AP Cabinet Meeting : ఏపీ మంత్రిమండలి తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
AP Cabinet Decisions: సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఏపీ మంత్రిమండలి సమావేశమైంది. 2024-25 సంవత్సరానికి ప్రవేశ పెట్టే బడ్జెట్‌ను ఆమోదించింది.
Andhra Pradehs Cabinet News : సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఏపీ మంత్రిమండలి సమావేశమైంది. 2024-25 సంవత్సరానికి ప్రవేశ పెట్టే బడ్జెట్‌ను ఆమోదించింది. అనంతరం పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. నంద్యాల జిల్లా డోన్‌లో కొత్తగా హార్టికల్చరల్ పుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది కేబినెట్. డాక్టర్ వైఎస్‌ఆర్ హార్టికల్చర్ యూనివర్శిటీ పరిధిలో ఈ హార్టికల్చరల్ పాలిటెక్నికల్ కళాశాల పని చేయనుంది.
నంద్యాల జిల్లా డోన్‌లో వ్యవసాయరంగంలో రెండేళ్ల డిప్లొమా కోర్సుతో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్ యూనివర్శిటీ పరిధిలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల పని చేయనుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్శిటీస్ (ఎస్టాబ్లిస్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్ 2016కు సవరణలతో మూడు ప్రైవేటు యూనివర్శిటీలకు అనుమతి ఇచ్చారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమాచార్య యూనివర్శిటీ, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి గ్లోబల్ యూనివర్శిటీ, కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య యూనివర్శిటీ ఏర్పాటుకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉభయసభలనుద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగాన్ని కూడా మంత్రిమండలి ఆమోదించింది.