అన్వేషించండి

Interim Budget 2024: మధ్య తరగతి ప్రజలకు గుడ్ న్యూస్ - కొత్త హౌసింగ్ పథకం ప్రకటించిన కేంద్రం, 300 యూనిట్ల వరకూ ఫ్రీ కరెంట్

Budget 2024 Highlights: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో మధ్య తరగతి గుడ్ న్యూస్ చెప్పారు. వారి సొంతింటి కల నెరవేర్చేలా కొత్త హౌసింగ్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

Interim Budget 2024 New Housing Scheme: కేంద్ర ప్రభుత్వం మధ్య తరగతి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు మధ్యంతర బడ్జెట్ - 2024 ప్రసంగంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కీలక ప్రకటన చేశారు. అర్హులైన వారికి ఇళ్ల కొనుగోలు, సొంతింటి నిర్మాణం కోసం కొత్త హౌసింగ్ స్కీమ్ (New Housing Scheme) తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. బస్తీలు, అద్దె ఇళ్లల్లో ఉండే వారి సొంతింటి కలను నిజం చేస్తామని అన్నారు. మురికివాడలు, అద్దె ఇళ్లల్లో ఉంటున్న వారు ఇళ్లు కట్టుకోవడానికి, కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుందని వెల్లడించారు. ఇందు కోసం జిల్లాలు, బ్లాక్ ల అభివృద్ధి కోసం రాష్ట్రాల కోసం పని చేస్తున్నామని తెలిపారు.

'3 కోట్ల ఇళ్ల నిర్మాణం'

పీఎం ఆవాస్ యోజన (PM Awas Yojana) కింద రాబోయే ఐదేళ్లలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టేలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మధ్య తరగతికి సొంతింటి నిర్మాణం కోసం తీసుకొచ్చిన 'పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్' కరోనా కాలంలోనూ కొనసాగించామని.. త్వరలో 3 కోట్ల ఇళ్ల నిర్మాణ లక్ష్యాన్ని చేరుకోనున్నట్లు తెలిపారు.పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని రాబోయే ఐదేళ్లు ఈ పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.

ఉచిత విద్యుత్

సామాన్యులకు విద్యుత్ బిల్లుల నుంచి ఊరట కల్పించేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ - 2024 ప్రసంగంలో కీలక ప్రకటన చేశారు. రూఫ్ టాప్ సోలారైజేషన్ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. దీని వల్ల ఏటా గృహ వినియోగదారులకు ఏటా రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకూ ఆదా అవుతుందని అన్నారు. కాగా, ఈ పథకంపై ప్రధాని మోదీ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

భారీగా రుణసాయం

వివిధ పథకాల ద్వారా ప్రజలకు భారీగా రుణ సాయం చేసినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. '78 లక్షల వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి పథకం ద్వారా రుణాలు మంజూరు చేశాం. మరో 2.30 లక్షల మందికి కొత్త రుణాలు ఇవ్వనున్నాం. డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) ద్వారా జన్ దన్ ఖాతాలకు రూ.34 లక్షల కోట్లు బదిలీ చేశాం. దీని వల్ల ప్రభుత్వానికి రూ.2.7 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. స్కిల్ ఇండియా మిషన్ కింద 1.4 కోట్ల మంది యువకులకు నైపుణ్య శిక్షణ అందించాం. పీఎం ముద్ర యోజన కింద రూ.22.5 లక్షల కోట్లు విలువైన రుణాలు మంజూరు చేశాం.' అని వివరించారు.

Also Read: Railway Budget 2024: రైల్వేకు కొత్త సొబగులు - బడ్జెట్ లో రైల్వే శాఖకు కేటాయింపులు ఇలా!

టాప్ హెడ్ లైన్స్

Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget