News
News
X

వచ్చే ఏడాది పాటు ఉచిత రేషన్ - బడ్జెట్ 2023లో ప్రకటించిన నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2023లో కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది పాటు పీఎం గరీబ్ కల్యాణ్ యోజన ప్రయోజనాన్ని ప్రజలు పొందుతారని చెప్పారు.

FOLLOW US: 
Share:

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2023-2024 బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ పేదలకు పెద్ద ఉపశమనం కలిగించారు. పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పిఎంజికెఎవై)ను ఒక సంవత్సరం పాటు పొడిగిస్తున్నట్లు చెప్పారు. అంటే వచ్చే ఏడాది పాటు ప్రజలకు ఉచిత రేషన్ అందుతుంది.

పీఎం గరీబ్ కల్యాణ్ యోజన అంటే ఏమిటి?

భారతదేశంలోని ప్రతి ఇంట్లో ఎవరూ ఆకలితో నిద్రపోకూడదనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, కరోనా మహమ్మారి సమయంలో మోడీ ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పిఎంజికెఎవై) ను ప్రారంభించింది. నిరుపేదలకు 5 కిలోల ఉచిత ఆహార ధాన్యాలు ఇవ్వాలనే నిబంధన ఉంది. కేంద్ర ప్రభుత్వ పీఎం గరీబ్ కల్యాణ్ యోజన కింద 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ అందుతోంది. ఈ పథకాన్ని సెప్టెంబర్ 2022లో క్లోజ్ చేయాలని అనుకున్నారు. కానీ తరువాత దాన్ని గడువును పొడిగిస్తూ వస్తున్నారు. 

బడ్జెట్ లో తమ ప్రభుత్వం అన్ని వర్గాలకు చేరువయ్యేందుకు ప్రయత్నించిందన్నారు నిర్మలా సీతారామన్న. యువతకు, అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక బలాన్ని అందించడమే మా ప్రయత్నమన్నారు. ప్రపంచంలో మాంద్యం ఉన్నప్పటికీ, భారతదేశంలో ప్రస్తుత వృద్ధి రేటు 7 శాతంగా ఉంది. సవాళ్లతో నిండిన ఈ సమయంలో భారత్ వేగవంతమైన అభివృద్ధి దిశగా పయనిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు భారత్ అభివృద్ధిని ప్రశంసించారు. వచ్చే 25 ఏళ్లకు ఈ బడ్జెట్ బ్లూప్రింట్. కరోనా మహమ్మారిపై గెలిచి... దేశాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లిందని, భారతదేశం బలాన్ని ప్రపంచం గుర్తించిందని అన్నారు.

మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన చివరి పూర్తి బడ్జెట్ ఇదే కావడం గమనార్హం. వచ్చే ఏడాది ఎన్నికలకు ముందు మాత్రమే మోడీ ప్రభుత్వం సప్లిమెంటరీ బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. దేశంలోని కోట్లాది మంది రైతులను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తుంది. అందుకే దేశ ప్రజలు కూడా ఈసారి బడ్జెట్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. 

Published at : 01 Feb 2023 12:08 PM (IST) Tags: PMGKAY Nirmala Sitharaman Budget 2023 Union Budget 2023

సంబంధిత కథనాలు

FM Nirmala Sitharaman: బ్యాంకుల ఎండీలతో నిర్మల మీటింగ్‌ - ఏదైనా షాకింగ్‌ న్యూస్‌ ఉండబోతోందా!

FM Nirmala Sitharaman: బ్యాంకుల ఎండీలతో నిర్మల మీటింగ్‌ - ఏదైనా షాకింగ్‌ న్యూస్‌ ఉండబోతోందా!

AP Budget 2023: బడ్జెట్‌లో విద్యారంగానికి పెద్దపీట, దేనికెంత కేటాయించారంటే?

AP Budget 2023: బడ్జెట్‌లో విద్యారంగానికి పెద్దపీట, దేనికెంత కేటాయించారంటే?

2 లక్షల 79 వేల కోట్లతో ఏపీ బడ్జెట్‌- రెవెన్యూ లోటు 22,316 కోట్లుగా పేర్కొన్న బుగ్గన

2 లక్షల  79  వేల కోట్లతో ఏపీ బడ్జెట్‌- రెవెన్యూ లోటు  22,316 కోట్లుగా పేర్కొన్న బుగ్గన

బడ్జెట్‌ 2023-24కు ఏపీ కేబినెట్ ఆమోదం- అన్ని వర్గాలకు, అభివృద్ధికి ప్రాధాన్యత ఉంటుందన్న బుగ్గన

బడ్జెట్‌ 2023-24కు ఏపీ కేబినెట్ ఆమోదం- అన్ని వర్గాలకు, అభివృద్ధికి ప్రాధాన్యత ఉంటుందన్న బుగ్గన

PM Modi: ప్రైవేటు కంపెనీలకు ఈ రంగం ఒక బంగారు గని - ప్రధాని మోదీ

PM Modi: ప్రైవేటు కంపెనీలకు ఈ రంగం ఒక బంగారు గని - ప్రధాని మోదీ

టాప్ స్టోరీస్

Mla Rapaka : దొంగ ఓట్లతో గెలిచానని అనలేదు, నా మాటలు వక్రీకరించారు- ఎమ్మెల్యే రాపాక వివరణ

Mla Rapaka : దొంగ ఓట్లతో గెలిచానని అనలేదు, నా మాటలు వక్రీకరించారు- ఎమ్మెల్యే రాపాక వివరణ

Group 1 Mains Postponed : ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

Group 1 Mains Postponed :  ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

Ravanasura Trailer : వాడు లా చదివిన క్రిమినల్ - రవితేజ 'రావణాసుర' ట్రైలర్ వచ్చిందోచ్

Ravanasura Trailer : వాడు లా చదివిన క్రిమినల్ - రవితేజ 'రావణాసుర' ట్రైలర్ వచ్చిందోచ్

Prashanth Reddy: ఆరుగురు మోడీలు ప్రజల డబ్బులు కాజేసి విదేశాల్లో తలదాచుకున్నారు: మంత్రి ప్రశాంత్ రెడ్డి

Prashanth Reddy: ఆరుగురు మోడీలు ప్రజల డబ్బులు కాజేసి విదేశాల్లో తలదాచుకున్నారు: మంత్రి ప్రశాంత్ రెడ్డి