అన్వేషించండి

Tata Docomo: కోర్టు తీర్పు అమలు చేస్తే జీఎస్టీ కట్టాలన్న అధికారులు - కోర్టు ఇచ్చిన తీర్పు ఇదే

Tata Docomo Case: కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తూ పరిహారం చెల్లించింది టాటా సంస్థ. అయితే అలా చేయడం సేవ కిందకు వస్తుందని జీఎస్టీ కట్టాలని నోటీసులు ఇచ్చారు. కానీ కోర్టు తిప్పికొట్టింది.

Bombay HC quashes 1524 cr IGST demand: కార్పొరేట్ వివాదాల పరిష్కార ప్రక్రియలో పన్ను అధికారుల వింత పోకడలకు బాంబే హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. టాటా సన్స్, జపాన్ టెలికాం దిగ్గజం ఎన్టీటీ డోకోమో  మధ్య జరిగిన  సెటిల్‌మెంట్‌పై జీఎస్టీ వసూలు చేయాలన్న అధికారుల ప్రయత్నాన్ని కోర్టు హాస్యాస్పదం  అని కొట్టిపారేసింది. ఈ తీర్పు కేవలం టాటా సంస్థకే కాకుండా, దేశీయ కార్పొరేట్ రంగానికి పెద్ద ఊరటనిచ్చింది.

 ఇన్వెస్ట్‌మెంట్ నుంచి ఇంటర్నేషనల్ కోర్టు వరకు 

ఈ వివాదం మూలాలు 2009లో ఉన్నాయి. టాటా టెలీసర్వీసెస్‌లో డోకోమో భారీ పెట్టుబడి పెట్టింది. అయితే, వ్యాపారం నష్టాల్లో సాగడంతో ఒప్పందం ప్రకారం తన వాటాను విక్రయించి బయటకు వెళ్లాలని డోకోమో నిర్ణయించుకుంది. షేర్ల ధర విషయంలో తలెత్తిన విభేదాల కారణంగా ఈ వివాదం లండన్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానానికి  చేరింది. అక్కడ డోకోమోకు అనుకూలంగా తీర్పు రావడంతో, టాటా సన్స్ సుమారు 8,450 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు జోక్యంతో ఈ చెల్లింపులు పూర్తయ్యాయి. డోకోమో తన అంతర్జాతీయ వ్యాజ్యాలను ఉపసంహరించుకుంది.

కేసు వేయకపోవడం ఒక సేవేనని పన్ను 

ఇక్కడే జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం ఒక వినూత్నమైన వాదనను తెరపైకి తెచ్చింది. డోకోమో తన కేసులు ఉపసంహరించుకోవడాన్ని ఒక సేవగా పరిగణించింది. జీఎస్టీ చట్టంలోని ఒక చర్యకు దూరంగా ఉండటానికి అంగీకరించడం అనే నిబంధనను దీనికి అన్వయించింది. అంటే, టాటా డబ్బులు ఇచ్చింది కాబట్టే డోకోమో కేసులు వేయకుండా ఆగిపోయిందని, కాబట్టి ఆ పరిహారం మొత్తంపై 18 శాతం చొప్పున 1,524 కోట్లు పన్ను చెల్లించాలని టాటా సన్స్‌కు నోటీసులు జారీ చేసింది.  

చట్టాన్ని అతిగా ఊహించకండని హైకోర్టు ఆగ్రహం

ఈ నోటీసులను సవాలు చేస్తూ టాటా సన్స్ బాంబే హైకోర్టును ఆశ్రయించగా, జస్టిస్ జీఎస్ కుల్కర్ణి, జస్టిస్ ఆర్తీ సాఠేలతో కూడిన ధర్మాసనం అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం చెల్లించిన పరిహారాన్ని  వ్యాపార లావాదేవీ గా చూడటం అసంబద్ధమని తేల్చిచెప్పింది.  ఒక కోర్టు తీర్పును అమలు చేయడం అనేది చట్టబద్ధమైన ప్రక్రియ, అది ఒక సేవ కాదు. ఇలాంటి వాటికి పన్ను ముడిపెట్టడం హాస్యాస్పదం  అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పన్ను అధికారులు చట్టంలోని నిబంధనలను తమకు నచ్చినట్లుగా, అతిగా ఊహించుకుంటూ అన్వయించకూడదని గట్టిగా హెచ్చరించింది.

కార్పొరేట్ రంగానికి దిక్సూచిగా ఈ తీర్పు

ఈ తీర్పుతో టాటా సన్స్‌కు రూ.1,524 కోట్ల భారీ భారం తప్పడమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి వివాదాలకు ఒక స్పష్టత లభించింది. న్యాయపరమైన సెటిల్‌మెంట్లు, నష్టపరిహారాలు, కోర్టు వెలుపల జరిగే రాజీ ఒప్పందాలు సేవల పరిధిలోకి రావని హైకోర్టు స్పష్టం చేసింది. ఇది పన్నుల పేరుతో కంపెనీలపై జరిగే వేధింపులకు అడ్డుకట్ట వేయడమే కాకుండా, విదేశీ పెట్టుబడిదారుల్లో భారత న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని పెంచుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఈ కీలక తీర్పు ద్వారా, కోర్టు డిక్రీలు ,  చట్టపరమైన పరిహారాలు జీఎస్టీ పరిధిలోకి రావనే స్పష్టత రావడంతో, సివిల్ ,  కార్పొరేట్ వివాదాల్లో చిక్కుకున్న అనేక కంపెనీలకు పెద్ద ఊరట లభించినట్లయింది. అధికారుల ట్యాక్స్ అడ్వెంచర్ కు న్యాయస్థానం ముకుతాడు వేసిన ఈ కేసు, పన్నుల పరిధి ఎక్కడివరకు ఉండాలనే అంశంపై ఒక మైలురాయిగా నిలిచిపోనుందని వ్యాపారవర్గాలు అంచనా వేస్తున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Embed widget