అన్వేషించండి

Union Budget 2024: 9 ప్రాధాన్య అంశాల ఆధారంగా కేంద్ర బడ్జెట్ - ఆ 4 రంగాలపై ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ఫోకస్

Budget 2024: ఈసారి బడ్జెట్‌లో యువత, మహిళలు, రైతులు, పేదలకు మేలు చేకూర్చేలా నిర్మలమ్మ ఎక్కువగా ఫోకస్ చేశారు. మొత్తం 9 ప్రాధాన్య అంశాల ఆధారంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు.

Prorities In Union Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి 9 ప్రాధాన్య అంశాల ఆధారంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, యువతకు ఉద్యోగ కల్పన - నైపుణ్యాభివృద్ధి, సామాజిక న్యాయం, ఇంధన భద్రత, పట్టణాభివృద్ధి, మౌలిక రంగం, పరిశోధన - ఆవిష్కరణలు, తయారీ - సేవలు, భవిష్యత్ సంస్కరణలు వంటి అంశాలను బడ్జెట్‌లో ప్రస్తావించారు. ఈ ప్రాధామ్యాలపై భవిష్యత్ బడ్జెట్స్ కూడా ఆధారపడి ఉంటాయని తెలిపారు. వీటిలో సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు (MSME), మధ్య తరగతి రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ఎక్కువగా మహిళలు, రైతులు, పేదలు, యువతకు మేలు చేకూర్చేలా బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు.

యువతకు ప్రాధాన్యం

రాబోయే ఐదేళ్లలో రూ.2 లక్షల కోట్లతో 4.1 కోట్ల మంది యువతకు ప్రయోజనం చేకూర్చే పథకాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తుందని నిర్మలమ్మ తెలిపారు. అలాగే, 20 లక్షల మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేలా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్స్ అభివృద్ధి చేస్తామని చెప్పారు. భారతీయ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు రూ.10 లక్షల వరకూ విద్యా రుణాలు ఇస్తామని అన్నారు. 

విద్య, నైపుణ్యాభివృద్ధి - రూ.1.48 లక్షల కోట్లు

ఈసారి బడ్జెట్‌లో విద్య, నైపుణ్యాభివృద్ధి కోసం అధికంగా నిధులు కేటాయించారు. ఉద్యోగాల కల్పన, నైపుణ్యాభివృద్ధికి రెండో ప్రాధాన్యత ఇస్తున్నామని.. ఇందు కోసం రూ.1.48 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 

రైతులు, మహిళల కోసం

బడ్జెట్‌లో వ్యవసాయం, మహిళ, మౌలిక సదుపాయాల కల్పన కోసం నిర్మలమ్మ ఎక్కువగా ఫోకస్ పెట్టారు. వచ్చే రెండేళ్లలో కోటి మంది రైతులను సేంద్రీయ వ్యవసాయం దిశగా ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. కూరగాయల ఉత్పత్తి పెద్దఎత్తున చేపట్టేలా క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 5 రాష్ట్రాల్లో కిసాన్ క్రెడిట్ కార్డులు అందిస్తామన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధికి రూ.1.5 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, మహిళలు, బాలికల కోసం రూ.3 లక్షల కోట్లతో పథకాలు అమలు చేయనున్నట్లు వెల్లడించారు. మౌలిక సదుపాయాల కల్పనకు రూ.11.11 లక్షల కోట్లు కేటాయించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balapur Ganesh Laddu Auction: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతలు వీరే
రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతలు వీరే
YSRCP Merge With Congress: షర్మిల అడ్డుపడకపోతే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యుండేది! సంచలనం రేపుతున్న పోస్ట్
YSRCP Merge With Congress: షర్మిల అడ్డుపడకపోతే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యుండేది! సంచలనం రేపుతున్న పోస్ట్
Hyderabad News: లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సింపుల్‌గా గుడిలో పెళ్లి చేసుకున్న అదితి రావు, సిద్దార్థ - ఫొటోలు వైరల్ట్రాఫిక్ వాలంటీర్లుగా గౌరవంగా బతుకుతామంటున్న ట్రాన్స్‌జెండర్స్‌వేలంలో రూ.32 కోట్ల ధర పలికిన ఐన్‌స్టీన్‌ లెటర్‌, అందులో ఏముందో తెలుసా?ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం, గోల్ఫ్‌కోర్ట్ సమీపంలో కాల్పులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balapur Ganesh Laddu Auction: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతలు వీరే
రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతలు వీరే
YSRCP Merge With Congress: షర్మిల అడ్డుపడకపోతే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యుండేది! సంచలనం రేపుతున్న పోస్ట్
YSRCP Merge With Congress: షర్మిల అడ్డుపడకపోతే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యుండేది! సంచలనం రేపుతున్న పోస్ట్
Hyderabad News: లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
Nipah virus: కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్:
కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్
Jani Master: జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...
జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...
Aditi Rao Hydari Siddharth Wedding: పెళ్లితో ఒక్కటైన సిద్ధార్థ్, అదితి రావు హైదరి - డేటింగ్ పక్కన పెట్టి మ్యారేజ్ వరకు
పెళ్లితో ఒక్కటైన సిద్ధార్థ్, అదితి రావు హైదరి - డేటింగ్ పక్కన పెట్టి మ్యారేజ్ వరకు
Revanth Reddy: నేడు సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి
నేడు సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Embed widget