WhatsApp Users: కేర్‌లెస్‌గా వాట్సాప్ స్టేటస్ పెడుతున్నారా! జైలుకు వెళ్తారు జాగ్రత్త!
WhatsApp Users: ఇకపై వాట్సాప్‌లో స్టేటస్‌లు పెట్టేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండటం అవసరం. యూజర్లు కొంత బాధ్యతా యుతంగా ఉండాలని బాంబే హైకోర్టు ఆదేశించింది.
WhatsApp Users:
సోషల్ మీడియాలో ఏం షేర్ చేసుకున్నా పర్లేదు అనే భావన చాలా మందిలో గూడు కట్టుకుపోయింది. అది తమ వాక్ స్వాంత్ర్యానికి ప్రతిబింబం అనే భావన పెరిగింది. అయితే ఈ మధ్యన కొన్ని వర్గాలు, మతాలను కించపరుస్తూ పోస్టులు పెట్టడం కొందరికి అలవాటుగా మారింది. నిజానిజాలు తెలుసుకోకుండానే వాట్సాప్‌లో స్టేటస్‌లు పెట్టేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ యాక్ట్‌పై వారికి ఎక్కువ అవగాహన లేకపోవడమే ఇందుకు కారణం!
ఇకపై వాట్సాప్‌లో స్టేటస్‌లు (WhatsApp Status) పెట్టేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండటం అవసరం. మీరు సమాచారం చేరవేసేది మీ కాంటాక్ట్‌లో ఉన్నవారికే అయినప్పటికీ కొంత బాధ్యతా యుతంగా ఉండాలని బాంబే హైకోర్టు (Bombay Highcourt) ఆదేశించింది. మితిమీరితే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది. జస్టిస్ వినయ్ జోషి, జస్టిస్ వాల్మీకితో కూడిన ధర్మాసనం జులై 12న ఓ కేసు విచారణలో ఈ వ్యాఖ్యలు చేసింది. కాంటాక్టు లిస్టులోని వారు స్టేటస్‌ను పదేపదే గమనిస్తుంటారని వెల్లడించింది.
ఓ మతానికి సంబంధించిన మనోభావాలు దెబ్బతీశారని 27 ఏళ్ల లండ్కర్‌పై ముంబయిలో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఎస్‌సీ, ఎస్టీ అట్రాసిటీ, ఐటీ యాక్ట్ (IT Act) ప్రకారం కేసులు పెట్టారు. దానిని కొట్టేయాలని కోరుతూ అతడు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సమయంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వాట్సాప్‌లో చిత్రాలు, వీడియోలతో స్టేటస్‌లు పెట్టొచ్చని, అవి యూజర్ ఆలోచనలను ప్రతిబింబిస్తాయని తెలిపింది. ఇవి 24 గంటల్లో మాయం అవుతాయంది. కాంటాక్టు లిస్టులో తెలిసిన వాళ్లకు కమ్యూనికేషన్ ఇవ్వడమే దీని ఉద్దేశమని వెల్లడించింది.
నిజానికి 2023, మార్చిలో లండ్కర్‌పై కేసు నమోదైంది. వాట్సాప్ స్టేటస్‌లో అతడు ఓ మతాన్ని కించపరిచేలా ప్రశ్నలు పెట్టాడు. వాటినిన గూగుల్‌లో శోధించేలా ప్రేరేపించాడు. అందులో వచ్చిన సెర్చ్ రిజల్ట్స్ మత సెంటిమెంట్లను కించపర్చేలా ఉన్నాయి. అయితే తనకు ఎలాంటి ద్వేషం, దురుద్దేశం లేదని లండ్కర్ వాదించారు. తను పెట్టిన స్టేటస్ తన కాంటాక్ట్ లిస్టులో సేవ్ చేసిన వారికే వెళ్తుందని పేర్కొన్నారు. అయితే నిందితుడి స్టేటస్ ఇతరులను గూగుల్‌లో సమాచారం శోధించేలా ప్రేరేపించిందని కోర్టు పేర్కొంది.
Also Read: ఈపీఎఫ్ వడ్డీరేటు డిక్లేర్! FY 2022-23కి ఎంత చెల్లిస్తున్నారంటే?
వాట్సాప్ స్టేటస్ పరిమితంగానే సర్క్యూలేట్ అయినప్పటికీ లండ్కర్‌ను బాధ్యుడిని చేయక మానదని కోర్టు తెలిపింది. సెంటిమెంట్లను దెబ్బతీసే సమాచారం ప్రదర్శించడం న్యాయం కాదని వెల్లడించింది. షేర్ చేసిన కంటెంట్‌కు లండ్కర్ బాధ్యడు కాక తప్పదని స్పష్టం చేసింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial