ.100 పెంచిన చమురు కంపెనీలు
చమురు కంపెనీలు కస్టమర్లకు షాకిచ్చాయి. మళ్లీ గ్యాస్ బండ ధరను పెంచాయి. డిసెంబర్ 1 నుంచి రూ.100 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.
Gas Cylinder Price: వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి షాకిచ్చింది! ద్రవ్యోల్బణం పెరుగుదల కస్టమర్లకు చుక్కలు చూపిస్తోంది. చమురు కంపెనీలు మళ్లీ గ్యాస్ బండ ధరలు పెంచాయి. 2021, డిసెంబర్ 1 నుంచి వాణిజ్య సిలిండర్ల ధరలు రూ.100 వరకు ప్రియం కానున్నాయి. నవంబర్లో పెరిగిన రూ.266కు ఇది అదనం. అయితే వంటింటి అవసరాలకు ఉపయోగించే గ్యాస్ బండ ధరలు పెంచకపోవడం మాత్రం కాస్త ఊరటనిచ్చే అంశం.
Price of cylinder crosses Rs 2100:
ఈ రోజు పెరిగిన ధరలతో 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధర రూ.2100కు చేరుకుంది. 14.2 కిలోల గ్యాస్ బండ దిల్లీలో రూ.899కి చేరుకుంది.
ఏ నగరాల్లో ఎంత?
దిల్లీ - Rs 2101
కోల్‌కతా - Rs 2177
ముంబయి - Rs 2051
చెన్నై - Rs 2234
వంటింటి అవసరాల సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. 14.2 కిలోల సబ్సిడీ యేతర సిలిండర్ ధర దిల్లీలో రూ.899గా ఉంది. కోల్‌కతాలో రూ.926, ముంబయిలో రూ.899, చెన్నైలో రూ.915గా ఉంది. చివరి సారిగా గృహ వినియోగ సిలిండర్ ధరను అక్టోబర్ 6న పెంచారు. నవంబర్లో ఎలాంటి పెరుగుదల లేదు.
अब कॉमर्शियल गैस सिलेंडर ₹101 महँगा !
— Randeep Singh Surjewala (@rssurjewala) December 1, 2021
लगता है शादी के सीज़न में भाजपा सरकार लोगों की ज़िंदगी में रोज़ महंगाई का तड़का लगा रही है।
अब सिलेंडर हुआ ₹2,101 का।
महंगाई अपरंपार,
जनता की जेब काटे बार बार,
ऐसी रही मोदी सरकार।#LPGHIKE https://t.co/2fSN1Sz4LO
Also Read: Cryptocurrency Prices Today: పెరుగుతున్న క్రిప్టో ధరలు..! భయం పోయిందా..?
Also Read: Go Fashion shares: రూ.14,490 పెట్టుబడికి రూ.28,161 లాభం ఇచ్చిన ఐపీవో ఇది
Also Read: Satya Nadella: మైక్రోసాఫ్ట్‌లో తన పేరిట ఉన్న సగం షేర్లు అమ్మేసిన సత్య నాదెళ్ల.. ఎందుకంటే..
Also Read: Star Health IPO: స్టార్ హెల్త్ ఐపీవో మొదలు.. దరఖాస్తు చేసే ముందు ఇవి తెలుసుకోండి!