అన్వేషించండి

Cement Prices: ఇల్లు కడుతున్నారా?, ఈ వార్త చదివితే ఎగిరి గంతేస్తారు

గత ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ ధరలు సరికొత్త రికార్డు సృష్టించాయి

Cement Prices In India: సొంతంగా ఇల్లు కట్టుకునే వాళ్లకు గుడ్‌ న్యూస్‌. మరికొన్నాళ్లలో ఇంటి నిర్మాణ వ్యయం తగ్గే అవకాశం ఉంది. సిమెంట్ రేట్లు రానున్న రోజుల్లో 1 నుంచి 3 శాతం వరకు తగ్గవచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ (Crisil) చెబుతోంది. ప్రస్తుతం, భారతదేశంలో సిమెంట్ ధరలు మంటపుట్టిస్తున్నాయి, రికార్డు స్థాయిలో ఉన్నాయి.

మంట పుట్టిస్తున్న సిమెంట్ రేట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ బస్తా రేటు 1-3 శాతం వరకు తగ్గవచ్చని క్రిసిల్ పేర్కొంది. గత 4 సంవత్సరాల్లో, సిమెంట్ ధరలు ఏటా 4 శాతం పెరుగుతూ వెళ్లాయి. దీంతో, ఇప్పుడు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరాయి, ఇంటి నిర్మాణాన్ని పెనుభారంగా మార్చాయి. గత ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ ధరలు సరికొత్త రికార్డు సృష్టించాయి, 50 కిలోల బస్తా ధర రూ. 391కి చేరింది.

సిమెంట్‌ ఇండస్ట్రీకి మంచి రోజులు
సిమెంట్ పరిశ్రమలో పోటీ తీవ్రంగా ఉందని క్రిసిల్ చెబుతోంది. ఈ కారణంగానే సిమెంట్ ప్రైజెస్‌ చల్లబడవచ్చని, రానున్న రోజుల్లోనూ ఇంకా తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడింది. సిమెంట్‌ తయారీ వ్యయంలో ఇంధన ఛార్జీలది కూడా పెద్ద వాటా. ఇప్పుడు, అంతర్జాతీయ మార్కెట్‌లో కోల్‌ రేట్లు తగ్గడం వల్ల, కంపెనీల ఎనర్జీ కాస్ట్‌ కూడా తగ్గింది. ఫైనల్‌గా సిమెంట్‌ రేట్లు మెత్తబడ అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (2023 జనవరి-మార్చి కాలం), సిమెంట్ కంపెనీలు మరింత ఎక్కువ మార్కెట్ షేర్‌ కోసం పోటీ పడ్డాయి. ఈ కారణంగా 2023 ప్రారంభంలో ధరలు కొంత తగ్గాయి.

క్రిసిల్ డేటా ప్రకారం, 2023 జనవరి-మార్చి త్రైమాసికంలో సిమెంట్ ధరలు సగటున 1 శాతం తగ్గాయి, 50 కిలోల బస్తాకు సగటున రూ. 388కి చేరాయి. రేటు తగ్గినా, ఇది ఇప్పటికీ గరిష్ఠ స్థాయిలోనే ఉంది. కాబట్టి, ధర తగ్గడానికి ఇంకా అవకాశం ఉంది. వర్షాకాలానికి ముందు ఏప్రిల్, మే నెలలు సిమెంట్‌ డిమాండ్‌ పీక్‌ స్టేజ్‌లో ఉంటుంది. సాధారణంగా ఆ సమయానికి సిమెంట్‌ కంపెనీలు రేట్లు పెంచుతాయి, ఈ ఏడాది మాత్రం పెంచలేదు. ఇలా జరగడం చాలా ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి అని కూడా తన రిపోర్ట్‌లో క్రిసిల్‌ వెల్లడించింది. వర్షాకాలంలో నిర్మాణాలు & సిమెంట్‌ డిమాండ్‌ రెండు తగ్గడం ఆనవాయితీ. ప్రస్తుతం మాన్‌సూన్‌ సీజన్ స్టార్టయింది కాబట్టి, సిమెంట్‌ రేట్లు మెత్తబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

దేశీయ, అంతర్జాతీయ కారణాలు
రాబోయే రోజుల్లో, బొగ్గు ధరలను ఆస్ట్రేలియా తగ్గించడం, అంతర్జాతీయ & దేశీయ పెట్ కోక్ ప్రైస్‌ తగ్గింపు వాటి కారణాల వల్ల సిమెంట్ రేట్లు తగ్గే అవకాశం ఉందని క్రిసిల్ నమ్ముతోంది. డీజిల్ ధరలు తగ్గుతాయన్న అంచనాలు కూడా సిమెంట్ ఇండస్ట్రీకి సపోర్ట్‌గా మారింది.

ఒక ఇల్లు కట్టాలంటే, నిర్మాణ సామగ్రి కోసమే ఎక్కువ ఖర్చు చేయాలి. క్రిసిల్ నివేదిక నిజమైతే, రాబోయే రోజుల్లో మీ డ్రీమ్ హోమ్ నిర్మాణం మరింత చౌకగా మారవచ్చు. 

మరో ఆసక్తికర కథనం: ఎక్కువ వడ్డీ ఇచ్చే ఎస్‌బీఐ స్పెషల్‌ స్కీమ్‌, ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌ 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial 

టాప్ హెడ్ లైన్స్

Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget