By: ABP Desam | Updated at : 21 Jun 2023 12:19 PM (IST)
ఎక్కువ వడ్డీ ఇచ్చే ఎస్‌బీఐ స్పెషల్ స్కీమ్
SBI Wecare Senior Citizen FD scheme: సీనియర్ సిటిజన్స్ కోసం స్టేట్ బ్యాంక్ తీసుకొచ్చిన స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్ "ఎస్‌బీఐ వియ్‌కేర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్". ఎఫ్‌డీ మీద ఎక్కువ వడ్డీ ఆదాయం సంపాదించాలనుకుంటే ఈ స్కీమ్‌ను మీ ఆప్షన్స్‌లో చేర్చుకోవచ్చు. ఈ పథకం కేవలం సీనియర్ సిటిజన్ల (60 సంవత్సరాలు లేదా నిండినవాళ్లు) కోసం మాత్రమే. ఇటీవల ఈ స్కీమ్ గడువును ఈ నెలాఖరుతో ముగుస్తుంది. అంటే, మంచి ఇంట్రస్ట్ రేట్ పొందాలంటే మరో 10 రోజులే ఛాన్స్ మిగిలుంది.
తొలిసారి, 2020 మే 20న ఈ స్కీమ్‌ను స్టేట్ బ్యాంక్ (SBI) ప్రవేశపెట్టింది. అదే ఏడాది సెప్టెంబర్ వరకే కంటిన్యూ చేస్తామని చెప్పింది. ఈ స్పెషల్ డిపాజిట్ స్కీమ్ పాపులర్ కావడంతో, ఆ తర్వాత గడువును పదేపదే పెంచింది. చివరిసారి, మార్చి 31, 2023న స్కీమ్ వ్యాలిడిటీ ముగియాల్సి ఉండగా, జూన్ 30 వరకు (ఈ నెలాఖరు వరకు) పొడిగించింది. ఈ లాస్ట్ డేట్‌ను ఇంకా ఎక్స్‌టెండ్ చేస్తుందో, లేదో తెలీదు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లోని డేటా ప్రకారం... సీనియర్ సిటిజన్స్ కోసం డిజైన్ చేసిన స్పెషల్ టర్మ్ డిపాజిట్ ప్రోగ్రామ్ ఇది. తద్వారా, రిటైర్మెంట్ ఏజ్‌లో ఆదాయ భద్రతతో పాటు అధిక వడ్డీ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ కింద, సీనియర్ సిటిజన్లకు 50 నుంచి 100 బేసిస్ పాయింట్ల (1% వరకు) ఎక్కువ వడ్డీ చెల్లిస్తోంది.
వియ్‌కేర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌పై ఎంత వడ్డీ?
ఈ ప్రత్యేక FDలో కనీసం 5 సంవత్సరాల కాలానికి డిపాజిట్ చేయాలి. 5 నుంచి 10 సంవత్సరాల కాల వ్యవధిపై 7.50 శాతం వడ్డీని బ్యాంక్ చెల్లిస్తోంది. స్వయంగా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లిగానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా యోనో ద్వారా ఈ స్పెషల్ FD అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. 5 సంవత్సరాల కంటే ముందే డిపాజిట్‌ను వెనక్కు తీసుకుంటే నష్టపోవాల్సి వస్తుంది.
ఏ కాల వ్యవధికి ఎంత వడ్డీ?
7 రోజుల నుంచి 45 రోజుల కాల వ్యవధిపై 3.5 శాతం వడ్డీ
46 రోజుల నుంచి 179 రోజుల కాల వ్యవధిపై 5 శాతం వడ్డీ
180 రోజుల నుంచి 210 రోజుల వరకు 5.75 శాతం వడ్డీ
211 రోజుల నుంచి 1 సంవత్సరానికి 6.25 శాతం వడ్డీ
1 సంవత్సరం మరియు 2 సంవత్సరాల మధ్య 7.3 శాతం వడ్డీ
2 నుంచి 3 సంవత్సరాలకు 7.5 శాతం వడ్డీ
3 నుంచి 5 సంవత్సరాలకు 7 శాతం వడ్డీ
5 నుంచి 10 సంవత్సరాలకు 7.50 శాతం పైగా వడ్డీ
లోన్ ఫెసిలిటీ కూడా
"ఎస్‌బీఐ వియ్‌కేర్ సీనియర్ సిటిజన్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్"లో పెట్టుబడి పెట్టిన వ్యక్తికి లోన్ ఫెసిలిటీ కూడా అందుబాటులోకి వస్తుంది. ఈ FDని గ్యారెంటీగా ఉంచి బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు. ఆదాయ పన్ను విభాగం నిబంధనల (Income Tax Rules) ప్రకారం, వడ్డీ ఆదాయంపై TDS కట్ అవుతుంది.
మరో ఆసక్తికర కథనం: కొండ దిగిన స్వర్ణం - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
పర్సనల్ లోన్ కొరకు అర్హత: బజాజ్ ఫైనాన్స్ తో త్వరిత నిధులకు సులభమైన మార్గదర్శకం
EPFO Update: ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి
Investment Tips: వెండి లేదా గోల్డ్ ఎందులో ఇన్వెస్ట్ చేయాలి ? ఏది లాభదాయకం, బెనిఫిట్స్ ఎక్కువ
Year Ender 2025 : ఉద్యోగస్తులకు కలిసి వచ్చిన 2025- పెద్ద ఊరటనిచ్చిన అంశాలు ఇవే!
Investment Tips: పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
Australia terror attack: ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి పాల్పడిన తండ్రీ కొడుకులు హైదరాబాద్ వాళ్లే - పాకిస్తాన్ వాళ్లు కాదు !
BRS Party Key Meeting: ఈ 19న జరగాల్సిన బీఆర్‌ఎస్ కీలక సమావేశం వాయిదా వేసిన కేసీఆర్
YSRCP Kukatpalli: కూకట్‌పల్లిలో ధర్నాలు, రాజకీయ ప్రదర్శనలు - వైఎస్ఆర్‌సీపీ నేతలు హద్దులు చెరిపేస్తున్నారా?
Jai Akhanda: 'జై అఖండ'కు కొత్త నిర్మాతలు... 14 రీల్స్ ప్లస్ నుంచి మరొకరికి!