Stock Market Live updates: ఆకాశం వైపు స్టాక్ మార్కెట్ల పరుగులు - ట్రెండింగ్ స్టాక్స్ ఇవే!
Union Budget 2023 Market News live updates: నిర్మలా సీతారామన్ నేడు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ పద్దుపై ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఆసక్తితో ఉన్నారు. నేడు మార్కెట్లు ఎలా ఉన్నాయంటే!
LIVE
Background
Union Budget 2023 Market News live updates:
కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. ఎన్నికలకు ముందు మోదీ సర్కారు ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు పార్లమెంటులో బడ్జెట్‌పై ప్రసంగం మొదలు పెట్టనున్నారు. బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకులకు లోనవుతాయి. ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలు మదుపర్లుపై సానుకూల, ప్రతికూల ప్రభావం చూపించే సంగతి తెలిసిందే.
బడ్జెట్‌కు ముందు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టింది. వాటి వివరాలు
Economic Survey 2023 Highlights: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటులో ఆర్థిక సర్వే (2022-23)ను ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం తర్వాత నివేదికను విడుదల చేశారు. స్థూల ఆర్థిక సవాళ్ల వల్ల వచ్చే ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 6-6.8 శాతంగా ఉండొచ్చని సర్వే అంచనా వేసిందన్నారు. మూడేళ్లలో ఇదే కనిష్ఠమని వెల్లడించారు.
ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ద్రవ్యోల్బణం 6.8 శాతంగా ఉందని సర్వే తెలిపింది. ఇది ప్రైవేటు వినియోగాన్ని తగ్గించేంత ఎక్కువ కాదని అలాగే పెట్టుబడులను బలహీనపరిచేంత తక్కువ కాదని పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద దేశం భారత్ మాత్రమేనని వెల్లడించింది. కొనుగోలు శక్తిలో (PPP) ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థని తెలిపింది. మారకం రేటు ప్రకారం ఐదో అతిపెద్ద వ్యవస్థగా పేర్కొంది.
కరోనా, ఇతర అవాంతరాల వల్ల నిలిచిపోయిన ఆర్థిక వ్యవస్థ తిరిగి బలంగా పుంజుకుందని ఆర్థిక సర్వే తెలిపింది. కరోనాకు ముందు 8.7 శాతం వృద్ధిరేటు నమోదు చేసిందని వెల్లడించింది. 'ప్రపంచంలోని చాలా ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత్ ఈ సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొంది. కొవిడ్ 19 తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంది. రష్యా - ఉక్రెయిన్ యుద్ధంతో ద్రవ్యోల్బణం ఒత్తిడి పెరిగింది. ఫలితంగా భారత్ సహా అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచుతున్నాయి' అని వెల్లడించింది.
ప్రైవేటు వినియోగాన్ని తగ్గించేంత, పెట్టుబడులను బలహీనపరిచే స్థాయిలో ద్రవ్యోల్బణం లేదని సర్వే నివేదించింది. అయితే 2023 ఆర్థిక ఏడాదికి ఆర్బీఐ పెట్టుకున్న లక్ష్యం కన్నా కాస్త ఎక్కువగానే ఉందని వెల్లడించింది.
'అంతర్జాతీయంగా ముడి సరుకులు, లోహాల ధరలు పెరగడంతో కరెంటు ఖాతా లోటు (CAD) పెరిగింది. భారత వృద్ధి జోరు మాత్రం బలంగా ఉంది. కరెంటు ఖాతా లోటు పెరిగితే రూపాయి విలువపై ప్రభావం పడుతుంది. మొత్తంగా బాహ్య పరిస్థితులు బాగానే ఉన్నాయి. కరెంటు ఖాతా లోటును పూడ్చగల, రూపాయి ఒడుదొడుకులను నియంత్రించగల విదేశీ మారక ద్రవ్యం భారత్ వద్ద ఉంది' అని సర్వే తెలిపింది.
ధరల పెరుగుదల వల్ల అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు ఆశాజనకంగా లేదని ఆర్థిక సర్వే పేర్కొంది. అభివృద్ధి చెందిన దేశాలు, కేంద్ర బ్యాంకులు కీలక రెపో రేట్లను ఇంకా సవరించే అవకాశం ఉందని అంచనా వేసింది. అమెరికా ఫెడ్ వడ్డీరేట్లను పెంచితే రూపాయి బలహీనత కొనసాగే అవకాశం ఉందంది. వడ్డీరేట్ల పెంపు ఇలాగే కొనసాగితే దీర్ఘకాలం రుణభారం మరింత పెరుగుతుందని వెల్లడించింది.
Stock Market Updates: ట్రెండింగ్ స్టాక్స్
ఐసీఐసీఐ బ్యాంకు, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, లార్సెన్ అండ్ టుబ్రో, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. అదానీ, సన్‌ఫార్మా, అదానీ పోర్ట్స్, యూపీఎల్, బీపీసీఎల్, కోల్ ఇండియా, ఐటీసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
Stock Market Updates: ట్రెండింగ్ స్టాక్స్
ఐసీఐసీఐ బ్యాంకు, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, లార్సెన్ అండ్ టుబ్రో, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. అదానీ, సన్‌ఫార్మా, అదానీ పోర్ట్స్, యూపీఎల్, బీపీసీఎల్, కోల్ ఇండియా, ఐటీసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
Stock Market Updates: నిఫ్టీ, సెన్సెక్స్ దూకుడు
బెంచ్‌మార్క్ సూచీలు గరిష్ఠాల్లో కొనసాగుతున్నాయి. 17,731 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకిన నిఫ్టీ ప్రస్తుతం 137 పాయింట్ల లాభంతో 17,799 వద్ద కొనసాగుతోంది. బీఎస్‌ఈ నిఫ్టీ 518 పాయింట్లు ఎగిసి 69,067 వద్ద ట్రేడవుతోంది.
Stock Market Updates: రీబౌండ్ అయిన మార్కెట్లు!
ఉదయం భారీ లాభాలతో ఆరంభమైన మార్కెట్లు కాసేపు కనిష్ఠాలకు చేరుకున్నాయి. నిర్మలా సీతారామన్ ప్రసంగం ప్రారంభం అవ్వగానే గరిష్ఠాలకు చేరుకున్నాయి. రైల్వే ప్రాజెక్టులకు భారీ కేటాయింపులు చేయడంతో ఆ షేర్లు పరుగులు పెడుతున్నాయి.
Adani Group Shares: ఉదయం నష్టాల్లోనే అదానీ షేర్లు
బడ్జెట్ రోజు అదానీ గ్రూప్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ 3 శాతం, అదానీ పోర్ట్స్ 2 శాతం వరకు పతనం అయ్యాయి.