అన్వేషించండి

Nithin Kamath on New Scam : బీ అలర్ట్ - ఈ కొత్త స్కామ్ తో మీ డబ్బు మొత్తం మాయం చేస్తారు - జెరోధా సీఈవో షేర్ చేసిన చిట్కాలివే

Nithin Kamath on New Scam : అపరిచిత వ్యక్తులు మీ బ్యాంకు ఖాతాను ఇటీవలి కాలంలో ఎలా ఖాళీ చేస్తారో జెరోధా సీఈవో నితిన్ కామత్ ఓ వీడియో ద్వారా తెలియజేశారు.

Nithin Kamath on New Scam : టెక్నాలజీతో పాటు మోసాలూ పెరుగుతున్నాయి. పోలీసులు, కస్టమ్స్ లేదా సీబీఐ అధికారులుగా నటిస్తూ బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తోన్న ఉదంతాలు రోజూ ఎన్నో చూస్తూనే ఉన్నాయి. తెలియని నంబర్ నుంచి వచ్చిన లింకులపై క్లిక్ చేసి సైబర్ మోసానికి గురవడం ఇటీవలి కాలంలో మరిన్ని భయాందోళనలకు గురి చేస్తోంది. ఈ తరహా మోసాలపై అవగాహన కల్పించేందుకు జెరోధా సీఈవో నితిన్ కామత్ ముందుకు వచ్చారు. ఈ మధ్య కాలంలో వెలుగులోకి వస్తోన్న ఓ కొత్త స్కామ్ గురించి హెచ్చరికలు జారీ చేసిన ఆయన.. దీని వల్ల బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదముందని చెప్పారు. ఈ కొత్త స్కామ్ కు సంబంధించిన విషయాలను తెలియజేస్తూ ఓ వీడియోను కూడా షేర్ చేశారు.

కొత్త స్కామ్ లో కీలక విషయాలు వెల్లడించిన నితిన్ కామత్

అర్జంట్ గా కాల్ చేయాలి.. మీ ఫోన్ ఇస్తారా అని ఎవరైనా తెలియని వ్యక్తులు మనల్ని అడగడం చూస్తూనే ఉంటాం. వీళ్లు చూసేందుకు మాత్రం అమాయకంగా కనిపిస్తారు. వీళ్ల మెయిన్ టార్గెట్ ఎక్కువగా వృద్ధులు, చిన్న పిల్లలు, ఈజీగా మోసపోయే వాళ్లే. ఎవరైనా మిమ్మల్ని కూడా ఇలా అడిగి.. మీ ఫోన్ తీసుకుని పక్కకు వెళితే తప్పకుండా అనుమానించాలి. ఎందుకంటే ఈ స్కామర్లు మీకు తెలియకుండానే మీ ఫోన్ నుంచి కొన్ని యాప్స్ ను డౌన్ లోడ్ చేసే అవకాశముంటుంది. అంతే కాదు మీ బ్యాంకింగ్ అలర్ట్స్ తో సహా కాల్స్, మెసేజెస్ వారి నంబర్ కు ఫార్వార్డ్ చేసేందుకు మీ ఫోన్ లో సెట్టింగ్స్ ను మార్చే ఛాన్స్ ఉంది. దీని వల్ల ఓటీపీలను రాకుండా చేసి.. మీ అకౌంట్ ను ఖాళీ చేయొచ్చు అని కామత్ చెప్పారు.

ఈ స్కామ్ కు గురికాకుండా ఉండాలంటే..

మీ ఫోన్ ను అపరిచిత వ్యక్తులకు ఇవ్వకూడదు. దాని బదులు మీరే వారు చెప్పిన నంబర్ ను డయల్ చేసి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాలని చెప్పాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు మనం పెద్ద మోసాల బారిన పడకుండా చేస్తాయి అని కామత్ వివరించారు.

నెటిజన్లు ఏమన్నారంటే..

నితిన్ కామత్ షేర్ చేసిన వీడియోపై యూజర్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఈ తరహా మోసాలపై ఆందోళన వ్యక్తం చేయగా.. మరికొందరేమో తమకు జరిగిన ఇలాంటి సంఘటనలను పంచుకున్నారు. ఇంకొందరేమో చాలా మంది స్కామర్‌లు తమ లక్ష్యంతో కమ్యూనికేట్ చేయడానికి స్థానిక భాషను ఉపయోగించే అవకాశం ఉన్నందున, దాని ప్రభావాన్ని పెంచడానికి అనేక భారతీయ భాషల్లో వీడియోను అనువదించాలని నితిన్ కామత్‌ను కోరారు. ఇక పోతే నేటి టెక్నాలజీ యుగంలో ఆర్థిక, వ్యక్తిగత జీవితానికి ఫోన్ అనేది ఓ కీ లాంటిది. ఇతరులకు సహాయం చేయడం మంచిదే. కానీ జాగ్రత్తగా ఉండడం అంతకన్నా ముఖ్యమనే విషయాన్ని గుర్తించుకోవాలి. కొన్నిసార్లు కొద్దిపాటి జాగ్రత్తలే పెద్ద నష్టాలను నివారించగలవు. మీరు ఏదైనా స్కామ్ కు గురయ్యారనిపిస్తే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930కు కాల్ చేసి మాట్లాడండి.

Also Read : Hindenburg Research : హిండెన్ బర్గ్ మూసివేత - ఫౌండర్ సంచలన ప్రకటన, సవాళ్లలోనూ ఉత్సాహంగా పని చేశామని లేఖ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati farmers: త్వరలో అమరావతి గెజిట్ -  సమస్యలు 6 నెలల్లో పరిష్కరిస్తాం -  రైతులకు కేంద్రమంత్రి పెమ్మసాని హామీ
త్వరలో అమరావతి గెజిట్ - సమస్యలు 6 నెలల్లో పరిష్కరిస్తాం - రైతులకు కేంద్రమంత్రి పెమ్మసాని హామీ
Aus vs Eng 1st Test Highlights: ట్రావిస్ హెడ్ ఫాస్టెస్ట్ సెంచరీ.. తొలి టెస్టులో ఇంగ్లాండ్‌పై ఆతిథ్య ఆస్ట్రేలియా ఘన విజయం
ట్రావిస్ హెడ్ ఫాస్టెస్ట్ సెంచరీ.. తొలి టెస్టులో ఇంగ్లాండ్‌పై ఆతిథ్య ఆస్ట్రేలియా ఘన విజయం
Maoists surrender: మావోయిస్టులకు  మరో భారీ ఎదురుదెబ్బ - తెలంగాణ డీజీపీ ఎదుట 37 మంది లొంగుబాటు !
మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ - తెలంగాణ డీజీపీ ఎదుట 37 మంది లొంగుబాటు !
Delhi Crime News: పాకిస్తాన్ కుట్ర విఫలం! డ్రోన్లతో భారత్‌లోకి ఆయుధాలు స్మగ్లింగ్.. నలుగురి అరెస్టు
పాకిస్తాన్ కుట్ర విఫలం! డ్రోన్లతో భారత్‌లోకి ఆయుధాలు స్మగ్లింగ్.. నలుగురి అరెస్టు
Advertisement

వీడియోలు

India vs South Africa 2nd Test Match | రెండో టెస్ట్ నుంచి శుభమన్ గిల్ అవుట్
Australia Vs England 1st Test Ashes 2025 |  యాషెస్‌లో చెలరేగిన బౌలర్లు
Gambhir Warning to Team India | టీమిండియా ప్లేయర్లకు గంభీర్ వార్నింగ్ ?
Asia Cup Rising Stars 2025 | సెమీ ఫైనల్ లో భారత్ ఓటమి
Akhanda 2 Thaandavam Trailer Reaction | బాబోయ్ బాలయ్యా...వన్ మ్యాన్ ఆర్మీగా మారి యుద్ధం | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati farmers: త్వరలో అమరావతి గెజిట్ -  సమస్యలు 6 నెలల్లో పరిష్కరిస్తాం -  రైతులకు కేంద్రమంత్రి పెమ్మసాని హామీ
త్వరలో అమరావతి గెజిట్ - సమస్యలు 6 నెలల్లో పరిష్కరిస్తాం - రైతులకు కేంద్రమంత్రి పెమ్మసాని హామీ
Aus vs Eng 1st Test Highlights: ట్రావిస్ హెడ్ ఫాస్టెస్ట్ సెంచరీ.. తొలి టెస్టులో ఇంగ్లాండ్‌పై ఆతిథ్య ఆస్ట్రేలియా ఘన విజయం
ట్రావిస్ హెడ్ ఫాస్టెస్ట్ సెంచరీ.. తొలి టెస్టులో ఇంగ్లాండ్‌పై ఆతిథ్య ఆస్ట్రేలియా ఘన విజయం
Maoists surrender: మావోయిస్టులకు  మరో భారీ ఎదురుదెబ్బ - తెలంగాణ డీజీపీ ఎదుట 37 మంది లొంగుబాటు !
మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ - తెలంగాణ డీజీపీ ఎదుట 37 మంది లొంగుబాటు !
Delhi Crime News: పాకిస్తాన్ కుట్ర విఫలం! డ్రోన్లతో భారత్‌లోకి ఆయుధాలు స్మగ్లింగ్.. నలుగురి అరెస్టు
పాకిస్తాన్ కుట్ర విఫలం! డ్రోన్లతో భారత్‌లోకి ఆయుధాలు స్మగ్లింగ్.. నలుగురి అరెస్టు
Mangli Bayilone Ballipalike Song : మంగ్లీ 'బాయిలోనే బల్లి పలికే' ఫుల్ సాంగ్ - ట్రెండింగ్ ఫోక్ లిరిక్స్ చూశారా?
మంగ్లీ 'బాయిలోనే బల్లి పలికే' ఫుల్ సాంగ్ - ట్రెండింగ్ ఫోక్ లిరిక్స్ చూశారా?
Viveka murder case:  వివేకా హత్య కేసులో మరో మలుపు! దస్తగిరిని జైల్లో బెదిరించిన ఘటనపై విచారణకు ప్రత్యేక టీం ఏర్పాటు!
వివేకా హత్య కేసులో మరో మలుపు! దస్తగిరిని జైల్లో బెదిరించిన ఘటనపై విచారణకు ప్రత్యేక టీం ఏర్పాటు!
Manchu Manoj : మంచు మనోజ్ న్యూ జర్నీ స్టార్ట్ - 'మిరాయ్' సక్సెస్ తర్వాత సరికొత్తగా...
మంచు మనోజ్ న్యూ జర్నీ స్టార్ట్ - 'మిరాయ్' సక్సెస్ తర్వాత సరికొత్తగా...
India China Relations: అమెరికాతో విభేదాల మధ్య భారత్ కీలక నిర్ణయం.. చైనా ఫుల్ హ్యాపీ, ఎవరికి ప్రయోజనం!
అమెరికాతో విభేదాల మధ్య భారత్ కీలక నిర్ణయం.. చైనా ఫుల్ హ్యాపీ, ఎవరికి ప్రయోజనం!
Embed widget