Budget AP Reactions : ఏపీకి బడ్జెట్‌లో కేటాయింపులపై సంతృప్తి - కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన టీడీపీ నేతలు
Andhra Pradesh : బడ్జెట్‌లో ఏపీ ప్రభుత్వానికి నిధులు కేటాయిపులు జరిపిన నిర్మలా సీతారామన్‌కు టీడీపీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి, పోలవరానికి నిధుల సాయం ప్రకటించడంపై సంతోషం వ్యక్తం చేశారు.
Budget Allocations for Andhra : ఆంధ్రప్రదేశ్‌కు బడ్దెట్‌లో ప్రాధాన్యం దక్కింది. అమరావతికి రూ. పదిహేను వేల కోట్లు ప్రకటించడంతో పాటు పోలవరం ప్రాజెక్టు వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని ప్రకటించారు. పోలవరానికి పెట్టే ప్రతి ఖర్చు నాబార్డు ద్వారా రీఎంబర్స్ చేస్తారు కాబట్టి బడ్జెట్ లో ప్రత్యేకంగా ఎంత మొత్తం అని చెప్పలేదు. ఇంకా ఏపీకి పారిశ్రామిక కారిడార్లు కూడా ప్రకటించారు. ఈ కేటాయింపులపై టీడీపీ నేతలు సంతృప్తి ప్రకటించారు. అమరావతి, జీవనాడి పోలవరం ప్రాజెక్టుల పూర్తి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి, జీవనాడి పోలవరం ప్రాజెక్టుల పూర్తి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. బడ్జెట్‌లో రూ.15 వేల కోట్లు కేటాయించి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కట్టుబడిన ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు… pic.twitter.com/CNbsH2owj6
— Lokesh Nara (@naralokesh) July 23, 2024
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక సాయం ప్రకటించడంపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సంతృప్తి వెలిబుచ్చారు. ఏపీ ఆశించినవన్నీ కేంద్ర బడ్జెట్‌లో పొందుపరిచారన్నారు. అమరావతికి రూ. 15 వేల కోట్లు ఇవ్వడంతో రాజధాని పనులను పరుగులు పెడతాయన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేంద్రం మరోసారి స్పష్టంగా హామీ ఇవ్వడం .. ఆగిపోయిన వెనుకబడిన ప్రాంతాలకు నిధులిస్తామని చెప్పడం రాష్ట్ర ప్రగతికి తొడ్పడుతుందని విశ్లేషించారు. ఏ ఏపీలో పారిశ్రామిక మౌళిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సాయం ఇవ్వడం వల్ల పారిశ్రామికాభివృద్ధి జరుగుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు పుంజుకునేలా కేంద్ర బడ్జెట్ లఉందన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధితో పాటు ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా కేటాయింపులు చేశారనితాయని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంతోషం ప్రకటించారు. రాజధాని అమరావతి అభివృద్ధికి 15 వేల కోట్లు కేటాయించిన NDA ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి కృృతజ్ఞతలుతెలిపారు. వెనుకబడిన ప్రాంతాలకు రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు కేటాయించారని దీని వల్ల అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందన్నారు.
ఆంధ్రప్రేదశ్ కు కేంద్రం ప్రత్యేక సాయం చేయడంపై జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి ( సంతోషం వ్యక్తం చేశారు. జనసేన తరపున కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రకటన జారీ చచేేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అమరావతికి రూ. 15 వేల కోట్లు ఇస్తామని ప్రకటించారని.. పోలవరం ప్రాజెక్టుకు 200 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో పూర్తి ఖర్చు కేంద్రం భరిస్తుందని చెప్పారని .. ..దేశానికి ఆహార భద్రత కల్పించాలంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి అని కేంద్ర మంత్రి చెప్పారని గుర్తు చేశారు. ఇవన్నీ ఏపీకి ఎంతో మేలు చేస్తాయన్నారు.