Budget 2022 Negative Reactions : "జీరో బడ్జెట్" .. నిర్మలమ్మ పద్దును తీసి పడేసిన విపక్షాలు !
కేంద్ర బడ్జెట్ వల్ల ప్రజలకు జీరో ఉపయోగం ఉంటుందని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రజల వద్ద నుంచి పన్నులు వసూలు చేసుకోవడమే అభివృద్ధిగా భావిస్తున్నారని విమర్శిస్తున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై విపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ప్రజల వద్ద నుంచి పన్నులను పిండుకోవడం తప్ప.. ఏ ఒక్క రంగానికి చేయూత ఇచ్చే ప్రయత్నం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నుల భారంతో దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కానీ మోదీ ప్రభుత్వం మాత్రం పన్నుల వసూళ్లే భారీ విజయంగా చెప్పుకుంటోంది. ఇక్కడే ప్రభుత్వ ఆలోచనా ధోరణి స్పష్టమవుతోంది. కేవలం వారు సంపదను మాత్రమే చూస్తున్నారు. సామాన్యుల బాధలను మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
M0di G0vernment’s Zer0 Sum Budget!
— Rahul Gandhi (@RahulGandhi) February 1, 2022
Nothing for
- Salaried class
- Middle class
- The poor & deprived
- Youth
- Farmers
- MSMEs
నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ కేవలం సంపన్నుల కోసం మాత్రమేనని పేదలకు.. మధ్యతరగతి వారికి ఏ మాత్రం ఉపయోగం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గే స్పష్టం చేశారు.
Budget is only for the rich; has nothing for the poor. It's Arjuna&Dronacharya's budget, not Eklavya's,(from Mahabharata). They also mentioned cryptocurrency, which doesn't have any law, nor has it been discussed before;budget benefitting their friends: Mallikarjun Kharge, RS LoP pic.twitter.com/SJbXHU6Ip3
— ANI (@ANI) February 1, 2022
ఈ బడ్జెట్‌తో మరో పాతికేళ్లయినా అచ్చేదిన్ కోసం సామాన్య ప్రజలు ఎదురు చూడాల్సిందేనని ఎంపీ శశిధరూర్ వ్యాఖ్యానించారు.
Extremely disappointing, a damp squib! There seems to be absolutely nothing in this Budget. It's an astonishingly disappointing Budget. When you listen to the speech, no mention of MGNREGA, of Defence, of any other urgent priorities facing the public: Congress MP Shashi Tharoor pic.twitter.com/9g2cg6nz0T
— ANI (@ANI) February 1, 2022
కరోనా కష్టకాలంలో ప్రజలు ఆకలితో అలమటిస్తూ కేంద్రం ఆహారంపై పెట్టే ఖర్చును తగ్గిస్తూ పోతోందని ఇది దుర్మార్గమని సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరీ విమర్శించారు. ఇది ధనవంతుల బడ్జెట్ అన్నారు.
Budget for whom?
— Sitaram Yechury (@SitaramYechury) February 1, 2022
The richest 10% Indians owns 75% of the country's wealth.
Bottom 60% own less than 5%.
Why are those who amassed super profits during the pandemic, while joblessness, poverty & hunger have grown, not being taxed more?#Budget2022
సామాన్యుల కోసం.. పేదల కోసం పైసా కూడా కేటాయించని పెగాసస్ స్పిన్ బడ్జెట్ అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు.
BUDGET HAS ZERO FOR COMMON PEOPLE, WHO ARE GETTING CRUSHED BY UNEMPLOYMENT & INFLATION. GOVT IS LOST IN BIG WORDS SIGNIFYING NOTHING - A PEGASUS SPIN BUDGET
— Mamata Banerjee (@MamataOfficial) February 1, 2022