అన్వేషించండి

Union Budget 2026: పన్ను విధానంలో మార్పులు, ఆరోగ్య బీమాపై ఫోకస్.. కేంద్ర బడ్జెట్ 2026 పై ఎన్నో ఆశలు

Union Budget 2026-27: ఆరోగ్య సేవల విస్తరణపై కేంద్రం దృష్టిసారిస్తుందని, అదే విధంగా హెల్త్ ఇన్సూరెన్స్, హోం లోన్ సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.

Budget 202627 Expectations | న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన ఆదివారం ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో దేశంలోని లక్షలాది మంది పెట్టుబడిదారులు, పన్ను చెల్లింపుదారుల దృష్టి ఈ బడ్జెట్‌పైనే ఉంది. ఎందుకంటే దీని ద్వారా కొంత ఉపశమనం కలిగి వారి జేబులపై నేరుగా ప్రభావం చూపుతుంది. నిర్మలా సీతారామన్  వరుసగా ప్రవేశపెట్టనున్న తొమ్మిదవ పూర్తి స్థాయి బడ్జెట్ అవుతుంది. ఆమె తొలిసారిగా ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తారు. కేంద్ర బడ్జెట్‌పై మధ్యతరగతి వారి నుంచి నుండి జీతాలు తీసుకునే ఉద్యోగుల వరకు, రైతుల నుండి మహిళల వరకు అన్ని వర్గాలు ఆసక్తిగా ఉన్నాయి. 

కేంద్ర బడ్జెట్ 2026పై అంచనాలు ఏమిటి?

ఆస్తి, గృహ రుణాలు

ఒకవైపు భూముల ధరలు పెరుగుతుండగా, ప్రజలపై లోన్ భారం కూడా పెరిగింది. మరోవైపు గృహ కొనుగోలుదారులు పన్ను మినహాయింపు మరింత కోరుతున్నారు. గృహ రుణాలు (Home Loans)పై పన్ను మినహాయింపును పెంచాలని డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24(బి) కింద వడ్డీపై మినహాయింపు పరిమితి రూ. 2 లక్షలు. కాగా ఇది చాలా సంవత్సరాల క్రితం నిర్ణయించారు.  ప్రస్తుత పరిస్థితులలో ఇది సరిపోదని, మరింత పెంచాలని కేంద్రాన్ని కోరుతున్నారు. 

Union Budget 2026: పన్ను విధానంలో మార్పులు, ఆరోగ్య బీమాపై ఫోకస్.. కేంద్ర బడ్జెట్ 2026 పై ఎన్నో ఆశలు

అంతేకాకుండా, ప్లస్ క్యాష్ వ్యవస్థాపకుడు, CEO ప్రణవ్ కుమార్ మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ 2026-27లో పన్ను ఆదా, దీర్ఘకాలిక పెట్టుబడులను ప్రోత్సహించడంపై దృష్టిసారిస్తారని అన్నారు. ఇందులో స్టాండర్డ్ డిడక్షన్ పెంచడం, పన్ను శ్లాబ్‌లను సరళీకరించడం, గృహ రుణాలు (Home loans), ఇన్సూరెన్స్ సంబంధించిన అదనపు బెనిఫిట్స్ లభించే అవకాశం ఉందన్నారు.

ఆరోగ్య రంగంలో అంచనాలు

బజాజ్ బ్రోకింగ్ నివేదిక ప్రకారం, భారతదేశంలో ఆరోగ్య సేవల పరిధి నిరంతరం విస్తరిస్తోంది. నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ 2026లో దీనిని మరింత ప్రోత్సహిస్తారని పేర్కొంది. ఎక్కువ మందిని కవర్ చేయడానికి, దీర్ఘకాలిక చికిత్స కోసం హెల్త్ ఇన్సూరెన్స్ పథకాల పరిధిని పెంచవచ్చు.Union Budget 2026: పన్ను విధానంలో మార్పులు, ఆరోగ్య బీమాపై ఫోకస్.. కేంద్ర బడ్జెట్ 2026 పై ఎన్నో ఆశలు

అయితే, దీనివల్ల ఆరోగ్య రంగానికి సానుకూల ప్రోత్సాహం లభిస్తుంది. ప్రభుత్వ ధరలకు సేవలు అందించే విషయంలో ప్రైవేట్ ఆసుపత్రుల లాభాలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది.

మూలధన వ్యయం

బ్రోకింగ్ సంస్థ ఆనంద్ రాఠీ ప్రకారం.. ఆర్థిక ఏడాది 2026-27లో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత సంస్కరణల మార్గంలో ముందుకు సాగుతుంది. కేంద్ర బడ్జెట్‌లో పెద్ద లేదా ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకునే అవకాశం తక్కువ. సంస్థ ప్రకారం, బడ్జెట్‌లో ప్రభుత్వం మూలధన వ్యయాన్ని (క్యాపెక్స్) వార్షిక ప్రాతిపదికన దాదాపు 13 శాతం పెంచి 12.6 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లవచ్చు. క్యాపెక్స్-టు-జిడిపి నిష్పత్తి దాదాపు 3.2 శాతంగా ఉంటుందని అంచనా వేశారు.

Union Budget 2026: పన్ను విధానంలో మార్పులు, ఆరోగ్య బీమాపై ఫోకస్.. కేంద్ర బడ్జెట్ 2026 పై ఎన్నో ఆశలు

గురువారం నాడు కేంద్రం సమర్పించిన ఆర్థిక సర్వే నివేదికలో, ఆర్థిక సంవత్సరం 2026-27కి భారతదేశ వృద్ధి రేటు 6.8 శాతం నుండి 7.2 శాతం ఉంటుందని అంచనా వేశారు. ఆర్థిక సంవత్సరం 2026కి వాస్తవ సగటు దేశీయ ఉత్పత్తి (GDP) వృద్ధి రేటు 7.4 శాతం, కాగా స్థూల విలువ జోడింపు (GVA) 7.3 శాతంగా ఉంటుందని అంచనా వేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Embed widget