Priyanka Gandhi: 5 శాతం మంది కోసమే కేంద్ర బడ్జెట్ 2026 - మోదీ ప్రభుత్వంపై ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్ విమర్శలు
Union Budget 2026 | కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కేంద్ర బడ్జెట్ 2026పై విమర్శలు గుప్పించారు. ఎవరికీ ప్రయోజనం లేదన్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికాసేపట్లో పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ బడ్జెట్ దేశ ప్రజలందరి కోసం కాదని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్ పై తమకు ఎలాంటి అంచనాలు లేవని అన్నారు. కేంద్రం ఏ వర్గానికి న్యాయం చేయడం లేదని విమర్శించారు.
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సైతం కేంద్ర బడ్జెట్ పై వ్యంగ్యంగా స్పందించారు. "ఏ ప్రభుత్వంపై అయితే ఎటువంటి ఆశలు లేవో, ఆ ప్రభుత్వం బడ్జెట్‌పై ఎవరికి అంచనాలు ఉంటాయి. ఈ బడ్జెట్ దేశ ప్రజల్లో 5 శాతం మంది కోసం మాత్రమే ప్రవేశపెడుతున్నారు". దేశంలో, రాజధాని ఢిల్లీలో కాలుష్యం సమస్యను లేవనెత్తారు. "ప్రపంచంలోనే అతిపెద్ద వేదికపై మీ దేశంలో గాలి నాణ్యత సరిగ్గా లేదని, దీనివల్ల ప్రాణాలు పోతున్నాయని, పెట్టుబడులు కూడా రావని ప్రశ్న తలెత్తింది" అన్నారు.
#WATCH | Delhi | On Union Budget 2026-27, Samajwadi Party MP Akhilesh Yadav says," What expectations can we have from the budget being presented by the govt from whom we don't have any expectations?... In the last few budgets we have seen, it was for only 5% of the people. The… pic.twitter.com/t1ndqSlz52
— ANI (@ANI) February 1, 2026
























